రామ్ పోతినేని ఇప్పుడు ఆంధ్రా కింగ్ తాలూకా అనే మరో సినిమాతో వస్తున్నాడు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న అతడు.. ఈ మూవీపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. నవంబర్ 27న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి.. తాజాగా ఉపేంద్ర ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అసలు ఆంధ్రా కింగ్ ఎవరన్నదే సస్పెన్స్ అని అన్నాడు.
ఆంధ్రా కింగ్ ఎవరో?

ఆంధ్రా కింగ్ తాలూకా పేరుతో రామ్ తో కలిసి ఉపేంద్ర వస్తున్నాడు. ఇందులో అతడు ఓ స్టార్ హీరో సూర్యగా, అతని వీరాభిమాని సాగర్ పాత్రలో రామ్ పోతినేని కనిపిస్తున్నారు. అయితే టైటిల్ ను బట్టి ఆంధ్రా కింగ్ ఎవరో ఊహించవచ్చు. కానీ అక్కడే ఓ ట్విస్టు ఉందని ఉపేంద్ర అంటున్నాడు. మిమ్మల్ని ఆంధ్రా కింగ్ ను చేశారు అని యాంకర్ ప్రశ్న అడగగా.. ఆంధ్రా కింగ్ ఎవరో సినిమా చూస్తే తెలుస్తుంది.. రియల్ ఆంధ్రా కింగ్ ఎవరో.. నేను, రామ్ కాదు ఇంకో ట్విస్ట్ కూడా ఉంటుందని ఉపేంద్ర అన్నాడు.
ఆంధ్రా కింగ్ సినిమాలో స్టార్, ఫ్యాన్ మధ్య స్టోరీ అనే పాయింట్ లో చాలా ఎక్స్‌ట్రార్డినరీ పాయింట్ పెట్టారు.. బిగినింగ్ లో ఓ సీన్ లో ఓ డైలాగ్ పెట్టారు.. చివరికి అదే నిజమవుతుంది.. మొదట నాకు అర్థం కాలేదు.. ఇదో ఇంట్రడక్షన్ సీన్, ఓ డైలాగ్ అని అనుకున్నా.. తర్వాత చూస్తే అసలు ఈ డైలాగ్ మీదే మొత్తం సినిమానే నిలబడిందని అర్థమైందని ఉపేంద్ర చెప్పడం విశేషం.
ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ గురించి..
ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ నవంబర్ 27న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాను మజిలీ, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన మహేష్ బాబు పి. డైరెక్ట్ చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ మూవీని నిర్మిస్తోంది. వివేక్, మెర్విన్ మ్యూజిక్ అందించారు.
{{/usCountry}}ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ నవంబర్ 27న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాను మజిలీ, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన మహేష్ బాబు పి. డైరెక్ట్ చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ మూవీని నిర్మిస్తోంది. వివేక్, మెర్విన్ మ్యూజిక్ అందించారు.
{{/usCountry}}ఎ బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్ అనే క్యాప్షన్ తోనే అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో నటించడంతోపాటు ఓ పాట రాసి పాడాడు రామ్ పోతినేని. ఇక భాగ్యశ్రీ, ఉపేంద్ర కీలకపాత్రలు పోషించారు. మూవీ ట్రైలర్ ఆంధ్రా కింగ్ తాలూకాపై అంచనాలు పెంచేసింది. చాలా రోజులుగా సక్సెస్ కోసం చూస్తున్న రామ్ పోతినేని ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు.
ఓ హీరో, అతని వీరాభిమాని చుట్టూ తిరిగే కథతో ఈ మూవీ వస్తోంది. ఇందులో సాగర్ అనే అభిమాని పాత్రలో రామ్ కనిపించగా.. ఆంధ్రా కింగ్ సూర్య అనే హీరో పాత్రలో ఉపేంద్ర నటించాడు. ఈమధ్యే రిలీజైన ఈ మూవీ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ప్రతి హీరో అభిమాని ఇది తన స్టోరీ అనిపించేలా మూవీ తెరకెక్కించినట్లుగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.