...
...
Next Story

Urvashi Rautela: ఫిఫా ప్రపంచకప్.. రొనాల్డోకు సపోర్ట్ గా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి.. మెస్సి ఫొటోలతో నెటిజన్ల కౌంటర్లు

Urvashi Rautela: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఫిఫా వరల్డ్ కప్ 2026 (FIFA World Cup 2026) లో క్రిస్టియానో రొనాల్డో, పోర్చుగల్ జట్టుకు మద్దతుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. దీనికి నెటిజన్లు మెస్సి ఫొటోలతో గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. ఈ ప్రపంచకప్ లో మెస్సి ఫామ్ అలా ఉంది మరి!

Published on: Jun 28, 2026, 13:07:51 IST
Advertisement

Urvashi Rautela: ప్రస్తుతం అమెరికా, కెనడా, మెక్సికోల వేదికగా అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2026 ఫీవర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులను ఊపేస్తోంది. ఈ ఫుట్‌బాల్ మాయలో క్రీడాకారులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా మునిగితేలుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

రొనాల్డోకు ఊర్వశి సపోర్ట్

ఫిఫా ప్రపంచకప్.. రొనాల్డోకు సపోర్ట్ గా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి (instagram)
ఫిఫా ప్రపంచకప్.. రొనాల్డోకు సపోర్ట్ గా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి (instagram)

క్రిస్టియానో రొనాల్డో, అతని దేశం పోర్చుగల్ కు మద్దతుగా ఊర్వశి రౌతేలా ఇవాళ (జూన్ 28) ఇన్ స్టాలో వీడియో పోస్టు చేసింది. పోర్చుగల్ ఆటగాళ్ల విన్నింగ్ సెలబ్రేషన్స్ ను ఇమిటేట్ చేస్తూ ఆమె డ్యాన్స్ చేసింది. అయితే ఈ వీడియోకు నెటిజన్లు గట్టి కౌంటర్లు వేస్తున్నారు. కామెంట్ సెక్షన్లలో మెస్సి పిక్స్ పోస్టు చేస్తున్నారు.

మెస్సీ ఫ్యాన్స్ రచ్చ!

ఊర్వశి రౌతేలా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డోకు సపోర్ట్ చేస్తూ వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే.. అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) అభిమానులు కామెంట్ సెక్షన్‌ను ముంచెత్తారు. రొనాల్డో కంటే మెస్సీనే బెస్ట్ అంటూ వేలాది మంది నెటిజన్లు మెస్సీ ట్రోఫీలు అందుకున్న ఫోటోలను, ఆయన ఫుట్‌బాల్ స్కిల్స్ జీఐఎఫ్‌ (GIF)లను కామెంట్లలో పోస్ట్ చేయడం ప్రారంభించారు. దీంతో ఊర్వశి పోస్ట్ కింద రొనాల్డో వర్సెస్ మెస్సీ ఫ్యాన్ వార్‌ స్టార్ట్ అయింది.

3 మ్యాచ్‌ల్లో 6 గోల్స్

39 ఏళ్ల వయసులోనూ లియోనెల్ మెస్సీ కేవలం 3 మ్యాచ్‌ల్లోనే 6 గోల్స్ సాధించి, ఈ టోర్నమెంట్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా జోర్డాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి ఫ్రీ-కిక్ ద్వారా ఒక అద్భుతమైన గోల్ కొట్టిన మెస్సీ.. వరల్డ్ కప్ చరిత్రలోనే వరుసగా 7 మ్యాచ్‌ల్లో గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు.

రొనాల్డో విఫలం

మరోవైపు కొలంబియాతో జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్ 0-0తో డ్రా చేసుకోవడం, రొనాల్డో గోల్స్ చేయలేకపోవడంతో మెస్సీ అభిమానులు ఊర్వశి పోస్ట్‌ను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సోషల్ మీడియా వార్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ప్రపంచ కప్ లో రొనాల్డో 2 గోల్స్ మాత్రమే కొట్టాడు. అయితే ఇప్పటికే పోర్చుగల్, అర్జెంటీనా టీమ్స్ నాకౌట్ కు అర్హత సాధించాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks