...
...
Next Story

Vijay Deverakonda: నా హేటర్స్‌కు చెప్పేది అదే- ర‌ష్మిక‌ను చూస్తే గ‌ర్వంగా ఉంది- చరిత్రలోని చీకటి అధ్యాయం: విజయ్ దేవరకొండ

Vijay Deverakonda: పీరియాడిక్ డ్రామా ‘రణబాలి’ మూవీతో మరోసారి ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు విజయ్ దేవరకొండ రెడీ అవుతున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ రౌడీ హీరో స్పీచ్ వైరల్ గా మారింది. తన హేటర్స్, రణబాలి మూవీ, రష్మిక మందన్న గురించి విజయ్ ఏమన్నారో ఇక్కడ చూసేయండి.

Published on: Oct 14, 2026, 06:31:06 IST
Advertisement

Vijay Deverakonda: ఈ శుక్రవారం (అక్టోబర్ 16) థియేటర్లలో సందడి చేయడానికి విజయ్ దేవరకొండ నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'రణబలి' సిద్ధమైంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. మంగళవారం (అక్టోబర్ 13) రాత్రి హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది.

తెలుగు సినిమా గర్వపడేలా

నా హేటర్స్‌కు చెప్పేది అదే- ర‌ష్మిక‌ను చూస్తే గ‌ర్వంగా ఉంది- చరిత్రలోని చీకటి అధ్యాయం: విజయ్ దేవరకొండ (x/MythriOfficial)
నా హేటర్స్‌కు చెప్పేది అదే- ర‌ష్మిక‌ను చూస్తే గ‌ర్వంగా ఉంది- చరిత్రలోని చీకటి అధ్యాయం: విజయ్ దేవరకొండ (x/MythriOfficial)

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. "ఈ ఈవెంట్ కు వచ్చిన దర్శకులందరికీ నా ధన్యవాదాలు. అప్పుడే పండుగ వాతావరణం మొదలైపోయింది. 'రణబాలి' సినిమా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వపడేలా ఉంటుంది’’ అని తెలిపారు.

చీకటి అధ్యాయం

‘‘దర్శకుడు రాహుల్ ఒక పీరియడ్ మాస్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించడానికి ఎంతో రీసెర్చ్ చేశాడు. చరిత్రలో ఎవరికీ తెలియని ఒక చీకటి అధ్యాయాన్ని ఈ సినిమా కోసం రీసెర్చ్ చేసి కనుక్కున్నాడు" అని విజయ్ దేవరకొండ చెప్పారు. బ్రిటీష్ పాలకుల దారుణాలను ఈ రణబాలి సినిమాలో చూపించారు.

హేటర్స్‌కు గట్టి కౌంటర్

"ట్యాక్సీవాలా రిలీజ్ సమయంలో 'నోటా' ప్లాప్ వల్ల నేను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. నా ఓటమిని చూసి కొందరు ఆనందిస్తున్నారని తెలిసి.. నేను కచ్చితంగా తిరిగి వస్తాను (I will be back) అని ఒక లెటర్ రాశాను. నేను కమ్ బ్యాక్ ఇస్తానని చెప్తే.. కచ్చితంగా కమ్ బ్యాక్ ఇస్తానని నా విమర్శకులకు మరోసారి గుర్తుచేస్తున్నా.

డైరెక్టర్ రాహుల్ నా కోసం అలాంటి ఒక బలమైన పునాదిని మళ్లీ నిర్మిస్తున్నాడు. అంతా అనుకున్నట్లు జరిగితే, అనంతపురంలో నా హేటర్స్‌కు మరోసారి నా కమ్ బ్యాక్ గురించి గట్టిగా గుర్తుచేస్తాను. మనపై మనకు నమ్మకం, పనిపై అంకితభావం ఉండటమే మన చేతుల్లో ఉంది" అని విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు.

రష్మిక గురించి

ఈ సినిమాలో అజయ్-అతుల్ జోడి అందించిన 'ఏందయ్య సామి' పాట కూడా అలాంటి ఒక మ్యాజిక్ సృష్టిస్తోంది. నటిగా రష్మిక మందన్న సాధించిన ఎదుగుదల చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. తనతో కలిసి పని చేయడం ఎప్పుడూ హోమ్లీగా అనిపిస్తుంది" అంటూ విజయ్ దేవరకొండ తన స్పీచ్ ముగించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks