Jana Nayagan: విజ‌య్ ‘జ‌న నాయ‌గ‌న్‌’లో అదిరే స‌ర్‌ప్రైజ్‌.. సంచ‌ల‌న విష‌యం చెప్పిన డైరెక్ట‌ర్.. సినిమాలో ఆ క్యామియోలూ!

Jana Nayagan: దళపతి విజయ్ ఆఖరి చిత్రం 'జన నాయగన్' జూలై 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాపై అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ సృష్టిస్తుండగా, దర్శకుడు హెచ్.వినోత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన మైండ్-బ్లోయింగ్ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటో ఇక్కడ చూసేయండి.

Published on: Jul 22, 2026, 05:38:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Jana Nayagan: సినిమా రంగానికి గుడ్‌బై చెప్పి పూర్తిస్థాయి ప్రజాసేవలోకి అడుగుపెట్టిన దళపతి విజయ్ చిట్టచివరి చిత్రం ‘జన నాయగన్’. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది అభిమానులు అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ కు ఒక్క రోజు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ హెచ్.వినోత్ చేసిన సంచలన కామెంట్లు వైరల్ గా మారాయి.

విజ‌య్ ‘జ‌న నాయ‌గ‌న్‌’లో అదిరే స‌ర్‌ప్రైజ్‌..డైరెక్ట‌ర్ చెప్పిన సంచ‌ల‌న విష‌యం ఇదే..సినిమాలో ఆ క్యామియోలూ!
విజ‌య్ ‘జ‌న నాయ‌గ‌న్‌’లో అదిరే స‌ర్‌ప్రైజ్‌..డైరెక్ట‌ర్ చెప్పిన సంచ‌ల‌న విష‌యం ఇదే..సినిమాలో ఆ క్యామియోలూ!

జన నాయగన్ రిలీజ్ డేట్

కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా జన నాయగన్ జూలై 23న థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఆల్-టైమ్ రికార్డులను తిరగరాస్తున్న ఈ సినిమా నుంచి బయటకొచ్చిన ఒక సంచలనాత్మక లీక్ ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తం మార్మోగిపోతోంది.

ముగ్గురు డైరెక్టర్లు

జన నాయగన్ చిత్ర దర్శకుడు హెచ్.వినోత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'జననాయగన్' పోస్ట్-క్లైమాక్స్ గురించి ఒక నమ్మలేని నిజం బయటపెట్టాడు. ఈ సినిమాలో దళపతి విజయ్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక సీన్ ఉందట.

అదేంటంటే.. తమిళ చిత్ర పరిశ్రమలోని ముగ్గురు టాప్ డైరెక్టర్లు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj), అట్లీ (Atlee), నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar)లు తెరపై కనిపించి, విజయ్ పాత్రను వరుస ప్రశ్నలు అడిగే ఒక ఎమోషనల్ అండ్ పవర్‌ఫుల్ సీన్ ఉందని వినోత్ చెప్పాడు.

డైరెక్టర్ చైర్‌లో దళపతి!

అంతకంటే షాకింగ్ విషయం ఏమిటంటే.. ఈ వినూత్నమైన సీన్‌ను దర్శకుడు హెచ్.వినోత్ డైరెక్ట్ చేయలేదు! స్వయంగా దళపతి విజయ్ మెగాఫోన్ పట్టి.. లోకేష్, అట్లీ, నెల్సన్ ఉన్న ఆ సన్నివేశాన్ని డైరెక్ట్ చేశారు. తనతో బ్లాక్‌బస్టర్ హిట్లు తీసిన ఈ ముగ్గురు దర్శకులు తన చివరి సినిమాలో ఇలాంటి సర్ ప్రైజ్ క్యామియోతో భాగమవ్వడం, దాన్ని విజయ్ స్వయంగా పిక్చరైజ్ చేయడం ఒక చారిత్రాత్మక ఘట్టమని వినోత్ పేర్కొన్నాడు.

విజయ్ పక్కా ప్లాన్

ఒక నటుడు రాజకీయాల్లోకి వెళ్తూ తన చివరి సినిమా తీస్తున్నప్పుడు అభిమానులకు ఎలాంటి వీడ్కోలు ఇవ్వాలో విజయ్ పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. విజయ్ మాస్ ఇమేజ్‌ను ప్రపంచానికి సరికొత్తగా చూపించిన లోకేష్ (మాస్టర్, లియో), అట్లీ (తెరి, మెర్సల్, బిగిల్), నెల్సన్ (బీస్ట్) వంటి దర్శకులను ఒకే ఫ్రేమ్‌లో నిలబెట్టి, వారి ప్రశ్నలకు సమాధానమిచ్చేలా ఈ సీన్ డిజైన్ చేయడం కేవలం సినిమాటిక్ మోమెంట్ మాత్రమే కాదు.. విజయ్ రియల్ లైఫ్ పొలిటికల్ స్టేట్‌మెంట్‌ను సూచిస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More