...
...
Next Story

Venkatesh Kalyan Ram Movie: దగ్గుబాటి, నందమూరి హీరోలతో మల్టీస్టారర్.. షూటింగ్ డేట్ రివీల్ చేసిన అనిల్ రావిపూడి

Venkatesh Kalyan Ram Movie: 'మన శంకర వరప్రసాద్ గారు' బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి.. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌లతో క్రేజీ మల్టీస్టారర్ అనౌన్స్ చేసిన విషయం తెలుసు కదా. జూన్ 18న గ్రాండ్ గా స్టార్ట్ కానున్న ఈ సినిమా 2027 సంక్రాంతి బరిలో దిగబోతోంది.

Published on: Jun 9, 2026, 19:47:48 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Venkatesh Kalyan Ram Movie: టాలీవుడ్‌లో కమర్షియల్ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో భారీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి రేసులో 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర నవ్వులు పూయించడమే కాకుండా, సాలిడ్ వసూళ్లతో రికార్డులు క్రియేట్ చేశారు.

Venkatesh Kalyan Ram Movie: దగ్గుబాటి, నందమూరి హీరోలతో మల్టీస్టారర్.. షూటింగ్ డేట్ రివీల్ చేసిన అనిల్ రావిపూడి
Venkatesh Kalyan Ram Movie: దగ్గుబాటి, నందమూరి హీరోలతో మల్టీస్టారర్.. షూటింగ్ డేట్ రివీల్ చేసిన అనిల్ రావిపూడి

అదే జోష్‌లో ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌ల కాంబోలో ఒక భారీ మల్టీస్టారర్‌గా ప్లాన్ చేశారు. టాలీవుడ్‌లో దగ్గుబాటి, నందమూరి హీరోలు కలిసి నటిస్తుండటంతో అటు ఫ్యాన్స్ లోనూ, ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ విపరీతమైన బజ్ క్రియేట్ అవుతోంది.

జూన్ 18న లాంచ్.. షూటింగ్ షెడ్యూల్స్ ఫిక్స్!

ఈ సినిమాకు సంబంధించిన ముఖ్యమైన షెడ్యూల్ వివరాలను అనిల్ రావిపూడి రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్‌లో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. "ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమాను జూన్ 18, 2026న పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా స్టార్ట్ చేయబోతున్నాం. ఆ వెంటనే జూన్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ నాన్ స్టాప్ గా సాగుతుంది. 2027 సంక్రాంతి బరిలో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి పక్కాగా ప్లాన్ చేస్తున్నాం" అని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు.

వెంకీకి హ్యాట్రిక్.. కళ్యాణ్ రామ్ ఎంట్రీ అదుర్స్

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన 'F2', 'F3' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు క్యూ కట్టేలా చేయడంలో ఈ జోడీ సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వస్తున్న సినిమా కావడంతో బిజినెస్ వర్గాల్లో అప్పుడే లెక్కలు మొదలయ్యాయి.

ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టిని సెలెక్ట్ చేసినట్లు మేకర్స్ ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. కథ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉండటంతో, మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. త్వరలోనే సెకండ్ హీరోయిన్ డీటెయిల్స్ కూడా బయటకు రానున్నాయి.

టాలీవుడ్‌లో మంచి నిర్మాణ విలువలకు పెట్టింది పేరైన సాహు గారపాటి (షైన్ స్క్రీన్స్) తో పాటు టాప్ ప్రొడక్షన్ హౌసెస్ సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్, మల్టీస్టారర్ కాస్టింగ్ తో తెరకెక్కనున్న ఈ సినిమా 2027 సంక్రాంతి రేసులో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మరోసారి సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది.

హెచ్‌టీ విశ్లేషణ

రెండు భిన్నమైన ఇమేజ్ ఉన్న హీరోలు ఒకే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం టాలీవుడ్ లో ఎప్పుడూ ఆసక్తికరమే. వెంకటేష్ కామెడీ టైమింగ్, కళ్యాణ్ రామ్ ఇంటెన్సిటీని బ్యాలెన్స్ చేస్తూ అనిల్ రావిపూడి స్క్రిప్ట్ రాసుకోవడం పెద్ద ప్లస్ పాయింట్. ఈ ఇద్దరి కలయికతో ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్ ఇద్దరినీ ఒకేసారి ఎట్రాక్ట్ చేసి సంక్రాంతి సీజన్ లో కలెక్షన్స్ కుమ్మేయొచ్చు.

People Also Ask (FAQs)

అనిల్ రావిపూడి కొత్త సినిమాలో హీరోలు ఎవరు?

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ఈ భారీ మల్టీస్టారర్ చిత్రంలో మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు.

వెంకటేష్ - కళ్యాణ్ రామ్ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?

ఈ సినిమా ఓపెనింగ్ జూన్ 18, 2026న జరగనుండగా.. ఆ వెంటనే జూన్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు.

ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారు?

టాలీవుడ్ బాక్సాఫీస్ కు అత్యంత కీలకమైన సీజన్ సంక్రాంతి 2027 కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు.

ఈ చిత్రంలో హీరోయిన్లుగా ఎవరు నటిస్తున్నారు? సినిమా నిర్మాతలు ఎవరు?

కృతి శెట్టి ఒక హీరోయిన్‌గా కన్ఫర్మ్ అవ్వగా, మరో హీరోయిన్ ఎవరనేది త్వరలో అనౌన్స్ చేస్తారు. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe