Varun Tej Son: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు తమ ముద్దుల కుమారుడు వాయువ్ మొదటి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పటివరకు దాచి ఉంచిన తమ చిన్నారి ముఖాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా రివీల్ చేశారు. ఈ క్యూట్ స్నాప్స్ నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
"నువ్వు రాకముందే నిన్ను ప్రేమించా!".. వరుణ్ తేజ్ ఎమోషనల్ పోస్ట్

తమ కొడుకు ఫస్ట్ బర్త్‌డే సందర్భంగా వరుణ్ తేజ్ ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాల్లో ఓ స్పెషల్ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. "మై డియర్ బాయ్.. నువ్వు నా ప్రపంచాన్ని ఎంతో అందంగా మార్చేశావు. నిన్ను మొదటిసారి కళ్లతో చూడకముందే నీ ప్రేమలో పడిపోయాను. నీకు తండ్రిగా మారడమే నా లైఫ్‌లో బెస్ట్ పార్ట్. హ్యాపీ ఫస్ట్ బర్త్‌డే వాయువ్.. ఎప్పటికీ ఐ లవ్ యు" అంటూ కొడుకుపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు.
పోస్ట్‌లో షేర్ చేసిన పిక్చర్స్ చూసి నెటిజన్లు వాయువ్ క్యూట్‌నెస్‌కి ఫిదా అయిపోతున్నారు. తండ్రి ఒడిలో చిన్నారి హాయిగా ఉన్న క్షణాలు, తల్లి ప్రేమను ఆస్వాదిస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
లావణ్య త్రిపాఠీ కూడా హార్ట్‌టచింగ్ మెసేజ్
మరోవైపు లావణ్య త్రిపాఠి కూడా కొడుకు కోసం ఎంతో భావోద్వేగమైన సుదీర్ఘ సందేశాన్ని పోస్ట్ చేశారు. "నన్ను నీ తల్లిగా ఎంచుకున్నందుకు థ్యాంక్స్ రా చిన్నోడా. నువ్వు నా జీవితంలోకి రాకముందు ప్రేమ అంటే ఏంటో నాకు తెలుసనుకున్నాను. కానీ నువ్వు వచ్చాక నా హృదయానికి ఓ కొత్త అర్థం దొరికింది. నా వెలుపల జీవిస్తున్న నా సొంత హృదయం నువ్వు" అని మురిసిపోయారు.
ఇంట్లో నీ చిన్న చిన్న నవ్వులు, పసి చేతుల స్పర్శలు, కౌగిలింతలు మాకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చాయని ఆమె రాసుకొచ్చారు. చీకటి రాత్రుల్లో చంద్రుడిలా, వెలుగు ఇచ్చే సూర్యుడిలా నువ్వు మా జీవితంలో వెలుగులు నింపావంటూ లావణ్య తన ఆనందాన్ని పంచుకున్నారు.
మెగా ఫ్యామిలీ, స్టార్స్ స్పెషల్ విషెస్
{{/usCountry}}ఇంట్లో నీ చిన్న చిన్న నవ్వులు, పసి చేతుల స్పర్శలు, కౌగిలింతలు మాకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చాయని ఆమె రాసుకొచ్చారు. చీకటి రాత్రుల్లో చంద్రుడిలా, వెలుగు ఇచ్చే సూర్యుడిలా నువ్వు మా జీవితంలో వెలుగులు నింపావంటూ లావణ్య తన ఆనందాన్ని పంచుకున్నారు.
మెగా ఫ్యామిలీ, స్టార్స్ స్పెషల్ విషెస్
{{/usCountry}}ఈ క్యూట్ పిక్స్ చూసి మెగా సిస్టర్ నిహారిక కొణిదెల చాలా ఉత్సాహంతో కామెంట్ చేశారు. "ఇదిగోండి.. నేను చూసిన అత్యంత హ్యాండ్సమ్, బ్యూటిఫుల్ బాయ్ ఇతనే!" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ చేయడం విశేషం. రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల "హ్యాపీ హ్యాపీ బర్త్‌డే డార్లింగ్ వాయువ్" అని స్పెషల్ విషెస్ చెప్పారు.
బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు, హీరోయిన్లు రీతూ వర్మ, అనుపమ పరమేశ్వరన్, రుహానీ శర్మ సహా టాలీవుడ్ ప్రముఖులు చిన్నారికి బర్త్‌డే విషెస్ తెలుపుతూ కామెంట్స్ వర్షం కురిపించారు.
'మిస్టర్' సెట్స్ నుంచి పేరెంట్‌హుడ్ వరకు..
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కాంబినేషన్‌లో 2017లో వచ్చిన 'మిస్టర్' సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 2018లో 'అంతరిక్షం 9000 KMPH' సినిమాలో కలసి నటించారు. కొన్నేళ్ల పాటు తమ ప్రేమ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచిన ఈ కపుల్, 2023లో హైదరాబాద్‌లో నిశ్చితార్థం చేసుకుని, అదే ఏడాది ఇటలీలోని టుస్కానీలో గ్రాండ్ డ్రీమ్ వెడ్డింగ్ చేసుకున్నారు.
2025 సెప్టెంబర్ 9న లావణ్య పండంటి బాబుకి జన్మనిచ్చారు. కెరీర్ విషయానికొస్తే, వరుణ్ తేజ్ ఇటీవలే 'కొరియన్ కనకరాజు' మూవీతో అలరించగా, లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి' మూవీతో వచ్చినా నిరాశపరిచారు.