...
...
Next Story

విజయ్‌కి గట్స్ ఉన్నాయన్న డైరెక్టర్.. త్రిషతో అక్రమ సంబంధాన్ని సమర్థిస్తున్నావా అంటూ ఫ్యాన్స్ క్లాస్.. ఇదీ అతని వివరణ

విజయ్, త్రిష కలిసి ఓ పెళ్లి వేడుకకు వెళ్లడం పెద్ద సెన్సేషన్ అయిన విషయం తెలుసు కదా. ఇది చూసి అతనికి గట్స్ ఉన్నాయంటూ డైరెక్టర్ మోహన్ జి క్షత్రియన్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అతనిపై నెటిజన్లు మండిపడటంతో వివరణ ఇచ్చుకున్నాడు.

Published on: Mar 6, 2026, 16:26:39 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

తమిళ సూపర్ స్టార్, టీవీకే (TVK) అధినేత విజయ్ తన భార్య సంగీత స్వర్ణలింగంతో విడాకులు తీసుకోబోతున్నారనే వార్త కోలీవుడ్‌లో పెను తుఫాను సృష్టించింది. ఈ వివాదం కొనసాగుతుండగానే గురువారం (మార్చి 5) రాత్రి చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకకు విజయ్, నటి త్రిషతో కలిసి జంటగా హాజరుకావడం మరింత చర్చకు దారితీసింది. అయితే ఈ విషయంలో విజయ్ 'ధైర్యాన్ని' మెచ్చుకుంటూ దర్శకుడు మోహన్ జి క్షత్రియన్ చేసిన ట్వీట్ ఇప్పుడు అతని మెడకు చుట్టుకుంది.

అసలేం జరిగింది?

విజయ్‌కి గట్స్ ఉన్నాయన్న డైరెక్టర్.. త్రిషతో అక్రమ సంబంధాన్ని సమర్థిస్తున్నావా అంటూ ఫ్యాన్స్ క్లాస్.. ఇదీ అతని వివరణ
విజయ్‌కి గట్స్ ఉన్నాయన్న డైరెక్టర్.. త్రిషతో అక్రమ సంబంధాన్ని సమర్థిస్తున్నావా అంటూ ఫ్యాన్స్ క్లాస్.. ఇదీ అతని వివరణ

ఏజీఎస్ ప్రొడక్షన్ అధినేత కల్పతి సురేష్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు విజయ్, త్రిష కలిసి వచ్చారు. వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, దర్శకుడు మోహన్ స్పందిస్తూ.. "విజయ్ సార్ తనదైన శైలిలో అందరికీ సమాధానం ఇచ్చి పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టారు. ఆయనకు చాలా ధైర్యం (Guts) ఉంది" అని ట్వీట్ చేశాడు.

నెటిజన్ల ఆగ్రహం.. "ఇదా మీ సంస్కృతి?"

మోహన్ ట్వీట్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "ఒక పక్క భార్య విడాకులు కోరుతుంటే, మరొక నటితో బహిరంగంగా తిరగడం ధైర్యం ఎలా అవుతుంది?" అని ప్రశ్నించారు. "మీరు సంస్కృతి, ధర్మం గురించి సినిమాలు తీస్తారని గౌరవించేవాళ్లం.. కానీ ఇలాంటి అక్రమ సంబంధాలను సమర్థించడం దారుణం" అంటూ ఒక అభిమాని మండిపడ్డారు.

మోహన్ వివరణ: "నేను అక్రమ సంబంధాలను సమర్థించట్లేదు"

విమర్శలు పెరగడంతో శుక్రవారం మోహన్ క్లారిటీ ఇచ్చాడు. "మీడియాలో ఒక వర్గం విజయ్‌కు వ్యతిరేక కథనాలను ప్రచారం చేస్తోంది. ఆ ప్రచారాన్ని ఆయన తనదైన శైలిలో తిప్పికొట్టారు. ఆ ధైర్యాన్ని మాత్రమే నేను మెచ్చుకున్నాను. అంతే తప్ప నేను అక్రమ సంబంధాలను సమర్థించడం లేదు" అని పేర్కొన్నారు.

విజయ్ భార్య సంగీత గత వారమే చెన్నై కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. విజయ్ ఒక నటితో ఎఫైర్ పెట్టుకున్నారని, అది తనను మానసిక వేదనకు గురిచేసిందని ఆమె ఆరోపించారు.

వచ్చే తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు విజయ్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి వ్యక్తిగత వివాదాలు ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' సెన్సార్ బోర్డు (CBFC) సర్టిఫికేషన్ ఆలస్యం కావడంతో విడుదల వాయిదా పడింది. దీనికితోడు వరుస వివాదాలు, త్రిషతో ఎఫైర్ విమర్శల మధ్య విజయ్ తమిళనాడు ఎన్నికల్లో ఎలా పోటీ పడబోతున్నడన్నది ఆసక్తికరంగా మారింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe