Vrushakarma OTT: రిలీజ్‌కు ముందే రికార్డుల వేట.. వృషకర్మకు అదిరే ఓటీటీ డీల్.. నాగ చైతన్య మూవీకి ఎన్ని కోట్లంటే?

Vrushakarma OTT: ఇది మామూలు క్రేజ్ కాదు. రిలీజ్ కు ముందే నాగ చైతన్య మూవీ వృషకర్మ రికార్డుల వేట మొదలెట్టింది. ఈ మూవీ ఓటీటీ డీల్ కోసం భారీ డిమాండ్ నెలకొందని తెలిసింది. ఓ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అదిరే ఆఫర్ ఇచ్చి ఓటీటీ డీల్ క్లోజ్ చేసినట్లు సమాచారం. ఇది చై కెరీర్ లోనే హైయ్యెస్ట్ అని టాక్.

Published on: Oct 19, 2026, 09:43:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Vrushakarma OTT: అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య (Naga Chaitanya) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మైథిలాజికల్ మిస్టరీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'వృషకర్మ' (Vrushakarma) టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. ఇంకా థియేటర్లలోకి రాకముందే ఈ సినిమా నాన్-థియేట్రికల్ మార్కెట్‌లో హాట్ కేకులా అమ్ముడుపోయింది.

రిలీజ్‌కు ముందే రికార్డుల వేట.. వృషకర్మకు అదిరే ఓటీటీ డీల్.. నాగ చైతన్య మూవీకి ఎన్ని కోట్లంటే?
రిలీజ్‌కు ముందే రికార్డుల వేట.. వృషకర్మకు అదిరే ఓటీటీ డీల్.. నాగ చైతన్య మూవీకి ఎన్ని కోట్లంటే?

వృషకర్మ ఓటీటీ

తండేల్ మూవీతో తన కెరీర్ లోనే ఫస్ట్ రూ.100 కోట్ల మూవీ అందుకున్న నాగ చైతన్య జోరుమీదున్నారు. ఇప్పుడు ఆయన లీడ్ రోల్ ప్లే చేస్తున్న సినిమా ‘వృషకర్మ’. ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం భారీ డిమాండ్ నెలకొందని తెలిసింది. ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ చిత్రంపై ఉన్న నమ్మకంతో భారీ ధరకు డిజిటల్, శాటిలైట్ హక్కులను దక్కించుకుందని సమాచారం.

ఆ క్రేజీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటి?

ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం.. 'వృషకర్మ' నాన్-థియేట్రికల్ హక్కులను (డిజిటల్ స్ట్రీమింగ్ + టెలివిజన్ శాటిలైట్ రైట్స్) ప్రముఖ దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) సొంతం చేసుకుందని తెలిసింది. సినిమా గ్లింప్స్ సృష్టించిన ఇంపాక్ట్, కథలోని వైవిధ్యం చూసి మేకర్స్ అడిగిన రేటుకు జీ5 డీల్ క్లోజ్ చేసిందని ఇండస్ట్రీ టాక్.

డీల్ విలువ ఎంతో తెలుసా?

నాగ చైతన్య కెరీర్‌లోనే ఇది కళ్లు చెదిరే సరికొత్త రికార్డు డీల్ అని చెప్పాలి. ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ.50 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడైనట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కేవలం నాన్-థియేట్రికల్ బిజినెస్ ద్వారానే దాదాపు సగం నిర్మాణ వ్యయాన్ని రిలీజ్‌కు ముందే రికవరీ చేసుకోవడం విశేషం.

వృషకర్మ మూవీ స్పెషాలిటీ ఏంటి?

'విరూపాక్ష' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన దర్శకుడు కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పురాతన రహస్యాలు, లూటీ అయిన పురాతన అవశేషాలు, మిస్టరీ ఎలిమెంట్స్ చుట్టూ ఈ కథ తిరగనుంది. ఈ సినిమాలో నాగ చైతన్య ఇప్పటివరకు కనిపించని ఒక ఇంటెన్స్, స్టైలిష్ అండ్ పవర్‌ఫుల్ అవతారంలో కనిపించబోతున్నారు.

రిలీజ్ డేట్

వృషకర్మ మూవీ డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ హీరోయిన్ గా నటిస్తోంది. స్పర్ష్ శ్రీవాస్తవ్, జయరామ్, సత్య, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బీవీఎన్ ప్రసాద్, భోగవల్లి బాపినీడుతో పాటు టాప్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ వృషకర్మ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More