Upasana Konidela: కామాఖ్య ఆలయంలో ఉపాసన కొణిదెల ప్రత్యేక పూజలు.. 'న్యూ బిగినింగ్స్' పోస్ట్‌తో మెగా అభిమానుల్లో చర్చ!

Upasana Konidela: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల అస్సాంలోని గువాహటిలో ఉన్న కామాఖ్య దేవి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ‘న్యూ బిగినింగ్స్’ అని క్యాప్షన్ జోడించడం హాట్ టాపిక్ గా మారింది.

Published on: Sep 12, 2026, 19:35:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Upasana Konidela: ఉపాసన కొణిదెల పేరు మరోసారి ట్రెండింగ్ గా మారింది. ఆమె అస్సాంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం గువాహటి కామాఖ్య దేవి ఆలయాన్ని సందర్శించారు. రెడ్ కలర్ సాంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ఉపాసన.. అమ్మవారికి పూలబుట్టలను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆమె ఫొటోలు వైరల్ గా మారాయి.

కామాఖ్య ఆలయంలో ఉపాసన కొణిదెల ప్రత్యేక పూజలు.. 'న్యూ బిగినింగ్స్' పోస్ట్‌తో మెగా అభిమానుల్లో చర్చ! (instagram)
కామాఖ్య ఆలయంలో ఉపాసన కొణిదెల ప్రత్యేక పూజలు.. 'న్యూ బిగినింగ్స్' పోస్ట్‌తో మెగా అభిమానుల్లో చర్చ! (instagram)

ఉపాసన న్యూ బిగినింగ్స్

ఈ ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలను ఉపాసన తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. "అమ్మ కామాఖ్య మనలోని దైవత్వాన్ని వెలికితీసి, రాక్షసత్వాన్ని అంతమొందించాలి. న్యూ బిగినింగ్స్.. డివైన్ శక్తి ధర్మ సేవ కర్మ" అంటూ పెట్టిన క్యాప్షన్ మెగా అభిమానులలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది. అయితే ఈ 'కొత్త ప్రారంభం' దేనికి సంబంధించినదనే వివరాలను ఆమె స్పష్టంగా వెల్లడించలేదు.

ఆ సస్పెన్స్ ఏంటీ?

మెగా కుటుంబంలో ఏ చిన్న ఆధ్యాత్మిక సంఘటన జరిగినా లేదా సోషల్ మీడియా పోస్ట్ వచ్చినా అది సోషల్ మీడియా ట్రెండ్స్‌ను శాసిస్తుంది. ఉపాసన కొణిదెల కేవలం ఒక స్టార్ హీరో భార్యగానే కాకుండా అపోలో హాస్పిటల్స్ అండ్ యువర్ ఆటో కాన్సెప్ట్‌ల ద్వారా పారిశ్రామికవేత్తగా, సామాజిక కార్యకర్తగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించారు.

గతంలో కూడా ఆమె ఏవైనా కొత్త వ్యాపార ప్రాజెక్టులు, హెల్త్‌కేర్ ఇనిషియేటివ్‌లు లేదా సేవా కార్యక్రమాలు ప్రారంభించే ముందు ప్రముఖ శక్తిపీఠాలను దర్శించుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ తన తదుపరి భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లకు సిద్ధమవుతున్న తరుణంలో, ఉపాసన 'న్యూ బిగినింగ్స్' అని పేజీలో పేర్కొనడం కొత్త బిజినెస్ వెంచర్ లేదా భారీ సేవా సంస్థ ఆరంభానికి సంకేతమని సినీ అండ్ బిజినెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

పిల్లలతో పండగ

ఇటీవలే జన్మాష్టమి పండగను ఉపాసన-రామ్ చరణ్ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో వేడుకగా జరుపుకున్నారు. ఈ ఏడాది జనవరి 31న జన్మించిన తమ కవల పిల్లలు అన్వీరా దేవి, శివరామ్‌లకు ఇది తొలి జన్మాష్టమి కావడంతో పూజా కార్యక్రమాల్లో చరణ్, ఉపాసన దంపతులు తమ పెద్ద కుమార్తె క్లిన్ కారాతో కలిసి పాల్గొన్నారు.

పెద్ది విజయంతో

మరోవైపు రామ్ చరణ్ హీరోగా నటించిన భారీ చిత్రం 'పెద్ది' ఈ ఏడాది జూన్‌లో థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. అనంతరం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. పెద్ది విజయంతో మెగా ఫ్యామిలీ ఫుల్ జోష్ లో ఉంది. మణికట్టుకు సర్జరీ చేయించుకున్న రామ్ చరణ్ ఇప్పుడు సుకుమార్ మూవీ కోసం రెడీ అవుతున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More