...
...
Next Story

నాగర్ కర్నూల్ : స్వగ్రామానికి విజయ్ దేవరకొండ దంపతులు - స్వాగతం పలికిన గ్రామస్తులు, వీడియో

విజయ్-రష్మిక దంపతులు స్వగ్రామం తుమ్మెనపేటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారికి ఘన స్వాగతం పలికారు.

Published on: Mar 2, 2026, 12:09:38 IST
Advertisement

ఇటీవలే వివాహం చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ దంప‌తులు వారి స్వ‌గ్రామం చేరుకున్నారు. దీంతో నాగర్ కర్నూల్ జిల్లాలోని బలమూరు మండలం తుమ్మన్‌పేటలో సందడి నెలకొంది. నూతన దంపతులకు గ్రామస్థులు… ఘనస్వాగతం పలికారు. డప్పు చప్పుళ్ల మధ్య వారి నివాసానికి తీసుకెళ్లారు.

తులసిమాతకు ప్రత్యేక పూజలు..

తుమ్మెనపేటలో విజయ్‌ దేవరకొండ దంపతులు
తుమ్మెనపేటలో విజయ్‌ దేవరకొండ దంపతులు

ఇవాళ ఉదయం 11:15 గంటలకు నూతన దంపతులు విజయ్ దేవరకొండ- రష్మిక వేదమంత్రాలతో డప్పు వాయిద్యాల మధ్య తులసిమాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సత్యనారాయణస్వామి వ్రతం కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త దంపతులను చూసేందుకు గ్రామస్థులతో పాటు చుట్టపక్కల గ్రామాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. అభిమానులు, గ్రామస్థుల రాకతో విజయ్ దేవరకొండ ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది.

వీరి వివాహం ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించనున్నారు మార్చి 4న సాయంత్రం సిటీలోని తాజ్ హోటల్లో ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ కు రాజకీయ, సినిమా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్ ను ‘ఇన్వైట్ ఓన్లీ’ కార్యక్రమంగా నిర్వహించనున్నారు.

వెడ్డింగ్ రిసెప్షన్ జరిగే హోటల్ బయట కూడా గుమిగూడొద్దని, ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలిగించొద్దని అభిమానులను విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కోరారు. కేవలం ఆహ్వానం ఉన్నవాళ్లే లోపలికి రావాలని క్లారిటీగా చెప్పేశారు. ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కు రావాలిన ప్రధానమంత్రి మోదీని విజయ్, రష్మిక వెళ్లి స్వయంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe