ఏడేళ్ల ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లిన టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి సెలబ్రేషన్స్ కు సంబంధించిన అద్భుతమైన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఉదయ్‌పూర్‌లో అత్యంత వైభవంగా జరిగిన వీరి వివాహానికి ముందు నిర్వహించిన 'ప్రధానం', 'మెహందీ' వేడుకల ఫోటోలను ఈ జంట సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకల్లో 'విరోష్' (Virosh) జోడీ సందడి చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
అంగరంగ వైభవంగా ప్రీ-వెడ్డింగ్ వేడుకలు

గత నెల అంటే ఫిబ్రవరి 25న జరిగిన ఈ వేడుకల్లో విజయ్, రష్మికలు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. షేర్ చేసిన ఫోటోల్లో ఈ జంట కలిసి డ్యాన్స్ చేస్తూ, నవ్వులు చిందిస్తూ కనిపించారు. ఒక ఫోటోలో రష్మిక నుదుటిపై విజయ్ ముద్దు పెడుతున్న సీన్ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. ఈ వేడుక కోసం రష్మిక ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న దుస్తుల్లో మెరిసిపోయింది.
తమ సంతోషాన్ని పంచుకుంటూ రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టింది. "25.02.26.. అది ఒక అద్భుతమైన మెహందీ, ప్రధానం ఈవెనింగ్. అంతా పర్ఫెక్ట్‌గా జరిగింది, కానీ సమయం మాత్రం చాలా వేగంగా గడిచిపోయింది. మా కోసం ఇంతటి ప్రత్యేకమైన దుస్తులను రూపొందించినందుకు తోరాని (Torani) టీమ్‌కు ధన్యవాదాలు" అని పేర్కొంది.
విజయ్ దేవరకొండ కూడా అదే రోజును గుర్తు చేసుకుంటూ.. "ఆ సాయంత్రం ఎంతో సరదాగా గడిచింది. వంద గంటలైనా ఆ సమయం అలాగే ఉంటే బాగుండు అనిపించింది" అని తన మనసులోని మాటను రాసుకొచ్చాడు.
'విరోష్' వివాహం.. తరలివచ్చిన సినీ తారాలోకం
ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్ శివార్లలోని ఒక లగ్జరీ హోటల్లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. అనంతరం హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ దిగ్గజాలు చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగార్జున, అమల, నాగచైతన్య, వెంకటేష్, నాని వంటి తారలు హాజరయ్యారు. అలాగే బాలీవుడ్ నుంచి కృతి సనన్, కరణ్ జోహార్ సహా పలువురు ప్రముఖులు విచ్చేసి కొత్త జంటను ఆశీర్వదించారు.
{{/usCountry}}ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్ శివార్లలోని ఒక లగ్జరీ హోటల్లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. అనంతరం హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ దిగ్గజాలు చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగార్జున, అమల, నాగచైతన్య, వెంకటేష్, నాని వంటి తారలు హాజరయ్యారు. అలాగే బాలీవుడ్ నుంచి కృతి సనన్, కరణ్ జోహార్ సహా పలువురు ప్రముఖులు విచ్చేసి కొత్త జంటను ఆశీర్వదించారు.
{{/usCountry}}'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ జంట, నిజ జీవితంలోనూ ఏడడుగులు వేయడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'రణబాలి' అనే పీరియడ్ డ్రామాలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.