The Paradise OTT: వెల్కమ్ టు జడల్ జమానా..ది ప్యారడైజ్ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే..కొత్త సీన్లతో స్ట్రీమింగ్!
The Paradise OTT: వెయిటింగ్ ఈజ్ ఓవర్. ఓటీటీలోకి జడల్ జమానాకు వెల్కమ్ చెప్పాల్సిన టైమ్ వచ్చేస్తోంది. నాని హీరోగా నటించిన ది ప్యారడైజ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేేట్ ను అఫీషియల్ గా ప్రకటించేశారు. ఈ మూవీ అయిదు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. అలాగే కొత్త సీన్లు కూడా యాడ్ చేయనున్నారు.
The Paradise OTT: నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ రా అండ్ రస్టిక్ మూవీ ‘ది ప్యారడైజ్’ ఓటీటీ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. భారీ అంచనాలతో థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ స్క్రీన్లపై అలరించేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

ది ప్యారడైజ్ ఓటీటీ రిలీజ్ డేట్
ది ప్యారడైజ్ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ కు నెట్‌ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మూవీ అక్టోబర్ 22 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఇవాళ (అక్టోబర్ 18) నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలైన నాని సినిమా.. నాలుగు వారాల వ్యవధిలోనే డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అడుగుపెడుతోంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.
సినిమా కథేంటి?
ది ప్యారడైజ్ సినిమా కథ 1980ల నాటి సికింద్రాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. నగరంలోని ఒక మురికివాడకు చెందిన అణగారిన, అట్టడుగు వర్గానికి చెందిన సవారీ తెగ ప్రజల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
సమాజంలో వారికి కనీస పౌరసత్వం, హక్కులు దక్కకుండా వ్యవస్థ వివక్ష చూపిస్తుంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో వారిని కాపాడేందుకు, వ్యవస్థపై తిరుగుబాటు చేసేందుకు 'జడల్' (నాని) అనే నాయకుడు పుట్టుకొస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ది ప్యారడైజ్ మూవీ స్టోరీ.
కథలోని ట్విస్ట్‌లు
ఈ సినిమాలో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా గుండెల్ని పిండేసే ఎమోషన్, ఊహించని ట్విస్ట్‌లు ఉన్నాయి. ఆ తెగను కాపాడాల్సిన ఒక ముఖ్యమైన పాత్రే చివరికి విలన్లతో చేతులు కలిపి మోసం చేయడం సినిమాలోనే అతిపెద్ద ట్విస్ట్. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే హై-వోల్టేజ్ యాక్షన్ సీన్, క్లైమాక్స్‌లో నాని పాత్ర 'జడల్' తీసుకునే ఊహించని నిర్ణయం ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేస్తాయి.
బాక్సాఫీస్ కలెక్షన్లు
థియేటర్లలో విడుదలైన మొదటి రోజే నాని కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా ది ప్యారడైజ్ రికార్డు సృష్టించింది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.76.9 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. పూర్తి రన్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.173 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.
ఓటీటీలో ఎందుకు చూడాలి?
థియేటర్లలో ది ప్యారడైజ్ సినిమా చూసిన కొందరు ప్రేక్షకులు బలహీనమైన సెకండాఫ్, విపరీతమైన హింస వల్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఓటీటీ వెర్షన్ కోసం మేకర్స్ సరికొత్త మాస్టర్ ప్లాన్ వేశారు.
థియేటర్లలో కట్ చేసిన కొన్ని ముఖ్యమైన ఎమోషనల్ సీన్లను ఓటీటీ వెర్షన్లో యాడ్ చేయడంతో పాటు, విమర్శలకు గురైన కొన్ని అతి హింసాత్మక సన్నివేశాలను ట్రిమ్ చేసి కొత్త ఎడిటింగ్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేస్తున్నారు.
అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM), నాని ఊరమాస్ నటన, థియేటర్లలో మిస్ అయిన సరికొత్త సీన్ల కోసం ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో తప్పకుండా చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


