Vishnu Priya Instagram Controversy: విష్ణుప్రియ బాడీ కౌంట్ రచ్చ.. దారుణంగా ట్రోల్స్.. ఇంటర్నెట్ లో వీడియో వైరల్
Vishnu Priya Instagram Controversy: ప్రముఖ యాంకర్, నటి విష్ణుప్రియ భీమినేని ఇన్‌స్టాగ్రామ్ లైవ్ లో తన 'బాడీ కౌంట్'పై వ్యాఖ్యలు చేసిందంటూ ఓ వీడియో నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. ఒక సెలబ్రిటీ అంత ఓపెన్‌గా మాట్లాడటంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్, మోరల్ పోలీసింగ్ జోరందుకుంది.
Vishnu Priya Instagram Controversy: సౌత్ చిత్ర పరిశ్రమతో పాటు బుల్లితెరపై యాంకర్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకున్న భామ విష్ణుప్రియ భీమినేని (Vishnu Priya Bhimeneni). గ్లామరస్ రోల్స్, బోల్డ్ ఇంటర్వ్యూలతో నిత్యం వార్తల్లో నిలిచే ఈ నటి.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో బోల్డ్ కామెంట్లు చేసిందంటూ మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

విష్ణు ప్రియ బాడీ కౌంట్
బిగ్ బాస్ ఫేమ్ విష్ణు ప్రియ మరో వివాదంలో చిక్కుకుంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ అత్యంత సున్నితమైన ప్రశ్నపై ఆమె స్పందించిన తీరు ఇదేనంటూ ఓ వీడియో వైరల్ గా మారింది. ఇందులో తన బాడీ కౌంట్ పై విష్ణు ప్రియ సమాధానం చెప్పినట్లు ఉంది.
ఇన్‌స్టాగ్రామ్ లో బోల్డ్ ఆన్సర్
ఇటీవల విష్ణుప్రియ తన ఇన్‌స్టాగ్రామ్ సబ్ స్క్రైబర్లతో లైవ్ నిర్వహించినట్లు ఉన్న ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. లైవ్ క్యూ అండ్ ఏ సెషన్ లో ఓ నెటిజన్ ఆమెను 'మీ బాడీ కౌంట్ (Body Count) ఎంత?' అని ప్రశ్నించినట్లు కనిపించింది. బాడీ కౌంట్ అంటే ఇప్పటివరకు ఎంతమందితో శారీరక సంబంధం పెట్టుకున్నారు అని అర్థం.
సాధారణంగా ఇలాంటి ప్రశ్నలను సెలబ్రిటీలు స్కిప్ చేస్తుంటారు. కానీ, విష్ణుప్రియ ఏమాత్రం వెనకడుగు వేయకుండా, చాలా స్పష్టంగా సమాధానమిచ్చినట్లు ఈ వీడియోలో ఉంది తన 'బాడీ కౌంట్' ఐదు అని ఆమె నిర్మొహమాటంగా స్పష్టం చేసినట్లు కనిపిస్తోంది.
మోరల్ పోలీసింగ్
ఈ విష్ణు ప్రియ ఉన్నట్లు వైరల్ అవుతున్న వీడియోతో సోషల్ మీడియా రెండు వర్గాలుగా చీలిపోయింది. కొంతమంది నెటిజన్లు సంస్కృతి, సాంప్రదాయాల పేరుతో ఆమెపై 'మోరల్ పోలీసింగ్' మొదలుపెట్టారు. ఒక నటిగా ఇలాంటి విషయాలను బహిరంగంగా చెప్పడం యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
తీవ్రంగా ట్రోల్స్
హాలీవుడ్, బాలీవుడ్ సంస్కృతిలో 'బాడీ కౌంట్' లేదా డేటింగ్ లైఫ్ గురించి ఓపెన్‌గా మాట్లాడటం సాధారణ విషయమే అయినప్పటికీ, టాలీవుడ్ లాంటి ప్రాంతీయ చిత్ర పరిశ్రమల్లో మహిళా సెలబ్రిటీలు ఇలా మాట్లాడటంపై ట్రోలింగ్ జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలువురు నటీమణులు తమ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడినప్పుడు ఇలాంటి వ్యతిరేకత ఎదురైంది.
అయితే, "ఆమె శరీరం, ఆమె ఇష్టం.. తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే పూర్తి హక్కు ఆమెకు ఉంది" అంటూ కొందరు నెటిజన్లు విష్ణుప్రియకు గట్టి మద్దతు ఇస్తున్నారు.
గతంలోనూ వివాదాలు
విష్ణుప్రియ ఇలా వివాదాల్లో నిలవడం కొత్తేమీ కాదు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కూడా ఆమెపై ఒక పెద్ద వివాదం చెలరేగింది. విష్ణుప్రియ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అశ్లీలమైన, అర్ధనగ్న కంటెంట్‌ను షేర్ చేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ 'ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్' (AISF) ప్రతినిధులు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


