...
...
Next Story

Korean Kanakaraju: దెయ్యాన్నే లవ్ చేసినోడిని.. బావ కోసం సాయి ధరమ్ తేజ్.. కొరియన్ కనకరాజు ప్రమోషన్ వీడియో వైరల్

Korean Kanakaraju: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త సినిమా ప్రమోషన్ల కోసం బావ సాయి దుర్గ తేజ్ (సాయి ధరమ్ తేజ్) బరిలో దిగాడు. అతనికి సంబంధించిన ఒక ఫన్నీ వీడియోను వరుణ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'కొరియన్ కనకరాజు' ప్రాజెక్ట్ ప్రమోషన్లలో సాయి ధరమ్ తేజ్ చేసిన హంగామా నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Published on: Aug 4, 2026, 06:13:18 IST
Advertisement

Korean Kanakaraju: టాలీవుడ్ లో మెగా కాంపౌండ్ హీరోల మధ్య ఉండే అనుబంధం, స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరి సినిమాలను మరొకరు ప్రమోట్ చేసుకోవడం, సోషల్ మీడియాలో ఒకరినొకరు ఆటపట్టించుకోవడం తరచూ చూస్తూనే ఉంటాం. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) కొరియన్ కనకరాజు మూవీ కోసం సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ (సాయి ధరమ్ తేజ్ - Sai Durgha Tej) రంగంలోకి దిగాడు.

సాయి ధరమ్ తేజ్ ప్రమోషన్

దెయ్యాన్నే లవ్ చేసినోడిని.. బావ కోసం సాయి ధరమ్ తేజ్.. కొరియన్ కనకరాజు ప్రమోషన్ వీడియో వైరల్
దెయ్యాన్నే లవ్ చేసినోడిని.. బావ కోసం సాయి ధరమ్ తేజ్.. కొరియన్ కనకరాజు ప్రమోషన్ వీడియో వైరల్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అప్ కమింగ్ మూవీ ‘కొరియన్ కనకరాజు’. ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ ఆగస్టు 7న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తన మేన బావ వరుణ్ కోసం సాయి ధరమ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' (Korean Kanakaraju) ప్రమోషన్లు షురూ చేవాడు. ఓ ఫన్నీ వీడియోతో హైప్ క్రియేట్ చేశాడు.

ప్రమోషనల్ హంగామా

వరుణ్ తేజ్ షేర్ చేసిన వీడియోలో సాయి ధరమ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' సినిమాను ప్రమోట్ చేసే క్రమంలో తనదైన శైలిలో నవ్వులు పూయించాడు. సాయి ధరమ్ తేజ్ ఫోన్లో.. ‘‘ఏంది దెయ్యాలు? విరూపాక్ష సినిమా చూశావా? అందులో దెయ్యాన్నే లవ్ చేసినోడిని. తొక్కలో దెయ్యాలు ఏంట్రా’’ అని కాల్ కట్ చేస్తాడు.

అక్కడ టేబుల్ మీద ఉన్న డ్రాగన్ బొమ్మ దీపాన్ని సాయి ధరమ్ తేజ్ ఓపెన్ చేస్తాడు. వెంటనే అతని కళ్లు బ్లూ కలర్ లోకి మారిపోతాయి. ఇలా కొరియన్ కనకరాజు మూవీ కోసం అతను ఓ వీడియోలో కనిపించాడు. దీన్ని వరుణ్ తేజ్ తన అకౌంట్లో పోస్టు చేశాడు.

మెగా ఫ్యామిలీ

మెగా హీరోల మధ్య ఉండే ఈ సరదా కలయికను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. 'కొరియన్ కనకరాజు' ప్రాజెక్ట్‌పై బజ్ పెంచడంలో ఈ వినూత్న ప్రమోషనల్ స్టంట్ పక్కాగా వర్కవుట్ అయిందని కామెంట్లు చేస్తున్నారు.

ఇదే ట్రెండ్

ఇటీవలి కాలంలో థియేట్రికల్ బజ్ సాధించడానికి సోషల్ మీడియా ప్రమోషన్స్ కీలక ఆయుధంగా మారాయి. సాయి ధరమ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' కోసం చేసిన ఈ వినూత్న ప్రమోషన్ సరదాగా ఉండటమే కాకుండా, వరుణ్ తేజ్ దానిని పోస్టు చేయడం వల్ల మల్టిపుల్ హీరోల అభిమానులకు వేగంగా చేరువైంది. పాతకాలపు ప్రమోషనల్ ఇంటర్వ్యూల కంటే ఇటువంటి నాచురల్, ఫన్నీ అండ్ రిలేటబుల్ విజువల్స్ యూత్‌ను వేగంగా ఆకట్టుకుని డిజిటల్ స్పీడ్‌ను పెంచుతాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks