టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం (ఫిబ్రవరి 24) రాత్రి జరిగిన 'సంగీత్' వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు బుధవారం ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఇందులో ఈ జంటకు సంబంధించిన ఎన్నో అన్‌సీన్ రొమాంటిక్ ఫొటోలు ఉండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వధూవరులను ఉద్దేశించి విజయ్ తల్లి మాధవి ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ నెట్టింట వైరల్‌గా మారింది.
అందరి దృష్టిని ఆకర్షించిన అన్‌సీన్ ఫొటోలు

ఉదయ్‌పూర్‌లోని విలాసవంతమైన వేదికలో మంగళవారం సాయంత్రం విజయ్, రష్మికల సంగీత్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బుధవారం నెట్టింట లీక్ అయ్యాయి. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ వేడుకల విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.
సంగీత్ వేడుక కోసం వేదికను ప్రకాశవంతమైన దీపాలు, తాజా పూలతో ఎంతో అందంగా అలంకరించారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం అక్కడ ప్రదర్శించిన అన్‌సీన్ ఫొటోలే. ఇన్నేళ్ల ప్రయాణంలో ఈ జంట తీసుకున్న ఎన్నో అందమైన, రొమాంటిక్ ఫొటోలను వేదిక అంతటా ప్రదర్శించారు.
ఇవి చూసిన అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. "ఎన్ని అందమైన ఫొటోలో కదా" అని ఒకరు కామెంట్ చేయగా.. "రష్మిక గారూ.. దయచేసి ఆ ఒరిజినల్ ఫొటోలు మాకు కావాలి" అని మరొక అభిమాని కామెంట్ చేశారు. చాలా మంది ఈ ఫొటోలు చాలా క్యూట్‌గా ఉన్నాయని చెబుతూ హార్ట్ ఎమోజీలతో తమ ప్రేమను పంచుకుంటున్నారు.
కాబోయే కోడలిపై విజయ్ తల్లి ప్రేమ..
ఈ సంగీత్ వేడుకలో విజయ్ దేవరకొండ తల్లి మాధవి మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. "హలో ఫ్రెండ్స్. నా ముద్దుల పిల్లలు, నా బంగారం విజయ్, రషీ (రష్మికను ప్రేమగా పిలుస్తూ..)లకు ఈ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ పెర్ఫార్మెన్స్ను అంకితం చేస్తున్నాను. వుయ్ లవ్ యూ" అని ఎంతో ఎమోషనల్ అయింది.
{{/usCountry}}ఈ సంగీత్ వేడుకలో విజయ్ దేవరకొండ తల్లి మాధవి మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. "హలో ఫ్రెండ్స్. నా ముద్దుల పిల్లలు, నా బంగారం విజయ్, రషీ (రష్మికను ప్రేమగా పిలుస్తూ..)లకు ఈ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ పెర్ఫార్మెన్స్ను అంకితం చేస్తున్నాను. వుయ్ లవ్ యూ" అని ఎంతో ఎమోషనల్ అయింది.
{{/usCountry}}ఈ వీడియోను షేర్ చేస్తున్న ఫ్యాన్స్ "ఈ స్పీచ్ హృదయాన్ని తాకింది", "ఇదే అసలైన ప్రేమ" అంటూ కాప్షన్స్ పెడుతున్నారు. అయితే ఆ సర్ప్రైజ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఎవరు చేశారో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. బహుశా కుటుంబ సభ్యులే ఈ డ్యాన్స్ ప్లాన్ చేసి ఉంటారని తెలుస్తోంది.
హల్దీ, మెహెందీ సందడి
విజయ్, రష్మికల ప్రీ-వెడ్డింగ్ వేడుకలు తొలుత 'విరోష్ ప్రీమియర్ లీగ్' ఆటలతో ప్రారంభమైన విషయం తెలిసిందే. బుధవారం నాడు హల్దీ, మెహందీ కార్యక్రమాలు ఎంతో కోలాహలంగా జరిగాయి. ఈ వేడుకల కోసం అతిథులంతా పసుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయారు. ప్రముఖ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ తన సోషల్ మీడియాలో ఒక ఫొటోను పోస్ట్ చేసింది. అందులో దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా తదితరులు పసుపు రంగు దుస్తుల్లో ఎంతో ఉత్సాహంగా కనిపించారు.
విరోష్ పెళ్లి ముహూర్తం
హిందుస్థాన్ టైమ్స్ సోర్స్ ప్రకారం.. ఫిబ్రవరి 26 ఉదయం 8 గంటలకు వివాహ ముహూర్తం ఖరారైంది. ఈ పెళ్లికి హాజరయ్యేందుకు 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ఆషికా రంగనాథ్, రాహుల్ రవీంద్రన్ తదితరులు ఉదయ్‌పూర్ చేరుకున్నారు. వివాహానికి హాజరుకాలేకపోయిన ప్రధాని మోదీ.. ఈ జంటకు లేఖ ద్వారా తన ఆశీస్సులు పంపారు. ఈ వివాహం అనంతరం మార్చిలో హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం ఒక గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది.