రీసెంట్‌గా పెళ్లి చేసుకున్న మన టాలీవుడ్ క్యూట్ కపుల్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఫైనల్‌గా తమ క్యూట్ లిటిల్ ఫ్యాన్‌ను కలిశారు. తమ పెళ్లికి ఎందుకు పిలవలేదని క్యూట్‌గా అలిగిన ఆ చిన్నారిని, వాళ్ల ఫ్యామిలీని ఏకంగా హైదరాబాద్‌లోని తమ ఇంటికే పిలిచి స్పెషల్‌గా లంచ్ పెట్టడం విశేషం. ఆ చిన్నారి ఫ్యాన్ వాళ్ల ఇంట్లో గడిపిన బ్యూటిఫుల్ డేను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో ద్వారా పోస్ట్ చేసింది. ఆ వీడియోలోని క్యూట్‌నెస్‌ను చూసి ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోతున్నారు. ఫైనల్‌గా ఆ పాప కోరిక తీరినందుకు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్, రష్మిక

యువర్స్ లక్కీ తల్లి (urs_luckythalli) అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఉన్న ఆ చిన్నారి పాప.. విజయ్, రష్మికల ఇంట్లో గడిపిన బ్యూటిఫుల్ టైమ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో తనను పెళ్లికి ఎందుకు పిలవలేదని ఆ పాప అడుగుతుంటే విజయ్ ఎంతో ముద్దుగా ఆమెను ఎత్తుకున్నాడు. రష్మిక అయితే ఆ పాప ప్లేట్ నిండా లడ్డూలు పెట్టి, ఒక స్వీట్ కిస్ కూడా ఇచ్చింది.
విజయ్ కూడా ఆ పాపకు తన చేత్తో అన్నం తినిపించాడు. మనం కూడా ఫ్రెండ్సే కదా అని ఆ చిన్నారి ఎంతో క్యూట్‌గా అడుగుతుంటే విజయ్, రష్మిక ఇద్దరూ నవ్వుతూ మురిసిపోయారు. ఫైనల్‌గా వాళ్లను కలిసినందుకు తను చాలా హ్యాపీగా ఉన్నానని ఆ పాప వాళ్లతో చెప్పింది.
ఆ వీడియో కింద క్యాప్షన్‌లో ఆమె ఇలా రాసుకొచ్చింది.. రీల్ టు రియల్. విజయ్ దేవరకొండను వాళ్ల ఇంట్లో కలవడం నాకు, నా ఫ్యామిలీకి నిజంగా ఒక అద్భుతమైన, ఎప్పటికీ మర్చిపోలేని మెమొరీ. మేం అక్కడికి వెళ్లినప్పటి నుంచి, ఆయన మమ్మల్ని చాలా ఆప్యాయంగా, ఎంతో బాగా చూసుకున్నారు. మమ్మల్ని ఫుల్ కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలా చేశారు. అలాగే రష్మిక మందన్నను కలవడం కూడా ఎంతో ఆనందంగా అనిపించింది. ఆమె చిరునవ్వు, ఆ ఫ్రెండ్లీ నేచర్ మాకు మరింత సంతోషాన్ని ఇచ్చింది అని ఆ పాప పోస్ట్ చేసింది.
పాప చేసిన వైరల్ రీల్ ఇదీ
ఫిబ్రవరి 26న విజయ్, రష్మికల పెళ్లి జరిగిన తర్వాత.. మార్చి ఫస్ట్ వీక్‌లో ఈ క్యూట్ ఫ్యాన్ ఒక వీడియో పోస్ట్ చేసింది. అందులో తనను పెళ్లికి ఎందుకు పిలవలేదని చాలా ముద్దుగా అడిగింది. వాళ్లు అందరికీ లడ్డూలు పెడుతున్నారని, అన్నదానం చేస్తున్నారని, కానీ తనను మాత్రం పిలవలేదని ఆ వీడియోలో అలిగింది. మనం కూడా ఫ్యాన్సే కదా అని క్యూట్‌గా అడుగుతూ, ఈ వీడియో చూస్తున్న వాళ్లంతా దాన్ని ఆ కపుల్‌కు చేరేలా షేర్ చేయాలని అడిగింది.
{{/usCountry}}ఫిబ్రవరి 26న విజయ్, రష్మికల పెళ్లి జరిగిన తర్వాత.. మార్చి ఫస్ట్ వీక్‌లో ఈ క్యూట్ ఫ్యాన్ ఒక వీడియో పోస్ట్ చేసింది. అందులో తనను పెళ్లికి ఎందుకు పిలవలేదని చాలా ముద్దుగా అడిగింది. వాళ్లు అందరికీ లడ్డూలు పెడుతున్నారని, అన్నదానం చేస్తున్నారని, కానీ తనను మాత్రం పిలవలేదని ఆ వీడియోలో అలిగింది. మనం కూడా ఫ్యాన్సే కదా అని క్యూట్‌గా అడుగుతూ, ఈ వీడియో చూస్తున్న వాళ్లంతా దాన్ని ఆ కపుల్‌కు చేరేలా షేర్ చేయాలని అడిగింది.
{{/usCountry}}ఆ వీడియో చూసి ఫుల్ కనెక్ట్ అయిపోయిన విజయ్.. సో క్యూట్ అని కామెంట్ చేశాడు. అంతేకాదు బుజ్జితల్లీ.. ఇంటికి పిలుస్తా లంచ్‌కి.. నీ ఫేవరెట్ ఫుడ్, స్వీట్స్ నాకు చెప్పు, అన్నీ ఇంట్లో చేయించి మంచిగా తిందాము అని రిప్లై ఇచ్చాడు. రష్మిక కూడా ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసి, ఆ పాపకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తానని ప్రామిస్ చేసింది. వాళ్లు చెప్పినట్లుగానే ఆ చిన్నారిని సంతోష పెట్టడానికి తమ ప్రామిస్ నిలబెట్టుకున్నారు. ఇక వీళ్ల నెక్స్ట్ సినిమాల విషయానికొస్తే.. రష్మిక, విజయ్ ఇద్దరూ త్వరలో రణబాలి అనే సినిమాలో కలిసి నటించబోతున్నారు.