The Paradise OTT: నాని ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న ది ప్యార‌డైజ్‌.. ఆ రోజు నుంచే జ‌డ‌ల్ జ‌మానా!

The Paradise OTT: నాని ఫ్యాన్స్, ఓటీటీ లవర్స్ గెట్ రెడీ. బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన నాని లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’ ఓటీటీలోకి రాబోతుంది. ఇక డిజిటల్ స్ట్రీమింగ్ లో జడల్ జమానా షురూ కానుంది. ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి. 

Published on: Oct 17, 2026, 17:42:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

The Paradise OTT: నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’ (The Paradise) ఓటీటీలోకి రాబోతుంది. సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. థియేటర్లలో ప్రేక్షకులను ఊరమాస్ యాక్షన్‌తో అలరించిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేయడానికి సిద్ధమైంది.

నాని ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న ది ప్యార‌డైజ్‌.. ఆ రోజు నుంచే జ‌డ‌ల్ జ‌మానా! (x/TheParadiseOffl)
నాని ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న ది ప్యార‌డైజ్‌.. ఆ రోజు నుంచే జ‌డ‌ల్ జ‌మానా! (x/TheParadiseOffl)

ది ప్యారడైజ్ ఓటీటీ

ది ప్యారడైజ్ సినిమా అక్టోబర్ చివరి వారంలో డిజిటల్ స్క్రీన్‌పైకి రానుంది. అందుతున్న తాజా సమాచారం ప్రకారం, అక్టోబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ఈ చిత్రం ఐదు భాషల్లో (తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం) స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలైన నెల రోజుల లోపే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుండటం విశేషం. ఓటీటీ వెర్షన్ కోసం థియేటర్లలో కట్ చేసిన కొన్ని కొత్త సీన్లను, ఒక ప్రత్యేకమైన సాంగ్‌ను కూడా యాడ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

సినిమా స్టోరీ ఏంటంటే?

ఈ ది ప్యారడైజ్ సినిమా కథ 1980ల నాటి సికింద్రాబాద్ స్లమ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. సమాజంలో వెనుకబడిన, అణచివేతకు గురైన ‘సవారీ’ తెగకు చెందిన ప్రజలు తమ ప్రాథమిక హక్కుల కోసం, పౌరసత్వం కోసం చేసే పోరాటమే ఈ సినిమా అసలు కథ. ఆ ప్రాంతాన్ని శాసించే క్రూరమైన భూస్వామి షికంజా మాలిక్ (మోహన్ బాబు), అతని కొడుకు విక్రమ్ మాలిక్ (రాఘవ్ జుయల్) అక్రమాలను ఎదిరించడానికి ఆ తెగ నుంచి 'జడల్' (నాని) అనే ఒక తిరుగుబాటు నాయకుడు ఎలా పుట్టుకొచ్చాడు? ఎలాంటి విప్లవం సృష్టించాడు? అనేది ది ప్యారడైజ్ మూవీలో చూడాల్సిందే.

సినిమాలోని ట్విస్ట్‌లు

శ్రీకాంత్ ఓదెల మార్క్ మేకింగ్‌తో సాగే ఈ సినిమాలో ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో నాని క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసే సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే ఒక కీలకమైన ట్విస్ట్ కథను మలుపు తిప్పుతాయి. విలన్ల కుట్రల మధ్య నాని తన తెగ ప్రజలను ఎలా కాపాడుకున్నాడనే కోణంలో వచ్చే మైండ్ గేమ్స్, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్‌లో రివీల్ అయ్యే ఎమోషనల్ ఎలిమెంట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

బాక్సాఫీస్ కలెక్షన్లు

టాక్‌తో సంబంధం లేకుండా ది ప్యారడైజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.74.90 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. కేవలం 4 రోజుల్లోనే రూ. 150 కోట్ల మార్క్‌ను దాటేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా తన థియేట్రికల్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా రూ. 170 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ఘన విజయం సాధించింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More