తమిళ సూపర్ స్టార్, రాజకీయ నాయకుడు దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. గత కొంతకాలంగా విజయ్, నటి త్రిష మధ్య ఏదో ఉందనే ప్రచారం జరుగుతుండగా.. తాజాగా వీరిద్దరూ కలిసి ఒక వివాహ వేడుకకు హాజరుకావడం ఆ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఏజీఎస్ ప్రొడక్షన్ అధినేత కల్పతి సురేష్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు విజయ్, త్రిష జంటగా రావడం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.
బాడీగార్డ్ పోస్ట్.. డిలీట్.. ఆపై నెటిజన్ల చర్చ

వీరిద్దరూ బహిరంగంగా కనిపించడానికి కొన్ని గంటల ముందే విజయ్ బాడీగార్డ్ అరుణ్ సురేష్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో "అన్ని పుకార్లకు అతీతంగా ఎదిగే సమయం వచ్చింది" అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. అయితే నెటిజన్లు దీని స్క్రీన్ షాట్లు తీయడం మొదలుపెట్టగానే అతడు ఆ పోస్ట్‌ను తొలగించాడు.
కానీ విజయ్ 'హార్ట్' సింబల్ చూపిస్తున్న మరో ఫోటోను మాత్రం ఉంచాడు. విశేషం ఏమిటంటే, ఆ ఫోటోకు 2004లో విజయ్-త్రిష కాంబినేషన్‌లో వచ్చిన 'గిల్లి' సినిమాలోని 'కొక్కరకో' సాంగ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో జత చేశాడు. దీంతో వీరిద్దరి రిలేషన్‌షిప్‌ను బాడీగార్డే పరోక్షంగా కన్ఫర్మ్ చేశారని ఎక్స్, రెడిట్ వేదికల్లో ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
విడాకుల పిటిషన్‌లో సంగీత సంచలన ఆరోపణలు
విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం చెన్నై కోర్టులో దాఖలు చేసిన విడాకుల పిటిషన్ గత వారమే లీక్ అయ్యింది. అందులో ఆమె విజయ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. 1954 స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో, తమ వివాహ బంధం కోలుకోలేని విధంగా దెబ్బతిందని పేర్కొన్నారు. విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, అది తనను మానసిక వేదనకు గురిచేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
2021 నుంచి విజయ్ కుటుంబానికి మానసికంగా దూరంగా ఉంటున్నారని, మాటలతో వేధించడమే కాకుండా, ఒకే ఇంట్లో ఉంటూనే తనను ఒంటరిని చేశారని సంగీత ఆరోపించారు. 2024 ఆగస్టు నుంచి 2025 ఫిబ్రవరి వరకు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతోనే తాను కోర్టును ఆశ్రయించినట్లు ఆమె తెలిపారు. విజయ్ ప్రవర్తన వల్ల తన పిల్లలు జేసన్ సంజయ్, దివ్య సాషాలు కూడా ఇబ్బంది పడుతున్నారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.
25 ఏళ్ల బంధానికి బీటలు
{{/usCountry}}2021 నుంచి విజయ్ కుటుంబానికి మానసికంగా దూరంగా ఉంటున్నారని, మాటలతో వేధించడమే కాకుండా, ఒకే ఇంట్లో ఉంటూనే తనను ఒంటరిని చేశారని సంగీత ఆరోపించారు. 2024 ఆగస్టు నుంచి 2025 ఫిబ్రవరి వరకు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతోనే తాను కోర్టును ఆశ్రయించినట్లు ఆమె తెలిపారు. విజయ్ ప్రవర్తన వల్ల తన పిల్లలు జేసన్ సంజయ్, దివ్య సాషాలు కూడా ఇబ్బంది పడుతున్నారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.
25 ఏళ్ల బంధానికి బీటలు
{{/usCountry}}విజయ్, సంగీతలకు 1998లో బ్రిటన్‌లో వివాహం జరగ్గా, 1999లో చెన్నైలో అభిమానుల సమక్షంలో ఘనంగా వేడుక నిర్వహించారు. పాతికేళ్ల వీరి వైవాహిక బంధం ఇప్పుడు ముగింపు దశకు చేరుకోవడం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. వీరి కుమారుడు జేసన్ సంజయ్ ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా 'సిగ్మా' అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.