వారణాసి రిలీజ్ డేట్ ఇదేనా.. కాశీలో హోర్డింగ్స్ ఫొటోలు వైరల్.. మహేష్, రాజమౌళి మూవీదే అంటున్న ఫ్యాన్స్

మహేష్ బాబు, రాజమౌళి మూవీ వారణాసి రిలీజ్ డేట్ ఇదే అంటూ కాశీలో హోర్డింగ్స్ కనిపించడం సంచలనం రేపుతోంది. ఇప్పటికే సినిమా టైటిల్ రిలీజ్ చేస్తూ వచ్చిన వీడియో థీమ్ ఈ హోర్డింగ్స్ కు మ్యాచ్ అవుతుండటంతో ఇది ఆ మూవీదే అని ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు.

Published on: Jan 29, 2026, 14:02:20 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక మూవీ వారాణాసి. గతేడాది చివర్లో ఈ మూవీ టైటిల్ ను రివీల్ చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుందని చెప్పినా.. కచ్చితమైన డేట్ చెప్పలేదు. కానీ తాజాగా కాశీలో కొన్ని హోర్డింగ్స్ ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ కానున్నట్లు చెబుతున్నాయి.

వారణాసి రిలీజ్ డేట్ ఇదేనా.. కాశీలో హోర్డింగ్స్ ఫొటోలు వైరల్.. మహేష్, రాజమౌళి మూవీదే అంటున్న ఫ్యాన్స్
వారణాసి రిలీజ్ డేట్ ఇదేనా.. కాశీలో హోర్డింగ్స్ ఫొటోలు వైరల్.. మహేష్, రాజమౌళి మూవీదే అంటున్న ఫ్యాన్స్

వారణాసి వచ్చేది ఆ రోజే

ఎస్ఎస్ఎంబీ29గా మొదలై.. తర్వాత గ్లోబ్‌ట్రాటర్ గా మారి ఫైనల్ గా వారణాసి అనే టైటిల్ సొంతం చేసుకున్న మహేష్ బాబు మూవీ రిలీజ్ డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పరమ పవిత్రమైన కాశీ నగరంలో ఇప్పుడీ సినిమాదే అంటూ కొన్ని హోర్డింగ్స్ దర్శనమిస్తున్నాయి.

వాటిపై ఏప్రిల్ 7, 2027న థియేటర్లలోకి అని రాసి ఉంది. మూవీ పేరు లేకపోయినా.. ఆ థీమ్ వారణాసి సినిమాతో మ్యాచ్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఇది కచ్చితంగా ఆ మూవీదే అంటున్నారు. పైగా వారణాసి నగరంలోనే ఈ హోర్డింగ్స్ కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఉగాది రోజును ఎంచుకున్నారా?

ఈ హోర్డింగ్స్ పై ఉన్న తేదీనే వచ్చే ఏడాది ఉగాది వస్తోంది. దీంతో వారణాసి మేకర్స్ ఆ తేదీనే ఎంచుకున్నారా అన్న సందేహం కలుగుతోంది. అయితే దీనిపై ఇప్పటి వరకూ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. సాధారణంగా రాజమౌళి ఏం చేసినా హడావిడి ఉంటుంది.

టైటిల్ రివీల్ చేయడానికే రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద ఈవెంట్ ప్లాన్ చేశాడు. అలాంటిది రిలీజ్ డేట్ ను అంత ఈజీగా బయటకు పొక్కనీయడు జక్కన్న. ఈ నేపథ్యంలో ఈ హోర్డింగ్స్.. వారణాసి రిలీజ్ డేట్ పై బజ్ ను పెంచుతున్నాయి.

వారణాసి మూవీ విశేషాలు

మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి రేర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా వారణాసి. గతేడాదే షూటింగ్ మొదలైంది. మామూలుగానే రాజమౌళి మూవీస్ ఏళ్లకు ఏళ్లు షూటింగ్ స్థాయిలోనే ఉంటాయి. ఇది కూడా భిన్నమేమీ కాదు. ఆమధ్య అవతార్ 3 రిలీజ్ సందర్భంగా జేమ్స్ కామెరాన్ తో రాజమౌళి మాట్లాడుతూ.. మరో 8 నెలల్లో షూటింగ్ పూర్తవుతుందని చెప్పాడు.

ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కు కూడా అతడు చాలా టైమే తీసుకుంటాడు. ఆ లెక్కన ఈ ఏడాది ఆగస్టు సమయానికి షూటింగ్ పూర్తవుతుందనుకున్నా.. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి మూవీని సిద్ధం చేస్తారా లేదా అన్నది చూడాలి. ఏకంగా రూ.1300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ మూవీని నిర్మిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More