OTT Trending: నిజమైన పోలీస్ రాసిన మిస్టరీ స్టోరీ.. ఓటీటీలో తెలుగు ఆడియన్స్ ను ఫిదా చేస్తున్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్

OTT Trending: మలయాళం నుంచి వచ్చే రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్లకు తెలుగు ఓటీటీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ వేరు. ఇప్పుడు అలాంటి సినిమానే ఓటీటీని షేక్ చేస్తోంది. తెలుగు ఆడియన్స్ ఓటీటీలో ఈ మూవీని తెగ చూసేస్తున్నారు. నిజమైన పోలీస్ అధికారి అందించిన కథతో తెరకెక్కిన ఈ సినిమా విశేషాలను ఇక్కడ చూసేయండి.

Published on: Aug 9, 2026, 07:03:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Trending: గతంలో 'ఎల వీజ పూంచిర' అనే బ్లాక్‌బస్టర్ చిత్రానికి రచయితగా పనిచేసిన నిజమైన పోలీస్ ఆఫీసర్ షాజీ మారడ్ అందించిన కథతో, ప్రముఖ దర్శకుడు ఎమ్. పద్మకుమార్ తెరకెక్కించిన అద్భుతమైన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ డ్రామా 'ఉయిర్'. ఈ మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. తెలుగు ఆడియన్స్ ఈ చిత్రానికి ఫిదా అవుతున్నారు.

నిజమైన పోలీస్ రాసిన మిస్టరీ స్టోరీ.. ఓటీటీలో తెలుగు ఆడియన్స్ ను ఫిదా చేస్తున్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్ (jiohotstar)
నిజమైన పోలీస్ రాసిన మిస్టరీ స్టోరీ.. ఓటీటీలో తెలుగు ఆడియన్స్ ను ఫిదా చేస్తున్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్ (jiohotstar)

ఉయిర్ ఓటీటీ ట్రెండింగ్

రియల్ లైఫ్ ఇన్సిడెంట్ల ఆధారంగా తెరకెక్కిన ‘ఉయిర్’ సినిమా ఓటీటీని షేక్ చేస్తోంది. జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మలయాళ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ తెలుగులోనూ ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది.

కథ ఏంటంటే?

కేరళలోని ధర్మడం/కణ్ణూర్ పరిసర ప్రాంతాల్లోని ఒక పాడుబడిన బావిలో ఒక గుర్తుతెలియని మహిళ మృతదేహం లభిస్తుంది. లోకల్ పోలీస్ స్టేషన్‌లో కొత్తగా చేరిన ప్రొబేషనరీ సబ్-ఇన్‌స్పెక్టర్ అజీబ్ రెహమాన్ (రోషన్ మ్యాథ్యూ) ఈ కేసు బాధ్యతలను తీసుకుంటాడు.

ప్రాథమికంగా ఇది ఒక సాధారణ ఆత్మహత్య లేదా అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ, ఆ మహిళ కర్ణాటక నుంచి కేరళకు వలస వచ్చిన శోభ అనే నిరుపేద కార్మికురాలని తేలడంతో దర్యాప్తు సరికొత్త మలుపులు తిరుగుతుంది.

పక్కా రియలిస్టిక్ పోలీస్ ప్రొసీజరల్

సాధారణ కమర్షియల్ సినిమాలలోలాగా హీరోలకు భారీ ఎలివేషన్లు, అమాంతం విలన్లను తుదముట్టించే ఫైట్లు ఈ ఉయిర్ సినిమాలో కనిపించవు. ఒక పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కింది స్థాయి అధికారులపై ఉండే మానసిక ఒత్తిడి, ప్రొబేషనరీ ఆఫీసర్ల సవాళ్లు, నిజమైన విచారణలో ఫోరెన్సిక్ అండ్ లీగల్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది దర్శకుడు అత్యంత సహజంగా చూపించాడు.

రోషన్ అదుర్స్

హీరో రోషన్ మ్యాథ్యూ 'అజీబ్' పాత్రలో జీవించేశాడు. చిన్నతనంలో తన చెల్లి మిస్ అయిన తీవ్ర బాధను గుండెల్లో మోస్తూ, ప్రతి మిస్సింగ్ కేసును తన సొంత వేదనగా భావించి విచారించే ఆఫీసర్‌గా అతని నటన అద్భుతమనే చెప్పాలి. అలాగే సీనియర్ ఆఫీసర్‌గా బైజు సంతోష్, ఇతర కీలక పాత్రల్లో అతుల్య చంద్ర, శ్రుతి మేనన్, సయామి ఖేర్ తమ పరిధి మేరకు మెప్పించారు.

ఉయిర్ ను ఎందుకు చూస్తున్నారు?

  • యథార్థ సంఘటనల ప్రభావం: వాస్తవ ఘటనల ఆధారంగా రూపుదిద్దుకోవడం, ముఖ్యంగా సమాజంలో వలస కార్మికులు ఎదుర్కొనే భాషా రహిత ఇబ్బందులు, ఆర్థిక ఒత్తిళ్లు, వారి వెనుక ఉండే సామాజిక మానసిక స్థితిని ప్రతిబింబించడం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.
  • మైండ్ బ్లోయింగ్ ఎమోషనల్ క్లైమాక్స్: సాధారణంగా థ్రిల్లర్ సినిమాలు కేవలం 'కిల్లర్ ఎవరు?' అనే సస్పెన్స్‌తో ముగుస్తాయి. కానీ 'ఉయిర్' చిత్రం దానికి భిన్నంగా చైల్డ్‌హుడ్ ట్రామా, హ్యూమన్ ఎమోషన్స్‌తో ముగిసి గుండెను పిండేస్తుంది.
  • అద్భుతమైన తెలుగు డబ్బింగ్: జియోహాట్‌స్టార్‌లో ఒరిజినల్ మలయాళంతో పాటు లభ్యమవుతున్న తెలుగు వర్షన్ డబ్బింగ్ క్వాలిటీ, నేటివిటీ డైలాగ్స్ తెలుగు ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తున్నాయి.
  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More