Bigg Boss Dakkshi: గ్లామరస్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్‌ను షేక్ చేస్తున్న దక్షి గుత్తికొండ (Dakkshi Guttikonda) తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నారు. బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్‌లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి హాట్ టాపిక్‌గా మారిన ఈ బ్యూటీ ఎవరు, ఆమె నేపథ్యం, సినిమాలు, ఓటీటీ ప్రాజెక్టుల వివరాలు ఇక్కడ చూద్దాం.
తెలుగమ్మాయి దక్షి

దక్షి గుత్తికొండ పక్కా తెలుగమ్మాయి. ఆమె హైదరాబాద్, బెంగళూరులలో పెరిగారు. చిన్నప్పటి నుంచే కళారంగంపై మక్కువ పెంచుకున్న ఈమె మంచి క్లాసికల్ కూచిపూడి డ్యాన్సర్ కూడా. చదువు విషయానికి వస్తే, బెంగళూరులోని ప్రఖ్యాత నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) నుంచి ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు.
సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, మోడలింగ్ రంగంలో తనదైన ముద్ర వేసి పలు కమర్షియల్ యాడ్స్, ప్రింట్ షూట్‌లలో మెరిశారు.
ఆర్జీవీ హీరోయిన్ గా
దక్షి గుత్తికొండ ఇప్పటికే సినిమాలు, ఓటీటీ స్పెషల్స్ లోనూ నటించారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పణలో అగస్త్య మంజు తెరకెక్కించిన 'కరోనా వైరస్' (Coronavirus - 2020) చిత్రంతో దక్షి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. లాక్‌డౌన్ సమయంలో వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో 'రాణి' అనే కీలకమైన కోడలి పాత్రలో నటించారు దక్షి.
భయం, భావోద్వేగాలను పండించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు దక్షి. ఆ తర్వాత హీరో నితిన్ నటించిన కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్' (Extra-Ordinary Man) సినిమాలో హీరో మరదలి పాత్రలో కనిపించి మెప్పించారు.
ఓటీటీలోనూ
ఓటీటీ, డిజిటల్ స్పేస్‌లోనూ దక్షి మంచి అవకాశాలను దక్కించుకున్నారు. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమ్ అయిన 'కొత్త పోరుడు' (Kotta Poradu) వంటి ప్రాజెక్ట్‌లతో పాటు, విభిన్న కథాంశాలతో రూపొందిన పలు వెబ్ సిరీస్‌లలో ఆమె నటించారు. అంతేకాకుండా, థ్రిల్లర్ సినిమాల స్పెషలిస్ట్ దర్శకుడు శేఖర్ సూరి రూపొందించిన సరికొత్త ఇన్వెస్టిగేటివ్ వెబ్ సిరీస్‌లోనూ ఆమె కీలక పాత్ర పోషించారు.
{{/usCountry}}ఓటీటీ, డిజిటల్ స్పేస్‌లోనూ దక్షి మంచి అవకాశాలను దక్కించుకున్నారు. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమ్ అయిన 'కొత్త పోరుడు' (Kotta Poradu) వంటి ప్రాజెక్ట్‌లతో పాటు, విభిన్న కథాంశాలతో రూపొందిన పలు వెబ్ సిరీస్‌లలో ఆమె నటించారు. అంతేకాకుండా, థ్రిల్లర్ సినిమాల స్పెషలిస్ట్ దర్శకుడు శేఖర్ సూరి రూపొందించిన సరికొత్త ఇన్వెస్టిగేటివ్ వెబ్ సిరీస్‌లోనూ ఆమె కీలక పాత్ర పోషించారు.
{{/usCountry}}డిజిటల్ ప్రాజెక్టు 'లివింగ్ మై డ్రీమ్'తో పాటు, జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోలోనూ పాల్గొని సందడి చేశారు.
సినిమాల్లోకి రాకముందు పరిశ్రమలో ఎదురైన కాస్టింగ్ కౌచ్, ఇతర చేదు అనుభవాలపై ఓపెన్‌గా మాట్లాడి తన ధైర్యాన్ని చాటుకున్నారు. సోషల్ మీడియాలో నిత్యం బోల్డ్, ట్రెండీ ఫోటోషూట్‌లు, రీల్స్‌తో లక్షలాది మంది ఫాలోవర్లను అలరించే దక్షి, బిగ్ బాస్ హౌస్‌లో తన గేమ్ ప్లాన్, గ్లామర్, గట్స్‌తో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.