Urvashi Rautela: వాలెంటైన్స్ డే రోజు బాల‌కృష్ణ చేసిన ప‌నికి ఊర్వ‌శి ఫిదా.. ఎంజాయ్ చేశానంటూ హాట్ బ్యూటీ కామెంట్లు

Urvashi Rautela: నందమూరి బాలకృష్ణ అంటే కేవలం సినిమాలు మాత్రమే కాదు, ఆయన చుట్టూ ఉండే వివాదాలు కూడా ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. బాలయ్యతో కలిసి 'డాకు మహారాజ్'లో నటించిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా ఆయన గురించి తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. 

Published on: May 7, 2026, 09:58:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Urvashi Rautela: నందమూరి బాలకృష్ణ పేరు సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్‌లో ఉంటుంది. ఆయన నటించిన చిత్రాల కంటే కూడా, బహిరంగ సభల్లో ఆయన ప్రవర్తన, అభిమానులతో వ్యవహరించే తీరుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా నటి ఊర్వశి రౌటేలా ఆయనతో తన పని అనుభవాన్ని పంచుకోవడమే కాకుండా, ఆయన చుట్టూ ముసురుకున్న వివాదాలపై కూడా స్పందించింది.

ఊర్వశి, బాల‌కృష్ణ (x/UrvashiRautela)
ఊర్వశి, బాల‌కృష్ణ (x/UrvashiRautela)

చిన్నపిల్లాడిలా బాలయ్య

కెమెరా ముందు ఆవేశంగా కనిపించే బాలకృష్ణ.. బయట చాలా భిన్నంగా ఉంటారని ఊర్వశి రౌటేలా చెప్పుకొచ్చింది. ఆయన వ్యక్తిత్వం గురించి చెబుతూ.. "ఆయన చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఎవరితోనైనా చాలా సులభంగా కలిసిపోతారు. ఆయనలో ఒక చిన్న పిల్లాడి లాంటి మనస్తత్వం ఉంది. ఎప్పుడూ సరదాగా ఉంటూ, తన శక్తితో అందరినీ ఆశ్చర్యపరుస్తారు’’ అని ఊర్వశి తెలిపింది.

వాలెంటైన్స్ డే రోజు

బాలయ్యతో జరిగిన ఓ వ్యక్తిగత విషయాన్ని కూడా ఊర్వశి పంచుకుంది. "గత ఏడాది వాలెంటైన్స్ డే రోజున, నాకు అందరికంటే ముందుగా విష్ చేసిన వ్యక్తి బాలయ్యనే. నేనెంతో ఎంజాయ్ చేశా’’ అని ఊర్వశి చెప్పింది. వెండితెరపై గంభీరంగా కనిపించే బాలయ్యలో ఇంతటి సున్నితమైన కోణం కూడా ఉందని ఊర్వశి తెలిపింది.

మూవీ గురించి

బాలకృష్ణతో తన సినిమా గురించి జరుగుతున్న చర్చలు క్రమంగా వివాదాలుగా ఎలా మారాయో కూడా ఊర్వశి వెల్లడించింది. "నాకు తెలియదు.. ఒక్కోసారి ఒక చిన్న విషయం నుంచి మొదలై అది పెద్దగా మారుతుంది" అని ఆమె పేర్కొంది.

బాబీ దర్శకత్వంలో వచ్చిన 'డాకు మహారాజ్' చిత్రంలో ఊర్వశి కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలోని 'దబిడి దిబిడి' సాంగ్ పై తీవ్రమైన విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

నిజంగా అద్భుతం

విమర్శలు ఎలా ఉన్నా బాలకృష్ణతో పనిచేయడం మాత్రం తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని ఊర్వశి చెప్పింది. "ఆయన (బాలకృష్ణ) తో పని చేయడం నిజంగా అద్భుతం. మీరు సినిమా చూసినప్పుడు మా మధ్య వచ్చే యాక్షన్ సీన్లను ఎంజాయ్ చేస్తున్నారు కదా’’ అని ఊర్వశి ఉత్సాహంగా చెప్పుకొచ్చింది.

వైరల్ వీడియోలు

బాలయ్య తన అభిమానులతో ప్రవర్తించే తీరుపై తరచూ విమర్శలు వస్తుంటాయి. మొబైల్ ఫోన్లను విసిరేయడం వంటి దృశ్యాలు మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి సంఘటనలను తాను స్వయంగా చూశానని ఊర్వశి తెలిపింది. "అవును, నేను చాలా సార్లు చూశాను. అవన్నీ చూడటానికి సరదాగా అనిపించేవి" అని ఆమె కామెంట్లు చేసింది.

"అభిమానులు కూడా ఆ క్షణాలను ఎంజాయ్ చేస్తారు. వారు నిజంగా చాలా సంతోషంగా ఉంటారు. అది మనం ఊహించలేం" అని ఊర్వశి పేర్కొంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More