Vinayaka Chavithi Tv Shows: టీవీ ఆడియ‌న్స్‌కు పండ‌గే-వినాయ‌క చ‌వితి స్పెష‌ల్ షోలు-ఈటీవీ, స్టార్ మాలో ఎప్పుడంటే?

Vinayaka Chavithi Tv Shows: చిన్నాపెద్దా అందరూ సందడిగా జరుపుకొనే వినాయక చవితి వచ్చేస్తోంది. రేపే గణేష్ చతుర్థి. ఈ సందర్భంగా టీవీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఛానెల్స్ రెడీ అయిపోయాయి. మరి పండగ రోజు ఈటీవీ, స్టార్ మాలోని ఈవెంట్ల వివరాలపై ఓ లుక్కేయండి.

Published on: Sep 13, 2026, 20:20:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vinayaka Chavithi Tv Shows: పండగ వచ్చిందంటే టీవీ ఆడియన్స్ కు ఎంటర్ టైన్మెంట్ కిక్కే కిక్కు. ఇక వినాయక చవితి పండగ అంటే ఎంటర్ టైన్మెంట్ వేరే లెవల్ లో ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో టీవీ ఆడియన్స్ ను అలరించేందుకు ఛానెల్స్ రెడీ అయ్యాయి.

టీవీ ఆడియ‌న్స్‌కు పండ‌గే-వినాయ‌క చ‌వితి స్పెష‌ల్ షోలు-ఈటీవీ, స్టార్ మాలో ఎప్పుడంటే?
టీవీ ఆడియ‌న్స్‌కు పండ‌గే-వినాయ‌క చ‌వితి స్పెష‌ల్ షోలు-ఈటీవీ, స్టార్ మాలో ఎప్పుడంటే?

ఈటీవీ షో ఇలా

టీవీ ఈవెంట్స్ లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన ఛానెల్ ఈటీవీ. ఈ వినాయక చవితికి కూడా అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా గ్రాండ్ షోను ప్లాన్ చేసింది. ‘గల్లీ క గణేష్’ పేరుతో స్పెషల్ ఈవెంట్ ను టెలికాస్ట్ చేయనుంది. ఉదయం 9 గంటలకే ఈ షో స్టార్ట్ కానుంది. మార్నింగ్ టైమ్ లోనే ఎంటర్ టైన్మెంట్ పండగను షురూ చేయనుంది.

ఎపిక్ జోడీ

నందు హోస్ట్ గా ఈ గల్లీ క గణేష్ షో సాగనుంది. హైపర్ ఆది, రోహిత్ సహా జబర్దస్త్ బ్యాచ్ పంచ్ లతో ఈ షో సందడిగా సాగనుంది. ఎపిక్ మూవీతో థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీగా వచ్చి ఆడియన్స్ ను అలరించనున్నారు. ఇక డ్యాన్స్ లు, స్కిట్లతో పండగ సందడి మరింత పెరగనుంది.

గణపతి బప్పా మోరియా

ఇక పాపులర్ టీవీ ఛానెల్ స్టార్ మా ఏమో ‘గణపతి బప్పా మోరియా’ అంటూ టీవీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయనుంది. ఈ వినాయక చవితి స్పెషల్ షో మధ్యాహ్నం 12 గంటలకు టెలికాస్ట్ కానుంది. ఇందులో స్టార్ మా పాపులర్ సీరియల్ నటీనటులు సందడి చేయనున్నారు. ఇక స్టార్ మా ఆస్థాన యాంకర్ శ్రీముఖి మరోసారి తన ఎనర్జీతో మెస్మరైజ్ చేయనుంది.

ఇక కమెడియన్లు యాదమ్మ రాజు, అవినాష్, ఇమ్మాన్యుయేల్, ఎక్స్ ప్రెస్ హరి కామెడీ కూడా ఆడియన్స్ ను నవ్వించనుంది. ఇందులో సీరియల్ హీరోలు, హీరోయిన్స్, విలన్స్, కమెడియన్స్ మధ్య పోరు జరగనుంది.

ఫుల్ ఎంటర్ టైన్మెంట్

పండగ సందడిని డబుల్ చేసేందుకు టీవీ ఛానెల్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ లు, ప్రమోషనల్ కంటెంట్ తో రెడీ అయ్యాయి. ముఖ్యంగా టాప్ ఛానెల్స్ ఈటీవీ విన్, స్టార్ మా తమ ఆడియన్స్ ను ప్రతి పండగకు ఎంటర్ టైన్ చేస్తుంటూనే ఉంటాయి. ఇప్పుడు వినాయక చవితి 2026 సందర్భంగా కూడా కామెడీ, ఎమోషన్స్ తో ప్రజలను ఆకట్టుకునేందుకు వచ్చేస్తున్నాయి.

మరి ఇంకెందుకు లేటు.. పండగ రోజు ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా ఇంట్లో కూర్చుని టీవీ ప్రోగ్రామ్స్ ను ఎంజాయ్ చేసేయండి. ఫ్యామిలీతో కలిసి పండగను ఆస్వాదించేయండి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More