మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవేటెడ్ తమిళ్ వెబ్ సిరీస్ ‘కాట్టాన్’ (Kaattaan) విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు ఎం. మణికందన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా మార్చి 27 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
మణికందన్ - విజయ్ సేతుపతి హ్యాట్రిక్

వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే విజయ్ సేతుపతి ఇప్పుడు డిజిటల్ తెరపై తన విశ్వరూపం చూపించేందుకు సిద్ధమయ్యాడు. అతడు నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘కాట్టాన్’ (ముత్తు అలియాస్ కాట్టాన్) విడుదల తేదీ ఖరారైంది. జియోహాట్‌స్టార్ గతేడాది ప్రకటించిన భారీ కంటెంట్ జాబితాలో భాగంగా రూపొందిన ఈ వెబ్ సిరీస్, మార్చి 27 నుంచి ప్రేక్షకులను పలకరించనుంది.
‘కాకా ముట్టై’, ‘కడైసి వివసాయి’ వంటి జాతీయ అవార్డు గెలుచుకున్న సినిమాలను అందించిన దర్శకుడు ఎం. మణికందన్ ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించాడు. విజయ్ సేతుపతి - మణికందన్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘ఆండవన్ కట్టలై’, ‘కడైసి వివసాయి’ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఇప్పుడు వీరిద్దరి కలయికలో వస్తున్న మూడో ప్రాజెక్ట్ కావడంతో ‘కాట్టాన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విశేషమేమిటంటే రియలిస్టిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మణికందన్, మొదటిసారిగా ఈ సిరీస్‌తో పూర్తి స్థాయి 'యాక్షన్' జోనర్‌ను టచ్ చేస్తున్నాడు.
రూరల్ యాక్షన్ డ్రామా
‘కాట్టాన్’ ఒక రా అండ్ రస్టిక్ రూరల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది. ఈ వెబ్ సిరీస్‌లో విజయ్ సేతుపతి మునుపెన్నడూ చూడని అత్యంత ఉగ్ర రూపంలో కనిపిస్తారని సమాచారం. దీనికి ‘A’ సర్టిఫికేట్ లభించడం ఈ వెబ్ సిరీస్‌లోని హింస, తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో సూచిస్తోంది. ఈ కథ విన్నప్పుడు తాను ఒక కొత్త అనుభూతికి లోనయ్యానని, మనసుకి చాలా హాయిగా అనిపించిందని విజయ్ సేతుపతి గతంలో పేర్కొన్నాడు.
తెలుగులోనూ రిలీజ్
తెలుగు ప్రేక్షకులకు కూడా మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ కాట్టాన్ వెబ్ సిరీస్ ను తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. త్వరలోనే దీనికి సంబంధించిన టీజర్ విడుదల కానుంది. అందులో ఇతర నటీనటులు, కథాంశంపై మరింత స్పష్టత రానుంది. జియోహాట్‌స్టార్ ఓటీటీతోపాటు ఓటీటీప్లే ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉన్నా కూడా ఈ సిరీస్ చూడొచ్చు.
{{/usCountry}}తెలుగు ప్రేక్షకులకు కూడా మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ కాట్టాన్ వెబ్ సిరీస్ ను తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. త్వరలోనే దీనికి సంబంధించిన టీజర్ విడుదల కానుంది. అందులో ఇతర నటీనటులు, కథాంశంపై మరింత స్పష్టత రానుంది. జియోహాట్‌స్టార్ ఓటీటీతోపాటు ఓటీటీప్లే ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉన్నా కూడా ఈ సిరీస్ చూడొచ్చు.
{{/usCountry}}