Vijay Rashmika: ఫ్లైట్‌లో విరోష్ జోడీ..ఒక్క‌సారిగా షాక్ అయిన ప్ర‌యాణికులు..ఎకాన‌మీలో విజ‌య్,ర‌ష్మిక జ‌ర్నీ..వీడియో వైరల్

Vijay Rashmika: రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రధాన మంత్రిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఆ తర్వాత హైదరాబాద్ కు ఎకానమీ క్లాస్ లో ప్రయాణించారు. వీళ్లను ఫ్లైట్ లో చూసిన ప్యాసింజర్లు షాక్ అయ్యారు.

Published on: Mar 1, 2026, 13:42:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. విరోష్ జోడీ ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకుంది. ఆ వెంటనే ఢిల్లీలో ప్రధాన మంత్రి మోడీని కలిసేందుకు విరోష్ వెళ్లారు. ప్రధానిని తమ వెడ్డింగ్ రిసెప్షన్ కు ఆహ్వానించారు. ఆ తర్వాత హైదరాబాద్ కు రిటర్న్ అయ్యారు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న` (Pic credit: Being Vicky Photography)
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న` (Pic credit: Being Vicky Photography)

విమానంలో విరోష్

హైదరాబాద్ కు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న విమానంలో వచ్చారు. అయితే వీళ్లు ఎకానమీ క్లాస్ లో ప్రయాణించడం విశేషం. విరోష్ జోడీని ప్లైట్ లో చూడగనే ప్రయాణికులు ఒక్క సారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

వైరల్ వీడియో

ఒక మేకప్ ఆర్టిస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో రష్మిక, విజయ్ విమానంలో ఉన్నట్లు కనిపించింది. రష్మిక సంతోషంగా నవ్వుతూ విమానంలోని ప్రయాణికులకు హాయ్ చెప్తూ కనిపించింది. ఈ వీడియోలో విజయ్ సిబ్బందితో మాట్లాడుతూ సీటు కోసం ఎదురుచూస్తున్నట్లు కనిపించాడు. మరోవైపు రష్మిక ఏమో ప్రయాణికులకు నవ్వుతూ అభివాదం చేస్తూ నవ్వుతూ కనిపించింది. ఎకానమీ క్లాస్ లో విజయ్, రష్మిక ప్రయాణించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందనే కామెంట్లు వస్తున్నాయి.

నెటిజన్ల రియాక్షన్

ఫ్లైట్ లో ఎకానమీ క్లాస్ లో విజయ్, రష్మిక ప్రయాణించడంపై నెటిజన్ల రియాక్షన్ వైరల్ గా మారింది. ‘‘మిస్టర్ & మిసెస్ దేవరకొండ ఇక్కడ ఉన్నారు’’ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ‘‘వాళ్లను చూసి చాలా సంతోషమేసింది’’, ‘‘రష్మిక ఆనందం చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంది’’, ‘‘వీళ్లు ఎకానమీలో ప్రయాణిస్తారా?’’ అని నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.

ప్రైవేట్ జర్నీ

‘‘పెళ్లి తర్వాత విజయ్, రష్మిక ఎకానమీలో ట్రావెల్ చేయడం ఏంటీ? వాళ్లు ప్రైవేట్ గా ప్రయాణిస్తారని అనుకున్నా’’ అని ఓ యూజర్ పేర్కొన్నాడు. ‘‘ఇలాంటి రిచ్ పర్సన్స్ కూడా ఇండిగోలో ప్రయాణిస్తారా’’ అని మరొకరు కౌంటర్ వేశాడు. ‘‘రష్మికకు విజయ్ విండో సీట్ ఇచ్చాడు’’ అని ఇంకొకరు రాసుకొచ్చారు.

రిసెప్షన్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఫిబ్రవరి 26న గ్రాండ్ గా జరిగింది. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే అటెండ్ అయ్యారు. తెలుగు, కొడవ సంప్రదాయాల్లో విరోష్ వెడ్డింగ్ జరిగింది. మార్చి 4న హైదరాబాద్ లో రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ రిసెప్షన్ కు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కాబోతున్నారు.

మరోవైపు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రష్మిక ఇన్ స్టాలో పోస్టు చేసిన ఫొటో పోస్టు అత్యధిక లైక్స్ సాధించిన పోస్టుగా రికార్డు ఖాతాలో వేసుకుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More