Ustaad Bhagat Singh Collections:ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ ఊచకోత-ధురంధర్ 2ను బీట్ చేసిన పవన్ కల్యాన్- ఫస్ట్ డే ఎంతంటే

Ustaad Bhagat Singh Collections: పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ డే అదరగొట్టింది. బాక్సాఫీస్ కలెక్షన్లలో సత్తాచాటింది. తెలుగులో ధురంధర్ 2పై కంప్లీట్ డామినెన్స్ చూపించింది. 

Published on: Mar 20, 2026, 09:45:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'ఉస్తాద్ భగత్ సింగ్' థియేటర్లలో రికార్డుల సునామీ సృష్టిస్తోంది. బాలీవుడ్ సెన్సేషన్ ర‌ణ్‌వీర్ సింగ్‌ నటించిన 'ధురంధర్ 2' హిందీలో ఆల్-టైమ్ రికార్డ్ ఓపెనింగ్ సాధించినప్పటికీ, తెలుగు గడ్డపై మాత్రం పవన్ కల్యాణ్ పంజా ముందు అస్సలు నిలవలేకపోయింది.

ఉస్తాద్ భగత్ సింగ్ డే1 కలెక్షన్లు
ఉస్తాద్ భగత్ సింగ్ డే1 కలెక్షన్లు

ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్లు

ట్రేడ్ అనలిస్ట్ వెబ్ సైట్ సక్నిల్క్ ప్రకారం 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ మొదటి రోజే తెలుగు రాష్ట్రాల్లో రూ.31.50 కోట్ల నెట్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. గ్రాస్ కలెక్షన్ల పరంగా చూస్తే ఏకంగా రూ.37.17 కోట్లు రాబట్టింది.

ధురంధర్ 2 ఇలా

అదే రోజు (మార్చి 19) రిలీజైన ర‌ణ్‌వీర్ సింగ్‌ 'ధురంధర్ 2' తెలుగు డబ్బింగ్ వెర్షన్ పవన్ మేనియా ముందు నిలవలేకపోయింది. ధురంధర్ 2 తెలుగు వర్షన్ కు కేవలం రూ.2.12 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే పవన్ కల్యాణ్ చిత్రం ధురంధర్ 2 కంటే అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది.

పవర్ స్టార్ కే

తెలుగు మార్కెట్‌లో తన తిరుగులేని ఆధిపత్యాన్ని పవన్ కల్యాణ్ మరోసారి చాటుకున్నాడు. ఈ లెక్కలు చూస్తుంటే తెలుగు ప్రేక్షకులకు లోకల్ మాస్ మ్యాజిక్ ఎంత ఇష్టమో అర్థమవుతోంది. ఒకే రోజు రెండు భారీ చిత్రాలు పోటీ పడినప్పటికీ, తెలుగు ఆడియన్స్ మాత్రం తమ ఓటు పవర్ స్టార్‌కే వేశారు.

ఉస్తాద్ భగత్ సింగ్ గురించి

మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. తన గురువు ఆశయాలతో 'భగత్ సింగ్'గా ఎదిగిన ఒక సామాన్య గిరిజన యువకుడు, సమాజంలోని అన్యాయంపై ఎలా తిరగబడ్డాడు అనేదే మూవీ స్టోరీ లైన్.

పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ డైలాగ్స్, హరీష్ శంకర్ టేకింగ్ కలిపి 'గబ్బర్ సింగ్' మ్యాజిక్‌ను ఉస్తాద్ భగత్ సింగ్ రిపీట్ చేసిందని ఫ్యాన్స్ అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ప్లస్ గా మారింది. అలాగే ఆర్.పార్తీబన్ విలనిజం సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చింది.

రికార్డులపై గురి

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చినా ఓపెనింగ్ కలెక్షన్లు అదిరిపోయాయి. పండగ ప్లస్ వీకెండ్ కావడంతో ఈ సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు తిరగరాయడం ఖాయమని అనలిస్ట్ లు అంటున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More