...
...
Next Story

Vishwanath & Sons: తెలుగు ఫ్యాన్స్‌కు షాక్.. తెలుగు డైరెక్టర్, తెలుగు ప్రొడ్యూసర్ కలిసి చేసేది కేవలం తమిళ మూవీనట!

Vishwanath & Sons: తెలుగు ప్రేక్షకులకు డైరెక్టర్ వెంకీ అట్లూరి షాకిచ్చారు. మరో తెలుగు ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మిస్తూ సూర్య, మమితా బైజు నటిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ కేవలం తమిళంలోనే చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు.

Published on: Jul 24, 2026, 11:33:24 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Vishwanath & Sons: కోలీవుడ్ వర్సటైల్ స్టార్ సూర్య (Suriya) కథానాయకుడిగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా 'విశ్వనాథ్ అండ్ సన్స్' (Vishwanath & Sons) ప్రాజెక్ట్‌పై డైరెక్టర్ వెంకీ అట్లూరి ఒక షాకింగ్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా బైలింగ్వల్ లేదా స్ట్రెయిట్ తెలుగు సినిమా కాదని, పూర్తిగా తమిళంలో మాత్రమే షూట్ చేసిన ప్రాజెక్ట్ అని ఆయన స్పష్టం చేశారు. తెలుగులో వచ్చేది కేవలం డబ్బింగ్ వర్షన్ మాత్రమేనని వెల్లడించడంతో టాలీవుడ్ ఆడియన్స్, సూర్య తెలుగు ఫ్యాన్స్ తీవ్ర ఆశ్చర్యానికి గురవుతున్నారు. గలాటా ప్లస్ కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.

ఆశలపై నీళ్లు చల్లిన వెంకీ అట్లూరి స్టేట్‌మెంట్

Vishwanath & Sons: తెలుగు ఫ్యాన్స్‌కు షాక్.. తెలుగు డైరెక్టర్, తెలుగు ప్రొడ్యూసర్ కలిసి చేసేది కేవలం తమిళ మూవీనట!
Vishwanath & Sons: తెలుగు ఫ్యాన్స్‌కు షాక్.. తెలుగు డైరెక్టర్, తెలుగు ప్రొడ్యూసర్ కలిసి చేసేది కేవలం తమిళ మూవీనట!

దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్) ఇద్దరూ తెలుగువారు కావడంతో ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్‌గా తెరకెక్కిస్తున్నారని అందరూ భావించారు. ధనుష్‌తో వెంకీ అట్లూరి చేసిన 'సార్' (తమిళంలో 'వాతి') సినిమాను రెండు భాషల్లో ఏకకాలంలో షూట్ చేసినట్లే, సూర్య సినిమాను కూడా అలాగే ప్లాన్ చేశారని ప్రచారం జరిగింది.

అయితే కథలోని నేటివిటీ, ప్రధాన నటీనటుల సౌకర్యం కోసమే ఈ చిత్రాన్ని కేవలం తమిళంలో మాత్రమే తీయాల్సి వచ్చిందని వెంకీ అట్లూరి వివరణ ఇచ్చారు. దీంతో సూర్య నుంచి నేరుగా ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమా చూడాలని ఆశపడ్డ టాలీవుడ్ ఫ్యాన్స్ నిరాశ చెందారు.

క్లాస్ కథకు తెలుగు నేటివిటీ వర్కవుట్ అవుతుందా?

సూర్య నటించిన గత చిత్రం 'వీరభద్రుడు' (తమిళంలో 'కరుప్పు') ప్యూర్ మాస్ ఎంటర్‌టైనర్ కావడం వల్ల డబ్బింగ్ వర్షన్ అయినా తెలుగు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది. కానీ 'విశ్వనాథ్ అండ్ సన్స్' కంప్లీట్ క్లాస్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రాబోతోంది.

ఈ సినిమాలో సూర్య సరసన 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు (Mamitha Baiju) కథానాయికగా నటిస్తోంది. ఆమె గ్లామర్, యాక్టింగ్ ప్రెజెన్స్ ఈ ఫ్యామిలీ డ్రామాకు స్పెషల్ అట్రాక్షన్ కానుంది.

అలాగే 'ఆకాశం నీ హద్దు రా' లాంటి మైండ్ బ్లాకింగ్ ఆల్బమ్ తర్వాత సూర్య, మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడం వల్ల పాటలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ ప్రాజెక్ట్‌ను ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.

ఆగస్టు 14న బాక్సాఫీస్ క్లాష్

'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాను ఆగస్టు 14, 2026న స్వాతంత్య్ర దినోత్సవ వీకెండ్ సందర్భంగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ అనౌన్స్ చేశారు. తమిళనాడు బాక్సాఫీస్ దగ్గర లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న 'హై' (Hi) సినిమాతో సూర్య పోటీ పడనున్నారు.

డబ్బింగ్ వర్షన్‌గానే రాబోతున్నప్పటికీ, తన పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో తెలుగు ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో సూర్య సక్సెస్ అవుతారో లేదో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks