తెలుగు తెరపై మలయాళ కొత్త అందం-ఛాంపియన్ బ్యూటీ అనస్వర గురించి తెలుసా? 17 ఏళ్లకే తల్లి, కూతురిగా డ్యుయల్ రోల్
సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ లేటెస్ట్ మూవీ ఛాంపియన్. ఈ స్పోర్ట్స్ డ్రామా ఇవాళ థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీతో తెలుగులో అడుగుపెట్టిన మలయాళ భామ అనస్వర రాజన్ ఎవరు? అనేది హాట్ టాపిక్ గా మారింది. 17 ఏళ్లకే ఆమె తల్లి, కూతురిగా డ్యుయల్ రోల్ చేసింది.
తెలుగు తెరపై మరో మలయాళీ అందం మెరుస్తోంది. ఇవాళ థియేటర్లలో రిలీజైన ఛాంపియన్ సినిమాతో మరో కేరళ కుట్టీ టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆమెనే హీరోయిన్ అనస్వర రాజన్. సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన ఛాంపియన్ మూవీతో తన బ్యూటీ, యాక్టింగ్ తో అదరగొట్టింది అనస్వర. దీంతో ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకోవాలని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

మలయాళీ అందం అనస్వర
ఛాంపియన్ సినిమాలో హీరోయిన్ అనస్వర రాజన్ ఓ మలయాళ భామ. ఆమె 2002లో కేరళలోని కరివెల్లూర్ లో పుట్టింది. సినిమాల్లో అడుగుపెట్టి క్రమంలో మలయాళంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 15 ఏళ్లకే డెబ్యూ చేసింది అనస్వర. ‘ఉదాహరణం సుజాత’ సినిమాలో మంజు వారియర్ కూతురిగా నటించింది ఈ కేరళ భామ.
డ్యుయల్ రోల్
తన్నీర్ మతన్ దినంగల్ సినిమాతో అనస్వరకు మరింత గుర్తింపు వచ్చింది. అయితే స్టార్ హీరోయిన్లు కూడా డ్యుయల్ రోల్ చేయాలంటే చాలా కష్టపడతారు. అలాంటిది 17 ఏళ్ల వయసులోనే అనస్వర ద్విపాత్రాభియనం చేసింది. అది కూడా తల్లి, కూతురిగా కావడం విశేషం. 2019లో వచ్చి మలయాళ సినిమా ‘అధ్యరాత్రి’లో తల్లి, కూతురిగా అనస్వర డ్యుయల్ రోల్ చేసింది. 17 ఏళ్ల వయసులోనూ యాక్టింగ్ లో అదరగొట్టింది.
తమిళం, హిందీలోనూ
క్రమంగా మలయాళ స్టార్ హీరోయిన్ గా అతి తక్కువ కాలంలోనే ఎదిగిపోయింది అనస్వర రాజన్. తమిళం, హిందీలోనూ డెబ్యూ చేసింది. 2022లో రాంగి సినిమాతో తమిళంలో అడుగుపెట్టింది. 2023లో థగ్స్ అనే తమిళ మూవీ చేసింది. అదే ఏడాది యారియాన్ 2తో హిందీలోకి వెళ్లింది. కానీ ఈ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో మలయాళం చిత్రాలపైనే ఫోకస్ పెట్టింది అనస్వర.
ఈ సినిమాలతో
ఓ వైపు అందం, మరోవైపు అభినయంతో అనస్వర దూసుకెళ్తోంది. నెరు, రేఖాచిత్రం, గురువాయూర్ అంలనడయిల్ సినిమాల్లో ఆమె యాక్టింగ్ కు అందరూ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా మోహన్ లాల్ కూడా కీలక పాత్ర పోషించిన సినిమా నెరులో కళ్లు లేకపోయినా తనను రేప్ చేసిన నిందితుణ్నిి పట్టించే అమ్మాయిగా అనస్వర గొప్పగా నటించింది. ఆ సినిమాకు గాను సైమా, ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకుంది.
తెలుగు డెబ్యూ
ఇప్పుడు రోషన్ హీరోగా డిసెంబర్ 25న రిలీజైన ఛాంపియన్ సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది అనస్వర. ఇందులో తళ్లపూడి చంద్రకళ అనే విలేజీ అమ్మాయి క్యారెక్టర్ ప్లే చేసింది ఆమె. ఇదో పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్. ఈ రోజు విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. తెలుగులో ఇట్లు అర్జున సినిమా కూడా చేస్తోంది. 7/జి రెయిన్ బో కాలనీ 2 (తెలుగు/తమిళం)లోనూ నటిస్తోంది అనస్వర.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


