టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న న్యూ ఇయర్ వేడుకల కోసం ఇటలీ వెళ్లి, తాజాగా సోమవారం హైదరాబాద్ తిరిగొచ్చారు. వెళ్లేటప్పుడు ఎవరికి వారు విడివిడిగా వెళ్లినా.. వచ్చేటప్పుడు మాత్రం ఒకేసారి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. వీరి ఎయిర్‌పోర్ట్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
విడిగా వెళ్లి.. కలిసి వచ్చి..

సోమవారం (జనవరి 5) హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విజయ్, రష్మిక సందడి చేశారు. ఇటలీలో కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకున్న ఈ జంట, తిరిగి రావడంతో పెళ్లి వార్తలు మళ్ళీ ఊపందుకున్నాయి. మీడియా కంటపడకుండా ఉండేందుకు ఇద్దరూ మాస్కులు ధరించి, లో-ప్రొఫైల్ మెయింటైన్ చేశారు.
రష్మిక గ్రే ట్రౌజర్స్, వైట్ హై-నెక్ టీషర్ట్, బ్లాక్ కోట్ వేసుకోగా.. విజయ్ బ్లాక్ ప్యాంట్స్, లెదర్ జాకెట్, బ్లూ క్యాప్‌తో స్టైలిష్‌గా కనిపించాడు. ఫొటోగ్రాఫర్లకు పోజులివ్వకుండా, తమ సెక్యూరిటీతో కలిసి వేగంగా కారు వైపు వెళ్లిపోయారు.
వీరి వీడియో చూసిన ఫ్యాన్స్.. "పర్ఫెక్ట్ కపుల్", "లవ్ బర్డ్స్", "అతి లేదు, ఫేక్ లేదు.. చాలా జెన్యూన్ జోడి" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
విజయ్, రష్మిక ఇటలీ హింట్స్
కొద్ది రోజుల క్రితం ఇద్దరూ ఇటలీలో ఉన్నప్పుడు షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. వేర్వేరుగా ఫోటోలు దిగినా.. బ్యాక్‌గ్రౌండ్స్ సేమ్ ఉండటంతో ఫ్యాన్స్ ఇట్టే పసిగట్టేశారు. ముఖ్యంగా విజయ్ షేర్ చేసిన ఒక ఫోటోలో ఒక అమ్మాయి తల అతని భుజంపై వాలి ఉండటం చూసి.. అది కచ్చితంగా రష్మికే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.
వీరిద్దరి పెళ్లి గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. హిందుస్తాన్ టైమ్స్ కు ఆ జంట సన్నిహిత వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 3, 2025 (దసరా మరుసటి రోజు) వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో సీక్రెట్‌గా ఉంగరాలు మార్చుకున్నారట.
{{/usCountry}}వీరిద్దరి పెళ్లి గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. హిందుస్తాన్ టైమ్స్ కు ఆ జంట సన్నిహిత వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 3, 2025 (దసరా మరుసటి రోజు) వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో సీక్రెట్‌గా ఉంగరాలు మార్చుకున్నారట.
{{/usCountry}}ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. కేవలం కుటుంబం, అత్యంత సన్నిహితుల మధ్యే ఈ వేడుక జరగనుందట. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో ఆడియెన్స్ మనసు గెలుచుకున్న ఈ జంట.. త్వరలోనే రియల్ లైఫ్ పార్ట్నర్స్ కాబోతున్నారని టాక్.