...
...
Next Story

Virosh Wedding: ముగిసిన విరోష్ వెడ్డింగ్.. మీడియా, పిల్లలకు స్వీట్లు పంచిన విజయ్, రష్మిక టీమ్.. వీడియో వైరల్

Virosh Wedding: రష్మిక, విజయ్ దేవరకొండల వివాహం ఇవాళ ఉదయ్‌పూర్‌లోని ఫైవ్-స్టార్ రిసార్ట్‌లో ఘనంగా జరిగింది. ఐటీసీ మెమెంటోస్ లో ఈ పెళ్లిని గ్రాండ్ గా నిర్వహించారు. వెడ్డింగ్ ముగిసిన తర్వాత రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ టీమ్ కు సంబంధించిన వ్యక్తులు బయటకు వచ్చి స్వీట్లు పంచారు.

Published on: Feb 26, 2026, 13:33:45 IST
Advertisement

ఇన్ని రోజులు లవ్ బర్డ్స్ గా ఉన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇప్పుడు భార్యాభర్తలుగా మారారు. విరోష్ జంట గురువారం (ఫిబ్రవరి 26) ఉదయం ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహిత వేడుకలో మూడు ముళ్లు, ఏడడుగులతో వివాహ బంధాన్ని పెనవేసుకుంది. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి చేసుకుంది.

విరోష్ వెడ్డింగ్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న

అభిమానులు 'విరోష్' అని ముద్దుగా పిలుచుకునే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట పెళ్లి గురువారం ఉదయం ఉదయ్‌పూర్‌కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలోని ఐటీసీ మొమెంటోస్‌లో జరిగింది. ఉదయం 10.10 గంటలకు రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్లు వేశాడు. హిందూ సంప్రదాయం ప్రకారం విరోష్ వెడ్డింగ్ జరిగింది.

స్వీట్లు పంచి

విరోష్ వెడ్డింగ్ ను రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ టీమ్ మెంబర్స్ కన్ఫామ్ చేశారు. పెళ్లి ముగిసిన తర్వాత ఐటీటీ మెమెంటోస్ బయటకు వచ్చి అక్కడ ఉన్న మీడియా, పిల్లలకు స్వీట్లు బాక్స్ లు పంచారు. కాజు బర్ఫీ బాక్స్ లను అందించారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

రెండు రకాలుగా

విరోష్ వెడ్డింగ్ కు సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది సెలబ్రిటీలు హాజరయ్యారు. 'పెళ్లి చూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్, 'ది గర్ల్‌ఫ్రెండ్' దర్శకుడు రాహుల్ రవీంద్రన్, హీరోయిన్లు ఈషా రెబ్బా, ఆషికా రంగనాథ్, స్టైలిస్ట్ శ్రావ్య వర్మ, విజయ్‌తో 'అర్జున్ రెడ్డి', రష్మికతో 'యానిమల్' చిత్రాలు తీసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ పెళ్లి కోసం ఉదయ్‌పూర్‌ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ జంటను ఆశీర్వదిస్తూ ప్రత్యేకంగా ఓ లేఖ పంపించారు.

విజయ్, రష్మిక లవ్

2018లో రిలీజైన ‘గీత గోవిందం’ సినిమా కోసం విజయ్, రష్మిక తొలిసారి కలిసి నటించారు. 2019లో వచ్చిన 'డియర్ కామ్రేడ్' చిత్రంతో వీళ్ల మధ్య ప్రేమ బంధం బలంగా మారింది. ఎప్పటి నుంచో వీళ్ల డేటింగ్ రూమర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks