...
...
Next Story

OTT Malayalam Crime Thriller: మలయాళం క్రైమ్ థ్రిల్లర్-మూడు భాషల్లో ఓటీటీ నంబర్ 1-అక్రమ సంబంధం-పోలీసులనే బురిడీకొట్టించి!

OTT Malayalam Crime Thriller: ఓటీటీలో మలయాళం థ్రిల్లర్లకు ఉండే క్రేజే వేరు. ఇక అందులోనూ రియల్ స్టోరీతో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ప్రేక్షకులు స్కీన్లకు కళ్లు కట్టేస్తారు. ఇప్పుడు అలాంటి ఓ రియల్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీని షేక్ చేస్తోంది. ఆ సినిమా వివరాలపై ఓ లుక్కేయండి.

Published on: Aug 13, 2026, 09:19:03 IST
Advertisement

OTT Malayalam Crime Thriller: ఓటీటీల వాడకం ఎక్కువయ్యాక ఇతర భాషల సినిమాలనూ తెలుగు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని మలయాళం, కన్నడ, తమిళం, హిందీ, ఇంగ్లీష్ సినిమాలను తెలుగులో డబ్ చేసి ఓటీటీ రిలీజ్ చేస్తున్నారు. ఇలా తెలుగులో డబ్ అయి వచ్చిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘ఉయిర్ (Uyir)’ ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది.

ఉయిర్ ఓటీటీ రిలీజ్

మలయాళం క్రైమ్ థ్రిల్లర్-మూడు భాషల్లో ఓటీటీ నంబర్ 1-అక్రమ సంబంధం-పోలీసులనే బురిడీకొట్టించి!
మలయాళం క్రైమ్ థ్రిల్లర్-మూడు భాషల్లో ఓటీటీ నంబర్ 1-అక్రమ సంబంధం-పోలీసులనే బురిడీకొట్టించి!

మలయాళంలో రియల్ ఇన్సిడెంట్లతో జరిగిన స్టోరీని ‘ఉయిర్’ సినిమాగా తెరకెక్కించారు. ఈ స్టోరీని రియల్ పోలీస్ ఆఫీసర్ రాయడం విశేషం. థియేటర్లలో అదరగొట్టిన ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఆగస్టు 4న జియోహాట్‌స్టార్ (JioHotstar)లో రిలీజైంది. ఓటీటీలోకి వచ్చి సుమారు పది రోజులు అవుతున్నా ఈ మూవీ క్రేజ్ మాత్రం తగ్గలేదు.

ఓటీటీ ట్రెండింగ్ నంబర్ వన్

ప్రస్తుతం ఓటీటీలో ఉయిర్ మూవీ సెన్సేషన్ గా మారింది. ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ను డిజిటల్ ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. కొత్త సినిమాలు వచ్చినా, షోలు స్ట్రీమింగ్ అవుతున్నా ఉయిర్ మూవీకి మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వస్తూనే ఉంది. ఇప్పుడు ఆ మూవీ తెలుగు, మలయాళం, కన్నడలో ఓటీటీ ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది.

ఆ ట్విస్ట్ లతో

ఉయిర్ మూవీని ఓటీటీ ఆడియన్స్ ఇంతలా ఎగబడి చూడటానికి ప్రధాన కారణం ఆ సినిమాలోని ట్విస్ట్ లే. పెళ్లయిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఏకంగా పోలీసులనే పెద్ద బురిడీ కొట్టిస్తాడు. ఆ మహిళ మర్డర్ కేసు నుంచి తాను తప్పించుకోవడానికి ఏ మాత్రం అనుమానం రాని ఓ కట్టుకథను పర్ఫెక్ట్ గా అల్లుతాడు.

అదిరే సస్పెన్స్

కానీ ఆ తర్వాత వచ్చే ట్విస్ట్ దిమ్మతిరిగేలా ఉంటుంది. దీంతో ఆ వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతారు. ఆ తర్వాత వచ్చే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, సస్పెన్స్ ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ పై కూర్చోబెడుతున్నాయి.

ఎందుకు చూడాలంటే?

మలయాళ సినిమాల్లో అండే రా అండ్ ఫ్రెష్ ఫీలింగ్ తెలుగు ఆడియన్స్ కు బాగా అలవాటైంది. ఇప్పుడు ఉయిర్ మూవీ కూడా అదే ఫీలింగ్ ను ఇస్తుంది. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ లాస్ట్ వరకూ ఆడియన్స్ కు మంచి కిక్ ఇస్తుంది. రోషన్ మాథ్యూ, బైజు సంతోష్ తదితరులు నటించిన ఈ మూవీ అయితే థ్రిల్లర్ ఫ్యాన్స్ కు ఓ ట్రీట్ లాంటిదే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks