Zombie Reddy 2 Upendra: టాలీవుడ్‌లో సరికొత్త జాంబీ కాన్సెప్ట్‌తో సంచలనం సృష్టించిన 'జాంబీ రెడ్డి' చిత్రానికి సీక్వెల్‌గా 'జాంబీ రెడ్డి 2: నెక్స్ట్ లెవెల్' (Zombie Reddy 2: Nxt Lvl) రూపొందుతోంది. తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ నుంచి అదిరే అప్డేట్ వచ్చింది. కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు.
జాంబీ రెడ్డి 2లో ఉపేంద్ర

తేజ సజ్జా హీరోగా రాబోతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో 'జాంబీ రెడ్డి 2: నెక్స్ట్ లెవెల్' ఒకటి. ఈ క్రేజీ సీక్వెల్‌లోకి కన్నడ అగ్ర నటుడు, రియల్ స్టార్ ఉపేంద్ర అడుగుపెట్టారు. ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఇవాళ (సెప్టెంబర్ 18) ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.
వైరల్ ఫస్ట్ లుక్
జాంబీ రెడ్డి 2 నుంచి రిలీజైన ఉపేంద్ర ఫస్ట్ లుక్ తెగ వైరల్ గా మారింది. ఇందులో ఆయన చెట్టుకు తలకిందులుగా వేలాడుతున్నట్లు ఉన్నారు. “ప్రపంచాన్ని తలకిందులు చేయడానికి సిద్ధం” అనే శక్తివంతమైన టాప్‌లైన్‌తో వచ్చిన ఈ పోస్టర్ అదిరిపోయింది. ఉపేంద్ర కల్ట్ ఫ్యాన్స్ ఈ పోస్టర్ ను తెగ షేర్ చేస్తున్నారు.
ఉపేంద్ర ఒక చెట్టు కొమ్మకు తలకిందులుగా వేలాడుతూ, విరోచితమైన తెగ నాయకుడి గెటప్‌లో గర్జిస్తూ కనిపించారు. చేతిలో చెక్కిన గొడ్డలి లాంటి ఆయుధాన్ని పట్టుకుని ఉన్న ఆయన వైల్డ్ లుక్ నెటిజన్లను, అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఉపేంద్ర ఈ మూవీ కోసం షూటింగ్ మొదలెట్టారు.
బ్లాక్ బస్టర్ సీక్వెల్
జాంబీ రెడ్డి మూవీ బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ గా జాంబీ రెడ్డి 2 వస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథను అందిస్తుండగా, సుపర్ణ్ ఎస్. వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఆయన తెలుగు చిత్రపరిశ్రమలోకి దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.
2027లో రిలీజ్
{{/usCountry}}జాంబీ రెడ్డి మూవీ బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ గా జాంబీ రెడ్డి 2 వస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథను అందిస్తుండగా, సుపర్ణ్ ఎస్. వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఆయన తెలుగు చిత్రపరిశ్రమలోకి దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.
2027లో రిలీజ్
{{/usCountry}}ఈ భారీ హారర్ యాక్షన్ డ్రామాలో షనయా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గౌర హరి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
జాంబీ రెడ్డి మూవీ సక్సెస్ నేపథ్యంలో జాంబీ రెడ్డి 2పై హైప్ బాగానే క్రియేట్ అయింది. మరి ఆ మ్యాజిక్ ను ఈ సీక్వెల్ రిపీట్ చేస్తుందా? లేదా? అన్నది చూడాలి.