...
...
Next Story

Vijay Deverakonda: ఆ సీన్‌లో రష్మికను చూసి మా అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది.. నా స్కూల్ ఫ్రెండ్ కూడా అలాగే..: విజయ్

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన రణబాలి థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విజయ్ ఇందులో రష్మిక నటించిన జయమ్మ సీన్ చూసి తన తల్లి వెక్కి వెక్కి ఏడ్చేసిందని చెప్పారు.

Published on: Oct 16, 2026, 21:35:21 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Vijay Deverakonda: టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ 'రణబాలి' (Ranabaali) అక్టోబర్ 16న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజైంది. టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ (Rahul Sankrityan) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై మిక్స్‌డ్ రియాక్షన్స్ వస్తున్న తరుణంలో, సినిమాకు సంబంధించిన ఒక సెంటిమెంటల్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పెళ్లి తర్వాత ఈ జంట నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో ఫ్యాన్స్‌లో భారీ క్రేజ్ నెలకొంది.

Vijay Deverakonda: ఆ సీన్‌లో రష్మికను చూసి మా అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది.. నా స్కూల్ ఫ్రెండ్ కూడా అలాగే..: విజయ్
Vijay Deverakonda: ఆ సీన్‌లో రష్మికను చూసి మా అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది.. నా స్కూల్ ఫ్రెండ్ కూడా అలాగే..: విజయ్

సినిమా చూస్తున్న సమయంలో విజయ్ దేవరకొండ తల్లి మాధవి ఎమోషనల్ సీన్ చూసి బోరున ఏడ్చేశారని, ఆ వెంటనే రష్మిక మందన్న ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చాల్సి వచ్చిందని విజయ్ స్వయంగా ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు.

జయమ్మ పాత్ర అంటే నాకు ప్రాణం.. విజయ్ దేవరకొండ

సినిమాలో రష్మిక పోషించిన 'జయమ్మ' క్యారెక్టర్ గురించి విజయ్ మాట్లాడుతూ.. "నాకు జయమ్మ అంటే చాలా ఇష్టం. ఆన్-స్క్రీన్, ఆఫ్-స్క్రీన్ ఎప్పుడూ ఐ లవ్ హర్. సెట్‌లో ఆమెను ఫస్ట్ టైమ్ పెళ్లి చీరలో చూసినప్పుడే నాకు ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడింది. ఎందుకంటే అప్పటికి మాకు పెళ్లి కాలేదు, కానీ నిజ జీవితంలో పెళ్లికి ముందే ఆమెను అలా చూడటం స్పెషల్ ఫీలింగ్" అని చెప్పుకొచ్చారు.

ఇక సెకండాఫ్‌లో రణబాలి, జయమ్మ మధ్య వచ్చే కీలకమైన ఎమోషనల్ సీన్ గురించి చెబుతూ.. "ఆ సీన్ షూట్ చేస్తున్నప్పుడు నా శరీరం ఫిజికల్ పెయిన్‌ను ఫీలయింది. ఆ భయం, ఆ నొప్పులు నా గుండెల్లో అలాగే ఉండిపోయాయి. ఆడియన్స్ ఎవరైనా సరే ఆ సీన్ చూస్తే అదే ఇంటెన్సిటీని ఫీలవుతారు" అని విజయ్ చెప్పారు.

సినిమా చూస్తూ వెక్కి వెక్కి ఏడ్చింది.. నా ఫ్రెండ్ కూడా..

అంతేకాకుండా తన చిన్ననాటి స్నేహితులు కూడా సినిమాలోని ఎమోషనల్ సీన్లకు కంటతడి పెట్టుకున్నారని, ఈ సినిమా సబ్జెక్ట్ అందరి హత్తుకునేలా చాలా ఇంటెన్సిటీతో ఉంటుందని విజయ్ తెలిపారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల తర్వాత ఈ జంట నుంచి వచ్చిన ఈ మాస్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks