...
...
Next Story

OTT: ఇరాన్ కొండల్లో అమెరికా సైనికుడు.. ఆర్గో సినిమాను తలపించేలా సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్.. ఆ మూవీ ఈ ఓటీటీలోనే..

OTT: ఇరాన్ గడ్డపై కూలిపోయిన ఫైటర్ జెట్ నుంచి పారాచూట్ ద్వారా దూకేసిన అమెరికా ఎయిర్‌మన్‌ను యూఎస్ సైన్యం అత్యంత సాహసోపేతంగా రక్షించింది. సీల్ టీమ్ 6, డెల్టా ఫోర్స్ కమెండోలతో కూడిన 100 మంది ప్రత్యేక బలగాలు ఈ మెరుపు దాడిలో పాల్గొన్నాయి.

Published on: Apr 6, 2026, 18:10:37 IST
Written by , Hyderabad
Prefer HTon Google
Advertisement

అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ.. హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించే ఒక భారీ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ఇరాన్ గడ్డపై కూలిపోయిన తన యుద్ధ విమాన పైలట్లను కాపాడుకునేందుకు అమెరికా సైన్యం, సీఐఏ (CIA) కలిసి జరిపిన ఈ ఆపరేషన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇరాన్‌ను హెచ్చరిస్తుండగానే, మరోవైపు సైనికులు శత్రువుల కళ్లుగప్పి తమ అధికారిని ప్రాణాలతో వెనక్కి తీసుకొచ్చారు.

7000 అడుగుల ఎత్తులో ప్రాణ సంకటం

OTT: ఇరాన్ కొండల్లో అమెరికా సైనికుడు.. ఆర్గో సినిమాను తలపించేలా సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్.. ఆ మూవీ ఈ ఓటీటీలోనే..
OTT: ఇరాన్ కొండల్లో అమెరికా సైనికుడు.. ఆర్గో సినిమాను తలపించేలా సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్.. ఆ మూవీ ఈ ఓటీటీలోనే..

న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. అమెరికాకు చెందిన ఒక ఫైటర్ జెట్ ఇరాన్ భూభాగంలో కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు పైలట్లు పారాచూట్ సహాయంతో కిందకు దూకేశారు. పైలట్‌ను ఆరు గంటల్లోనే రక్షించగలిగారు కానీ, వెపన్స్ ఆఫీసర్ జాడ తెలియలేదు.

ఆయన ఇరాన్ దళాలకు దొరకకుండా ఉండేందుకు సుమారు 7000 అడుగుల ఎత్తైన పర్వత ప్రాంతానికి చేరుకుని, ఒక కొండ చీలికలో దాక్కున్నారు. తన దగ్గర ఉన్న బీకాన్ సహాయంతో ఆయన సిగ్నల్ పంపడంతో, అమెరికా అధికారులు ఆయన లొకేషన్ గుర్తించారు.

100 మంది కమెండోలతో మెరుపు దాడి

ఈ విషయం తెలిసిన వెంటనే అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీల్ టీమ్ 6 (SEAL Team 6), డెల్టా ఫోర్స్, ఆర్మీ రేంజర్లకు చెందిన 100 మందికి పైగా స్పెషల్ ఫోర్స్ కమెండోలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. వారికి తోడుగా హెలికాప్టర్లు, నిఘా విమానాలు, ఫైటర్ జెట్లు రంగంలోకి దిగాయి.

ఇరాన్ దళాలు ఆయన కోసం వెతుకుతున్న సమయంలోనే, అమెరికా కమెండోలు మెరుపు వేగంతో స్పందించి ఆ అధికారిని రక్షించారు. ఇజ్రాయెల్ నిఘా వర్గాలు కూడా ఈ ఆపరేషన్‌లో కీలక సమాచారాన్ని అందించడం విశేషం.

చివరి నిమిషంలో ఉత్కంఠ

శత్రువుల చేతికి చిక్కకుండా ఉండేందుకు ఇసుకలో ఆగిపోయిన రెండు విమానాలను అమెరికా సైన్యమే బాంబులతో పేల్చేసింది. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ కేవలం డ్రామా అని, ఇరాన్ నుంచి యురేనియం దొంగిలించేందుకే అమెరికా ఈ ప్లాన్ వేసిందని ఇరాన్ విదేశాంగ శాఖ ఆరోపించింది.

'ఆర్గో' రోజులు గుర్తుకొచ్చాయి..

ఈ తాజా ఆపరేషన్ చూస్తుంటే 1979 నాటి ప్రసిద్ధ 'ఆర్గో' (Argo) ఆపరేషన్ గుర్తుకు వస్తోంది. అప్పట్లో ఇరాన్‌లో బందీలుగా చిక్కుకున్న ఆరుగురు అమెరికా దౌత్యవేత్తలను రక్షించేందుకు సీఐఏ ఒక నకిలీ సైన్స్ ఫిక్షన్ సినిమా షూటింగ్ పేరుతో డ్రామా ఆడింది.

హాలీవుడ్ మేకప్ ఆర్టిస్టుల సహాయంతో కెనడా పాస్‌పోర్టులు సృష్టించి వారిని విమానం ఎక్కించి చాకచక్యంగా రక్షించారు. ఇదే కథాంశంతో 2012లో బెన్ అఫ్లెక్ దర్శకత్వంలో వచ్చిన 'ఆర్గో' చిత్రం ఆస్కార్ లను కూడా గెలుచుకుంది. ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఈ మూవీ ప్రస్తుతం జియోహాట్‌స్టార్, ప్రైమ్ వీడియల్లో అందుబాటులో ఉంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks