...
...
Next Story

విజయ్, రష్మిక పెళ్లి పత్రిక చూశారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో.. పెళ్లి, రిసెప్షన్ తేదీలు ఇవే

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి పత్రిక ఇదే అంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో విజయ్ ఇన్విటేషన్ పంపినట్లుగా, రష్మిక తరఫు ఫ్యామిలీ తరఫున కూడా ఆహ్వానిస్తున్నట్లుగా ఉండటం విశేషం.

Published on: Feb 16, 2026, 16:40:27 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా? సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఫిబ్రవరి 26న పెళ్లి, మార్చి 4న గ్రాండ్ రిసెప్షన్ అంటూ ఆ కార్డులో ఉన్న వివరాలు, ఫ్యాన్స్ రియాక్షన్ ఇక్కడ చూడండి.

రష్మిక, విజయ్ పెళ్లి పత్రిక ఇలా..

విజయ్, రష్మిక పెళ్లి పత్రిక చూశారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో.. పెళ్లి, రిసెప్షన్ తేదీలు ఇవే
విజయ్, రష్మిక పెళ్లి పత్రిక చూశారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో.. పెళ్లి, రిసెప్షన్ తేదీలు ఇవే

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

నెట్టింట చక్కర్లు కొడుతున్న ఆ వెడ్డింగ్ కార్డ్ ప్రకారం.. విజయ్, రష్మిక ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోబోతున్నారు. కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరగనుందని అందులో రాసి ఉంది. ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు ఆ జంట చాలా సంతోషంగా ఉన్నట్లు కూడా పేర్కొన్నారు.

మార్చి 4న గ్రాండ్ రిసెప్షన్..

పెళ్లి తర్వాత సినీ ప్రముఖులు, స్నేహితుల కోసం భారీ విందు ఏర్పాటు చేసినట్లు కార్డులో ఉంది. దీనిని మార్చి 4న ఏర్పాటు చేశారు. ఇది హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్లో జరగనుండటం విశేషం. ఆ రోజు సాయంత్రం 7 గంటల నుంచి రిసెప్షన్ మొదలు కానుంది. విజయ్ తరఫున ఇన్విటేషన్ ఉన్నట్లు, అందులో రష్మిక కూడా ఆహ్వానిస్తున్నట్లుగా ఉంది.

ఇది నిజమేనా లేక ఫేకా?

ఇది అభిమానులు క్రియేట్ చేసిన ఫేక్ కార్డ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో కూడా వీరి పెళ్లి గురించి ఇలాంటి పుకార్లు చాలానే వచ్చాయి. కానీ ఈసారి డేట్, వెన్యూతో సహా కార్డ్ బయటకు రావడంతో చర్చనీయాంశమైంది. అసలు విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

క్రేజీ ఓటీటీ డీల్

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ కారణంగా వీళ్ల పెళ్లిని స్ట్రీమింగ్ చేసేందుకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పోటీపడుతున్నాయని తెలిసింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ అయితే ఏకంగా రూ.60 కోట్లు ఆఫర్ చేసినట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ రష్మిక, విజయ్ ఈ డీల్ కు నో చెప్పారని తెలిసింది. తమ పెళ్లిని బిజినెస్ చేయడం వాళ్లకు ఇష్టం లేదని, అందుకే ఓటీటీ డీల్ వద్దనుకున్నారని లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది.

రష్మిక, విజయ్ కలిసి ఫస్ట్ గీతా గోవిందం మూవీ చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీళ్ల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ మూవీలో కలిసి నటించారు. అక్కడి నుంచి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇప్పుడు మూడోసారి రణబాలిలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడేమో పెళ్లి బంధంతో విజయ్, రష్మిక ఒక్కటి కానున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks