Vijay Sethupathi: టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్, 'పోకిరి' వంటి ఇండస్ట్రీ హిట్లను అందించిన పూరీ జగన్నాథ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 26 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో సంచలనాలు సృష్టించిన పూరీకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి.. పూరీపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఒక లెగసీని నిర్మించారు: పూరీపై విజయ్ సేతుపతి ప్రశంసలు

సినిమా రంగంలో 26 ఏళ్లు పూర్తి చేసుకోవడం అనేది కేవలం ఒక మైలురాయి మాత్రమే కాదని.. అది ధైర్యం, నమ్మకం, నిర్భయమైన గొంతుకతో నిర్మించుకున్న ఒక 'లెగసీ' అని విజయ్ సేతుపతి పేర్కొన్నారు.
"ప్రియమైన పూరీ సార్.. మీతో కలిసి వర్క్ చేయడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. నటీనటులను నమ్మి, వారి కంఫర్ట్ జోన్ నుండి బయటకు తీసుకువచ్చి నటనను రాబట్టుకునే దర్శకులు చాలా అరుదుగా ఉంటారు.. మీరు ఆ పనిని చాలా సునాయాసంగా చేస్తారు" అంటూ పూరీ వర్కింగ్ స్టైల్‌ను ఆకాశానికెత్తారు.
'స్లమ్ డాగ్' - 33 టెంపుల్ రోడ్: స్పెషల్ మూవీ కాబోతోంది
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి #SLUMDOG – 33 Temple Road అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి సేతుపతి స్పందిస్తూ.. "ఈ చిత్రం మా అందరికీ ఎంతో ప్రత్యేకం. ఇది ఖచ్చితంగా ఒక గుర్తుండిపోయే సినిమా అవుతుందని నేను నమ్ముతున్నాను" అని ధీమా వ్యక్తం చేశారు. పూరీ మార్కు మాస్ ఎలిమెంట్స్‌కు సేతుపతి మార్కు నటన తోడైతే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
'బద్రి' నుండి నేటి వరకు.. పూరీ ప్రస్థానం
2000వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ 'బద్రి' మూవీతో దర్శకుడిగా పరిచయమైన పూరీ జగన్నాథ్.. మొదటి సినిమాతోనే ట్రెండ్ సెట్ చేశారు. ఆ తర్వాత మహేష్ బాబుతో 'పోకిరి', రవితేజతో 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం', 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' వంటి చిత్రాలతో టాలీవుడ్ కమర్షియల్ సినిమా రూపురేఖలను మార్చేశారు. ఈ 26 ఏళ్ల కాలంలో హీరోల బాడీ లాంగ్వేజ్‌ను, డైలాగ్ డెలివరీని మార్చడంలో పూరీ ఒక ప్రత్యేక ముద్ర వేశారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
{{/usCountry}}2000వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ 'బద్రి' మూవీతో దర్శకుడిగా పరిచయమైన పూరీ జగన్నాథ్.. మొదటి సినిమాతోనే ట్రెండ్ సెట్ చేశారు. ఆ తర్వాత మహేష్ బాబుతో 'పోకిరి', రవితేజతో 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం', 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' వంటి చిత్రాలతో టాలీవుడ్ కమర్షియల్ సినిమా రూపురేఖలను మార్చేశారు. ఈ 26 ఏళ్ల కాలంలో హీరోల బాడీ లాంగ్వేజ్‌ను, డైలాగ్ డెలివరీని మార్చడంలో పూరీ ఒక ప్రత్యేక ముద్ర వేశారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
{{/usCountry}}1. పూరీ జగన్నాథ్ - విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా పేరు ఏమిటి?
వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ పేరు ‘స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్’.
2. పూరీ జగన్నాథ్ సినీ రంగంలో ఎన్ని ఏళ్లు పూర్తి చేసుకున్నారు?
పూరీ జగన్నాథ్ దర్శకుడిగా వెండితెరకు పరిచయమై 2026 నాటికి 26 ఏళ్లు పూర్తయ్యాయి.
3. విజయ్ సేతుపతి తన పోస్ట్‌లో పూరీ గురించి ఏమని చెప్పారు?
పూరీ జగన్నాథ్ ధైర్యం ఉన్న దర్శకుడని, నటీనటుల్లోని ప్రతిభను వెలికి తీయడంలో ఆయన సిద్ధహస్తుడని విజయ్ సేతుపతి కొనియాడారు.
4. పూరీ జగన్నాథ్ మొదటి సినిమా ఏది?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'బద్రి' సినిమాతో పూరీ జగన్నాథ్ దర్శకుడిగా పరిచయమయ్యారు.