Vijay Thalapathy Jana Nayagan: విజయ్ జన నాయగన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చే వారమే వస్తోందా?

Vijay Thalapathy Jana Nayagan: దళపతి విజయ్ చివరి మూవీ 'జననాయగన్' ఎట్టకేలకు మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. సెన్సార్ సమస్యలు, ఆన్‌లైన్ లీక్ వంటి వివాదాల తర్వాత ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

Published on: Apr 28, 2026, 15:01:05 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vijay Thalapathy Jana Nayagan: కోలీవుడ్ సూపర్ స్టార్, దళపతి విజయ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చినట్లు కనిపిస్తోంది. అనేక వాయిదాలు, అనిశ్చితి తర్వాత ఆయన తాజా మూవీ 'జన నాయగన్' విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.

Vijay Thalapathy Jana Nayagan: విజయ్ జన నాయగన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చే వారమే వస్తోందా?
Vijay Thalapathy Jana Nayagan: విజయ్ జన నాయగన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చే వారమే వస్తోందా?

తాజాగా వస్తున్న రిపోర్టుల ప్రకారం.. ఈ భారీ బడ్జెట్ పొలిటికల్ యాక్షన్ డ్రామాను మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. ఫలితాలు వచ్చిన నాలుగు రోజులకే అంటే మే 8న జన నాయగన్ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించడం గమనార్హం. రాష్ట్రంలో నెలకొనే రాజకీయ వాతావరణం ఈ సినిమా ఓపెనింగ్స్ కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ మాజీ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని సమాచారం. పూజా హెగ్డే కథానాయికగా నటించగా, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు.

సెన్సార్ చిక్కులు.. అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులు

కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా వాస్తవానికి 2026 సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది. అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) వద్ద సెన్సార్ ప్రక్రియలో తలెత్తిన కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల విడుదల వాయిదా పడింది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సినిమా వాయిదా పడకముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం సెన్సార్ సమస్యలు పరిష్కారం కావడంతో విడుదలకు మార్గం సుగమమైంది.

లీకేజీ భయం.. అయినా తగ్గని క్రేజ్

విడుదలకు ముందే ఈ సినిమా హెచ్‌డీ (HD) ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం చిత్ర యూనిట్‌ను కలవరపెట్టింది. సాధారణంగా ఇలాంటి లీకేజీలు బాక్సాఫీస్ వసూళ్లపై ప్రభావం చూపుతాయి. కానీ విజయ్ కి ఉన్న మాస్ ఫాలోయింగ్, ఇది ఆయన కెరీర్ లోనే ఆఖరి సినిమా కావడంతో, థియేటర్ల వద్ద కలెక్షన్ల సునామీ ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక అంతకుముందే ఎన్నికల ఫలితాలు కూడా రానుండటంతో అప్పటికే విజయ్ పార్టీ పరిస్థితి ఏంటన్నది కూడా తెలియనుంది. ఒకవేళ టీవీకే మంచి ఓట్లు, సీట్లు సాధిస్తే మాత్రం ఆ ప్రభావం ఈ మూవీ ఓపెనింగ్స్ పైనా ఉండనున్నాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1. 'జన నాయగన్' సినిమా విడుదల తేదీ ఎప్పుడు?

ప్రస్తుత సమాచారం ప్రకారం మే 8న ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. నిర్మాతలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

2. జన నాయగన్ సినిమా ఎందుకు వాయిదా పడింది?

సెన్సార్ బోర్డు (CBFC) నుండి సర్టిఫికేట్ పొందడంలో తలెత్తిన జాప్యం, కొన్ని సాంకేతిక కారణాల వల్ల సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకుంది.

3. 'జన నాయగన్' చిత్రంలో విజయ్ పాత్ర ఏమిటి?

దర్శకుడు హెచ్. వినోద్ ఈ చిత్రంలో విజయ్ ను ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ గా, పవర్‌ఫుల్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో చూపించబోతున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More