...
...
Next Story

ఈ రెసిపీ కచ్చితంగా ట్రై చేయండి.. ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఉపాసన సలహా.. బాలీవుడ్ డైరెక్టర్ వంటకాన్ని ఫాలో అవుతూ..

రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల ప్రస్తుతం గర్భంతో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆమె కడుపుతో ఉన్న వారి కోసం ఓ నోరూరించే వంటకాన్ని ట్రై చేయమని సలహా ఇస్తోంది. ఆ వంటకం చేసింది బాలీవుడ్ డైరెక్టర్ ఫరా ఖాన్ కావడం విశేసం.

Published on: Dec 15, 2025, 17:35:44 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల ప్రస్తుతం కవల పిల్లలతో గర్భవతిగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తన 'ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్' (గర్భిణీగా ఉన్నప్పుడు తినాలనిపించే కోరికలు) తీర్చుకోవడానికి బాలీవుడ్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ఫరా ఖాన్ ఫేమస్ 'రోస్ట్ చికెన్' వండుకుని తినడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది.

ఉపాసన ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్

ఈ రెసిపీ కచ్చితంగా ట్రై చేయండి.. ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఉపాసన సలహా.. బాలీవుడ్ డైరెక్టర్ వంటకాన్ని ఫాలో అవుతూ..
ఈ రెసిపీ కచ్చితంగా ట్రై చేయండి.. ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఉపాసన సలహా.. బాలీవుడ్ డైరెక్టర్ వంటకాన్ని ఫాలో అవుతూ..

రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె రెండోసారి గర్భం దాల్చిన విషయం తెలిసిందే. ఈసారి కవల పిల్లలు పుట్టబోతున్నట్లు ఇటీవలే అనౌన్స్ చేశారు. తాజాగా తన ప్రెగ్నెన్సీ సమయంలో తినాలనిపించిన వంటకాన్ని స్వయంగా వండుకున్న వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.

బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్, ఫిల్మ్ మేకర్ ఫరా ఖాన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో సెలబ్రిటీలతో కలిసి వంటలు చేస్తూ ఉంటుంది. ఆమె చేసే 'రోస్ట్ చికెన్' చాలా ఫేమస్. ఉపాసన కూడా ఇదే రెసిపీని ట్రై చేసింది.

"ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్, పోషకాహారం రెండూ దొరికాయి! అద్భుతమైన రెసిపీ.. అందరూ తప్పక ప్రయత్నించండి" అని రాస్తూ ఫరా ఖాన్‌ను ట్యాగ్ చేసింది ఉపాసన.

ఉపాసన, రామ్ చరణ్ పెళ్లి, పిల్లలు

2012లో పెళ్లి చేసుకున్న రామ్ చరణ్, ఉపాసన దంపతులకు 2023 జూన్‌లో మొదటి సంతానంగా క్లిన్ కారా (Klin Kaara) జన్మించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో దీపావళి సందర్భంగా తాము కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లు ఈ జంట ప్రకటించింది. సీమంతం వీడియోను కూడా పంచుకుంది.

మరోవైపు రామ్ చరణ్ విషయానికి వస్తే అతడు శంకర్ దర్శకత్వంలో చేసిన 'గేమ్ ఛేంజర్' ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం అతడు 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe