...
...
Next Story

Vijay: ఒక ఎన్టీఆర్, ఒక ఎంజీఆర్, ఒక విజయ్.. రాజకీయాల్లో సినిమా స్టార్ల ప్రభంజనం

Vijay: దేశ రాజకీయాల్లో సంచలనం. సినిమాలను వదిలి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన స్టార్ హీరో దళపతి విజయ్ ప్రభంజనం. తమిళనాడు ప్రజలు జై కొట్టడంతో విజయ్ పార్టీ టీవీకే విజయ దుందుభి మోగిస్తోంది. ఎన్టీఆర్, ఎంజీఆర్ లాగే విజయ్ కూడా హిస్టరీ క్రియేట్ చేశాడు.

Published on: May 4, 2026, 12:13:57 IST
Advertisement

Vijay: ముఖంపై మేకప్ వేసుకొని నటించడమే కాదు, జనాల మనసులు గెలిచి రాష్ట్రాలనూ ఏలగలమని చాటిన దిగ్గజాలున్నారు. సినిమా గ్లామర్ నుంచి రాజకీయ శిఖరాలను అధిరోహించిన మహానేతలున్నారు. సౌత్ ఇండియాలో అలాంటి దిగ్గజాలే ఎన్టీఆర్, ఎంజీఆర్. ఇప్పుడు దళపతి విజయ్ ఆ లెజెండ్ల సరసన చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

రాజకీయాల్లోనూ అదుర్స్

ఎంజీఆర్, విజయ్, ఎన్టీఆర్ (x)
ఎంజీఆర్, విజయ్, ఎన్టీఆర్ (x)

సినిమా వాళ్లు రాజకీయాలకు పనికి రారు అనే విమర్శలకు అదిరిపోయే సమాధానం చెప్పిన దిగ్గజ నేత, తెలుగు వారి ఆస్తి నందమూరి తారక రామారావు (NTR). వెండితెరపై రాముడిగా, కృష్ణుడిగా వెలిగి, తెలుగు వారి ఆరాధ్య దైవమైన ఆయన.. రాజకీయాల్లోనూ తన ముద్ర వేశారు.

9 నెలల్లోనే

తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ‘తెలుగు దేశం పార్టీ’ని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన అద్భుతమైన ఘనత దివంగత ఎన్టీఆర్ సొంతం. నటుడిగా కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే ఆయన ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. సామాన్యుడి కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ తెలుగు రాజకీయాల్లో ఆదర్శంగా నిలిచాయి.

తమిళనాడు రాజకీయ శక్తి

తమిళనాడు రాజకీయాల్లో ఎం.జి. రామచంద్రన్ (MGR) ఒక అజేయమైన శక్తిగా కొనసాగారు. పేద ప్రజల పాలిట దేవుడిగా పేరు తెచ్చుకున్న ఆయన.. ఏఐఏడీఎంకే పార్టీని స్థాపించి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పథకాలతో, విప్లవాత్మక నిర్ణయాలతో ఆయన కోట్లాది మంది గుండెల్లో చెరగని ముద్ర వేశారు.

ఇప్పుడు విజయ్

ప్రస్తుతం కోలీవుడ్ 'దళపతి' విజయ్ తన సినీ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే రాజకీయ రంగప్రవేశం చేశారు. 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీని స్థాపించి, ఎన్నికల బరిలో దిగడమే కాడు విజయ దుందుభి మోగించారు. సీఎం పీఠం అధిరోహించేందుకు చేరువయ్యారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ మాదిరిగానే విజయ్ కూడా తన ప్రజా బలాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోవడంలో విజయవంతమయ్యారు.

కామన్ పాయింట్

సినిమాల్లోని డైలాగుల ద్వారానే ప్రజల్లో రాజకీయ చైతన్యం నింపి, ఆ తర్వాత ఎన్టీఆర్, ఎంజీఆర్, విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. విజయ్ కూడా తన సినిమాల్లో సామాజిక సమస్యలపై గళమెత్తి జనాల మనసులు గెలుచుకున్నారు. ఇప్పుడు ఓట్లు దక్కించుకున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe