Vijay Rashmika: విజయ్, రష్మిక పెళ్లికి నెల రోజులు.. ఇప్పటి వరకూ చూడని పెళ్లి ఫొటోలు షేర్ చేసిన కపుల్
Vijay Rashmika: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి జరిగి నెల రోజులు అయిన సందర్భంగా ఈ జంట అరుదైన పెళ్లి ఫొటోలను షేర్ చేసింది. ఇప్పటి వరకూ అభిమానులు చూడని ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్టార్ కపుల్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ తమ పెళ్లై ఒక నెల పూర్తయిన సందర్భంగా గురువారం (మార్చి 26) నాడు ఫుల్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తమ పెళ్లికి సంబంధించిన కొన్ని అన్‌సీన్ ఫోటోలను వాళ్లు ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. తమ పెళ్లిని అంత స్పెషల్‌గా మార్చిన వారికి థ్యాంక్స్ చెబుతూ రష్మిక, విజయ్ ఇద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్‌లో చాలా పెద్ద సందేశాలు పోస్ట్ చేశారు.

రష్మిక, విజయ్ షేర్ చేసిన అన్‌సీన్ ఫోటోలు..
ఆ ఫోటోల్లో రష్మిక, విజయ్ తమ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అత్యంత సన్నిహితులతో కలిసి తమ స్పెషల్ డేను భలేగా సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. కొన్ని ఫోటోల్లో ఈ జంట పక్కపక్కన నిలబడి ఎంతో సంతోషంగా నవ్వుతూ పోజులిచ్చారు. ఒక ఫోటోలో విజయ్ రష్మికను దగ్గరగా హత్తుకుని కెమెరాకు ఫోజులివ్వగా.. ఇంకో ఫోటోలో ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ, చేతులు వేసుకుని నవ్వులు చిందిస్తూ కనిపించారు.
ఎమోషనల్ నోట్స్ రాసిన రష్మిక, విజయ్..
రష్మిక తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చింది.. మా పెళ్లై అప్పుడే నెల రోజులైందంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. పెళ్లి చేసుకోవడం అనేది ఒకప్పుడు నాకు చాలా దూరమైన ఆలోచనలా అనిపించేది. కానీ ఇప్పుడు మా పెళ్లై నెల రోజులు దాటేసింది.. ఇది నిజంగా పిచ్చిగా ఉంది. పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఈ మహిళలు నాకు అండగా నిలబడ్డారు. నేను వాళ్లకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇది ఎప్పటికీ నిలిచిపోయే ప్రేమ అని రష్మిక ఎమోషనల్ అయింది.
ఐశ్వర్య కొల్లా, ప్రియా మాగంటి, అర్పితలకు ఆమె స్పెషల్‌గా ఈ నోట్‌ను డెడికేట్ చేసింది. ఇది మీ రోజు, జస్ట్ ఎంజాయ్ చేయండి, అన్నీ మర్చిపోయి బ్లాస్ట్ చేయండి అని చెప్పినందుకు మీ అందరికీ థ్యాంక్స్, మేం సరిగ్గా అదే చేశాం. మీరంతా లేకపోతే నా పెళ్లి ఇంత అద్భుతంగా జరిగేది కాదు. నన్ను ఎప్పుడూ గ్రౌండెడ్‌గా, ప్రశాంతంగా ఉంచే నా లైఫ్‌లోని మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ వీళ్లే. ఇదే నా చిన్న ప్రపంచం అని రష్మిక ముగించింది.
విజయ్ కూడా తన పోస్ట్‌లో చాలా హార్ట్ టచింగ్‌గా రాశాడు. మా పెళ్లై నెల రోజులైంది. మనందరి జీవితాల్లో కొన్ని పెద్ద మూమెంట్స్ ఉంటాయి. ఏదో ఒక టైమ్‌లో మనం ఆ మూమెంట్స్‌ను ఫేస్ చేస్తాం. మనకు తెలిసేలోపే ఆ క్షణాలు గడిచిపోతాయి. కానీ మనం దాన్ని కరెక్ట్‌గా చేస్తే గనక, ఆ మెమరీస్ మనతో ఎప్పటికీ ఉండిపోయి, మనకు అందరికీ ఎనలేని ఆనందాన్ని ఇస్తాయి. ఇది ఎప్పుడూ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను, నా రష్మీ మళ్లీ పనిలోకి వెళ్తున్న ఈ టైమ్‌లో.. నా పెళ్లి, నా చుట్టూ ఉన్నవాళ్లందరూ ఇంత ఆనందంగా ఉండేలా చూసుకున్న కొంతమంది మహిళలకు నా ప్రేమను పంచాలనుకుంటున్నాను అని విజయ్ అన్నాడు. వాళ్ల వెడ్డింగ్ ప్లానర్స్ అయిన అర్పిత, ఐశ్వర్య, ప్రియాలకు అతను స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పాడు.
రష్మిక, విజయ్ పెళ్లి విశేషాలు..
ఉదయ్‌పూర్ శివార్లలోని ఒక లగ్జరీ హోటల్‌లో ఫిబ్రవరి 26న కేవలం అత్యంత సన్నిహితుల మధ్య ఈ ఇద్దరు స్టార్స్ పెళ్లి పీటలెక్కారు. ఆ తర్వాత కొద్ది రోజులకే హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో వీళ్ల రిసెప్షన్ చాలా గ్రాండ్‌గా జరిగింది.
గీత గోవిందం, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట.. దాదాపు ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. కానీ పెళ్లికి కొద్ది రోజుల ముందు మాత్రమే వాళ్లు తమ రిలేషన్‌షిప్‌ను అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు. అభిమానులు వాళ్లను ముద్దుగా పిలుచుకునే విరోష్ అనే పేరుతోనే వాళ్లు తమ పెళ్లిని వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పిలుచుకున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఇద్దరు స్టార్స్ మళ్లీ కలిసి 'రణబాలి' అనే పీరియడ్ డ్రామా మూవీలో నటించబోతున్నారు. రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


