Varanasi: గ్లోబ‌ల్ ఆడియ‌న్సే టార్గెట్- మెక్సికో ఈవెంట్లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా వార‌ణాసి ప్రివ్యూ- రాజమౌళి వీడియో వైరల్

Varanasi: వారణాసి మూవీని జక్కన్న వేరే లెవల్ లో ప్రమోట్ చేస్తున్నాడు. మెక్సికోలో జరుగుతున్న కామిక్ కాన్ ఎక్స్ పీరియన్స్ ఈవెంట్లో వారణాసి సినిమా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. రాజమౌళి వీడియో మెసేజ్ వైరల్ గా మారింది.

Published on: Apr 25, 2026, 09:16:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Varanasi: దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’. ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో మూవీ రీచ్ ను వరల్డ్ వైడ్ గా పెంచేందుకు గ్లోబల్ ఆడియన్స్ ను రాజమౌళి టార్గెట్ చేశాడు. తాజాగా మెక్సికోలో జరుగుతున్న ఈవెంట్లో వారణాసి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

వారణాసి పోస్టర్ లో మహేష్ బాబు (x/varanasi)
వారణాసి పోస్టర్ లో మహేష్ బాబు (x/varanasi)

అట్రాక్షన్ గా వారణాసి

రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్లలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ మూవీపై ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే బజ్ ఏర్పడింది. ఇప్పుడీ హైప్ ను మరింత పెంచేలా, గ్లోబల్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా మూవీ టీమ్ ప్లాన్ చేసింది. మెక్సికోలో జరుగుతున్న కామిక్ కాన్ ఎక్స్ పీరియన్స్ ఈవెంట్లో వారణాసి మూవీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

బీటీఎస్ వీడియో

కామిక్ కాన్ ఎక్స్ పీరియన్స్ ఈవెంట్లో వారణాసి ప్రొడ్యూసర్లలో ఒకరైన ఎస్ఎస్ కార్తీకేయ పాల్గొన్నాడు. స్టేజీపై వారణాసి సినిమాకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. అలాగే వారణాసి ప్రివ్యూ వీడియోను కూడా ప్లే చేశారు. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి వీడియో మెసేస్ ను కూడా ప్రదర్శించారు.

రాజమౌళి వీడియో

మెక్సికోలో జరుగుతున్న కామిక్ కాన్ ఎక్స్ పీరియన్స్ ఈవెంట్లో రాజమౌళి వీడియో మెసేజ్ ను ప్రదర్శించారు. ఈ వీడియోలో రాజమౌళి ‘వారణాసి’ అని రాసి ఉన్న టీషర్ట్ ను వేసుకున్నాడు. దీన్ని బట్టి మూవీని గ్లోబల్ లెవల్ తీసుకెళ్లేందుకు జక్కన్న ఎంత పట్టుదలతో ఉన్నాడో అర్థమవుతోంది.

అప్పుడే హ్యాపీ

‘‘మాయ నాగరికత, నిర్మాణం నాకెంతో ఆసక్తి కలిగిస్తాయి. బాహుబలిలోని సిటీ సెంటర్ నిర్మాణానికి చిచెన్ ఇట్ స్ఫూర్తి. మీలాంటి అద్భుతమైన ప్రజల గురించి తెలుసుకునే అవకాశం నాకు దక్కింది.

25 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నా. కానీ సముద్రాలను దాటి సినిమా రీచ్ అయినప్పుడు, వేల మైళ్ల దూరంలోని ప్రజలు మన సినిమాను ఫీల్ అవుతున్నప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఆర్ఆర్ఆర్ తో నాకు అదే దక్కింది. నాటు నాటు సినిమాకు ప్రపంచమంతా డ్యాన్స్ చేసింది. అప్పుడే నేను ఎందుకు సినిమాలు చేస్తున్నానో అర్థమైంది’’ అని వీడియోలో రాజమౌళి పేర్కొన్నాడు.

ఈవెంట్ కోసమేనా?

మెక్సికోలో జరుగుతున్న ఈవెంట్లో ప్లే చేసిన వారణాసి బీటీఎస్ వీడియో ఎక్స్ క్లూజివ్ మాత్రమే అనే కామెంట్లు వస్తున్నాయి. అంటే ఈ ఈవెంట్ కోసమే ఆ వీడియోను రూపొందించారని తెలిసింది. దీన్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేయరని టాక్. అదే నిజమైతే ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అవడం గ్యారెంటీ.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More