Venu Swamy: సెలబ్రిటీలతో పూజలు చేయిస్తూ.. సెలబ్రిటీల పర్సనల్ విషయాల్లో జోష్యం చెప్తూ పాపులర్ అయ్యారు వేణు స్వామి. ఆయన పేరు తరచుగా వివాదాల్లో వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా చంద్రయాన్ మూవీ ఫస్ట్ సిగ్నల్ లాంఛ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన వేణు స్వామి కామెంట్లు వైరల్ అయ్యాయి.
సన్నీ లియెన్ లాంటోడిని

వేణు ఉడుగుల సమర్ఫణలో వస్తున్న తెలుగు డిఫరెంట్ మూవీ ‘చంద్రయాన్’. తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో వేణు స్వామి మాట్లాడుతూ.. ‘‘2 ప్లస్ 2.. 5 అంటేనే తెలుగు రాష్ట్రాల్లో బతకాలి. ఇక్కడ ఒక సూత్రం ఉంటుంది. నేను నీ బట్టలు విప్పొచ్చు కానీ నువ్వు నా బట్టలు విప్పొద్దు. నేను నీ మీద రాళ్లు వేయొచ్చు కానీ నువ్వు నా మీద రాళ్లు వేయడానికి వీల్లేదు.
నేను సన్నీ లియోన్ లాంటోడిని. నేను ఆల్రెడీ అన్నీ విప్పుకున్నా. విప్పుకోవడానికి ఏం లేదు. విప్పడానికి ఏం లేదు’’ అని వేణు స్వామి తెలిపారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సల్మాన్ ఖాన్ కు రాజయోగం
‘‘సల్మాన్ ఖాన్ కు రాజయోగం రాబోతుంది. వాళ్ల తమ్ముడికి చెప్పా. వాళ్లు లైట్ గా తీసుకున్నారు. నేను మనవాళ్లకు చెప్తే అంత ఈజీగా తీసుకోరు. ఆర్టికల్ 21 ప్రకారం అందరిలాగే నేను మాట్లాడతా. ఇందులో ఏం తేడా లేదు’’ అని వేణు స్వామి చెప్పారు.
ఒకవేళ రాకెట్లో వెళ్లాల్సి వస్తే తాను అల్లు అర్జున్ తో కలిసి వెళ్తానని వేణు స్వామి చెప్పడం గమనార్హం. అలాగే ఈ ఈవెంట్ కు యాంకర్ గా వ్యవహరించిన అమ్మాయి 2027లో కచ్చితంగా హీరోయిన్ అవుతుందని కూడా వేణు స్వామి జోస్యం చెప్పారు.
చంద్రయాన్ గురించి
{{/usCountry}}ఒకవేళ రాకెట్లో వెళ్లాల్సి వస్తే తాను అల్లు అర్జున్ తో కలిసి వెళ్తానని వేణు స్వామి చెప్పడం గమనార్హం. అలాగే ఈ ఈవెంట్ కు యాంకర్ గా వ్యవహరించిన అమ్మాయి 2027లో కచ్చితంగా హీరోయిన్ అవుతుందని కూడా వేణు స్వామి జోస్యం చెప్పారు.
చంద్రయాన్ గురించి
{{/usCountry}}ఊర్లోని కుర్రాళ్లు ఓ రాకెట్ కనిపెట్టి, చంద్రునిపైకి వెళ్లాలని చేసే ప్రయత్నాలు చుట్టూ తిరిగే సినిమానే చంద్రయాన్. డైరెక్టర్ వేణు ఉడుగుల ప్రజెంట్ చేసిన మూవీ. ఇందులో శివ కుమార్, స్వప్న ప్రియదర్శిని, శివ తేజ, వంశీధర్, లోకేష్ తదితరులు నటిస్తున్నారు.
చంద్రుడి మీదకు వెళ్లేందుకు రాకెట్ కనిపెట్టాలనుకునే నలుగురు కుర్రాళ్లు ఫోన్లో వీడియోలు చూసి, అందుబాటులో ఉన్న సామాగ్రితో రాకెట్ తయారు చేస్తారు. మరి అది సక్సెస్ అయిందో లేదో అనేది మూవీలో చూడాల్సిందే. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 30న రిలీజ్ కానుంది.