Varanasi Leak: వారణాసి మూవీకి తప్పని లీక్‌ల బెడద.. సోషల్ మీడియాలో బోట్ సీక్వెన్స్ సీన్ ప్రత్యక్షం
Varanasi Leak: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి మరో షాక్. మహష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి మూవీకి లీక్ ల బెడద తప్పట్లేదు. ఈ మూవీ షూటింగ్ నుంచి బోట్ సీక్వెన్స్ వీడియో లీక్ అయింది.
Varanasi Leak: టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ‘వారణాసి’. సూపర్ స్టార్ మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఫస్ట్ సినిమా కావడంతో వారణాసిపై అంచనాలు మామూలుగా లేవు. పైగా టైటిల్, టీజర్ తో ఈ హైప్ ను మూవీ టీమ్ మరింత పెంచేసేంది. అయితే మరోవైపు మాత్రం వారణాసి సినిమాకు లీక్ ల బెడద తప్పట్లేదు.

వారణాసి సీన్ లీక్
వాారణాసి నుంచి ఓ సీన్ వీడియో లీకైందని సోషల్ మీడియాలో ఓ పోస్టు చక్కర్లు కొడుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలోని చెరువులో బోట్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నట్లుగా అందులో ఉంది. ఇది వారణాసి సినిమా షూటింగ్ అని ఆ వీడియోను తెగ వైరల్ చేసేస్తున్నారు.
ఎంత స్ట్రిక్ట్ ఉన్నా
తన సినిమా షూటింగ్ విషయంలో రాజమౌళి ఎంత పర్ఫెక్ట్ గా ఉంటారో, అంతే స్ట్రిక్ట్ గా ఉంటారు. తన సెట్ నుంచి చిన్న ఫొటోను కూడా బయటకు వెళ్లనివ్వడు. అలాంటిది వారణాసి సినిమా మొదలైనప్పటి నుంచి ఈ లీక్ ల బెడద వెంటాడుతూనే ఉంది.
ఆ ఫొటో నుంచి
ఫస్ట్ వారణాసి షూటింగ్ నుంచి మహేష్ బాబు ఫొటో ఒకటి లీకైంది. ఆ తర్వాత ఒక ఆడవిలో యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించిన ఫుటేజీ లీక్ అయింది. ఇప్పుడేమో బోట్ సీక్వెన్స్ వీడియో లీక్ అయింది. అంతే కాకుండా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ సమయంలో టైటిల్ కూడా ముందుగానే లీక్ అయింది.
భారీ అంచనాలతో
వారణాసి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు హీరోగా రాజమౌళి ఓ విజువల్ వండర్ క్రియేట్ చేయబోతున్నారు. ఈ మూవీ గ్లోబ్ ట్రాటర్ తో పాటు టైమ్ ట్రాటర్ కూడా. అంటే వివిధ కాలాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈ మూవీ స్టోరీ సాగనుంది.
రిలీజ్ డేట్
వారణాసి సినిమాను ఏప్రిల్ 7, 2027న రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రుద్ర పాత్రలో మహేష్ బాబు, మందానికిగా ప్రియాంక చోప్రా, విలన్ కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్ట్ చేస్తున్నారు.
వారణాసి సినిమా కోసం భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నారని తెలిసింది. ఈ మూవీ బడ్జెట్ రూ.1300 కోట్లు అని సమాచారం. ప్రపంచం మొత్తం మార్మోగిపోయేలా ఈ వారణాసి సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


