...
...
Next Story

Virosh Wedding: ఒకే రోజు రెండు సార్లు విరోష్ వెడ్డింగ్-తెలుగు, కొడవ సంప్రదాయాల్లో-ఈ కొడవ పెళ్లి ఎలా చేస్తారో తెలుసా?

Virosh Wedding: రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి గురువారమే జరగనుంది. అయితే ఒకే రోజు ఈ విరోష్ జంట రెండు సార్లు వివాహం చేసుకోనుంది. తెలుగుతో పాటు కొడవ సంప్రదాయంలోనూ వెడ్డింగ్ జరుగుతుంది. మరి ఈ కొడవ పెళ్లిని ఎలా చేస్తారో ఇక్కడ చూసేయండి.

Published on: Feb 25, 2026, 11:02:23 IST
Advertisement

ఇప్పుడు సోషల్ మీడియాలో, ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి టాపిక్ కనిపిస్తోంది. విరోష్ వెడ్డింగ్ తెగ వైరల్ గా మారింది. ఈ లవ్ బర్డ్స్ మ్యారేజీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఫిబ్రవరి 26న విరోష్ పెళ్లి జరుగుతుంది. అయితే ఒకే రోజు రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ రెండు సార్లు వెడ్డింగ్ చేసుకోనున్నారు.

విరోష్ వెడ్డింగ్

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ డ్రీమ్ వెడ్డింగ్ విరోష్ కు ముహూర్తం దగ్గరపడింది. గురువారమే వీళ్ల పెళ్లి. అయితే ఒకే రోజు విరోష్ వెడ్డింగ్ రెండు సార్లు జరగనుంది. తెలుగు సంప్రదాయంతో పాటు కొడవ కల్చర్ లోనూ ఈ పెళ్లి జరుగుతుందని తెలిసింది. విజయ్ దేవరకొండ తెలుగు వ్యక్తి కాబట్టి తెలుగు సంప్రదాయంలో ఒకసారి, రష్మిక మందన్న కర్ణాటకలోని కొడవ వర్గానికి చెందిన అమ్మాయి కాబట్టి కొడవ కల్చర్ లో ఇంకోసారి పెళ్లి జరుగుతుంది.

కొడవ పెళ్లి అంటే?

విరోష్ వెడ్డింగ్ కొడవ సంప్రదాయంలోనూ జరుగుతుందనేది హాట్ టాపిక్ గా మారింది. అసలు కొడవ పెళ్లి అంటే ఏంటీ? అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. తెలుగు పెళ్లిళ్లలో వధువు మెడలో వరుడు మూడు ముళ్లు వేస్తాడు. మనదాంట్లో మాంగళ్యధారణ అనేది అత్యంత కీలకమైన ఘట్టం. కానీ కొడవ పెళ్లిలో ఇలాంటి ఘట్టం అనేది ఉండదని తెలిసింది.

కాయిన్స్ మూట

కొడవ పెళ్లిల్లో పూజారులకు కూడా పెద్దగా ప్రాధాన్యత ఉండదు. పూర్వీకుల ఆశీర్వాదాల ఆధారంగానే ఈ వివాహం జరుగుతుంది. తెలుగు పెళ్లిలో బియ్యానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒడి బియ్యం, తలంబ్రాలు, అక్షింతలు.. ఇలా రకరకలుగా బియ్యాన్ని ఉపయోగిస్తారు. కానీ కొడవ పెళ్లిలో ఒడి బియ్యం స్థానంలో వధువు కాయిన్స్ మూట పట్టుకొస్తుంది.

ఇప్పటికే విరోష్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లు సందడిగా కొనసాగుతున్నాయి. ఉదయ్ పూర్ లోని మెమెంటోస్ ఐటీసీ హోటల్లో ఈ పెళ్లి జరుగుతుంది. ముందుగా మెహందీ ఈవెంట్ నిర్వహించారని తెలిసింది. ఈ రోజు (ఫిబ్రవరి 25) హల్దీ, సంగీత్ ఉండబోతుందని సమాచారం. రేపు జరిగే పెళ్లితో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఒక్కటి కానున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe