...
...
Next Story

Virosh Reception: హైద‌రాబాద్‌లో విరోష్ రిసెప్ష‌న్‌..ఫ్యాన్స్‌కు విజ‌య్‌, ర‌ష్మిక రిక్వెస్ట్‌.. కేవ‌లం వాళ్ల‌కు మాత్ర‌మే

Virosh Reception: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ జంట ఇప్పుడిక హైదరాబాద్ లో రిసెప్షన్ గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కు విజయ్, రష్మిక ఓ రిక్వెస్ట్ చేశారు.

Published on: Mar 2, 2026, 10:20:09 IST
Advertisement

లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ విరోష్ జంట ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ హోటల్లో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఈ రిసెప్షన్ నేపథ్యంలో ఫ్యాన్స్ కు విజయ్, రష్మిక చేసిన రిక్వెస్ట్ వైరల్ గా మారింది.

విరోష్ రిసెప్షన్

రష్మిక, విజయ్ దేవరకొండ (ANI Video Grab)
రష్మిక, విజయ్ దేవరకొండ (ANI Video Grab)

హైదరాబాద్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. మార్చి 4న సాయంత్రం సిటీలోని తాజ్ హోటల్లో ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ కు రాజకీయ, సినిమా రంగాలకు చెందిన ప్రముఖులు అటెండ్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్ ను ‘ఇన్వైట్ ఓన్లీ’ కార్యక్రమంగా నిర్వహించనున్నారు.

విజయ్, రష్మిక రిక్వెస్ట్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫ్యాన్స్ కు చేసిన రిక్వెస్ట్ హాట్ టాపిక్ గా మారింది. తమ రిసెప్షన్ కు కేవలం ఆహ్వానం ఉన్నవాళ్లు మాత్రమే రావాలని ఈ జంట స్పష్టం చేసింది. ఇతరులను లోపలికి అనుమతించమని చెప్పేసింది. అభిమానులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని విజయ్, రష్మిక కోరారు.

కేవలం వాళ్లకే

విరోష్ టీమ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన నోట్ ప్రకారం.. ‘‘విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ కేవలం ఆహ్వానితులకే పరిమితం. అభిమానులు, అతిథులు ఈ మేరకు సహకరించాలని కోరుతున్నాం. భద్రతా చర్యలకు ఎలాంటి ఆటకం కలిగించొద్దని విన్నవిస్తున్నాం. మీ భద్రత, సంతోషం మాకు చాలా ముఖ్యం. మీ ఆశీర్వాదాలు, మద్దతుకు మేము ఎంతో కృతజ్ఞులం. ఈ వేడుకను సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవడంలో మీ సహకారాన్ని కోరుతున్నాం’’ అని విజయ్, రష్మిక కోరారు.

సెలబ్రిటీలు

వెడ్డింగ్ రిసెప్షన్ జరిగే హోటల్ బయట కూడా గుమిగూడొద్దని, ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలిగించొద్దని అభిమానులను విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కోరారు. కేవలం ఆహ్వానం ఉన్నవాళ్లే లోపలికి రావాలని క్లారిటీగా చెప్పేశారు. ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కు రావాలిన ప్రధానమంత్రి మోదీని విజయ్, రష్మిక వెళ్లి స్వయంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

Statement from Rashmika and Vijay's team
 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks