...
...
Next Story

Sangeeta Vijay: రూ.400 కోట్ల ఆస్తికి వారసురాలు.. విజయ్‌తో విడాకుల కోసం కోర్టుకెక్కిన ఈ సంగీత ఎవరో తెలుసా?

తమిళ స్టార్ విజయ్, అతని భార్య సంగీత (Sangeeta Vijay) విడాకుల వార్త కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. లండన్ నుంచి వచ్చిన వీరాభిమానిగా విజయ్‌ను పెళ్లాడిన సంగీత.. 27 ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతూ కోర్టుకెక్కింది. వీరిద్దరి ప్రేమకథ, పిల్లలు, విడాకుల పిటిషన్‌లోని పూర్తి వివరాలు ఇవే.

Published on: Feb 27, 2026, 20:31:41 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

తమిళ సినీ రంగంలో ‘దళపతి’గా, రాజకీయాల్లో ‘టీవీకే’ అధినేతగా వెలుగొందుతున్న విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు క్లిష్ట దశలో ఉంది. అతని భార్య సంగీత స్వర్ణలింగం చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య ఇంతటి దూరం ఎందుకు పెరిగింది? ఎవరీ సంగీత? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

లండన్ నుంచి వచ్చిన ప్రేమాభిమాని

Sangeeta Vijay: రూ.400 కోట్ల ఆస్తికి వారసురాలు.. విజయ్‌తో విడాకుల కోసం కోర్టుకెక్కిన ఈ సంగీత ఎవరో తెలుసా?
Sangeeta Vijay: రూ.400 కోట్ల ఆస్తికి వారసురాలు.. విజయ్‌తో విడాకుల కోసం కోర్టుకెక్కిన ఈ సంగీత ఎవరో తెలుసా?

సంగీత స్వర్ణలింగం లండన్ లో స్థిరపడిన శ్రీలంక తమిళ పారిశ్రామికవేత్త కుమార్తె. 1996లో వచ్చిన ‘పూవే ఉనక్కాగా’ సినిమా చూసి ఆమె విజయ్‌కు వీరాభిమానిగా మారింది. లండన్ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలోనే ఆమె విజయ్‌కు అనేక లేఖలు రాసేది.

కేవలం విజయ్‌ను కలవడం కోసమే ఆమె లండన్ నుంచి చెన్నై వచ్చింది. షూటింగ్ సెట్‌లో విజయ్‌ను కలిసి అభినందనలు తెలిపిన ఆమె పద్ధతి నచ్చడంతో.. విజయ్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారి, 1999 ఆగస్టు 25న హిందూ, క్రైస్తవ సంప్రదాయాల్లో వీరి పెళ్లి జరిగింది.

తెర వెనుక సంగీత..

సంగీత ఎప్పుడూ లో-ప్రొఫైల్ మెయింటైన్ చేసేది. విజయ్ ఇంత పెద్ద స్టార్ అయినప్పటికీ.. ఆమె మీడియా కళ్లలో పడకుండా దూరంగా ఉండేది. పలు రిపోర్టుల ప్రకారం.. తమిళ చిత్ర పరిశ్రమలో విజయ్ కంటే సంగీతకే ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారు.

అజిత్ భార్య శాలిని వంటి వారితో ఆమెకు మంచి అనుబంధం ఉంది. ప్రస్తుతం లండన్‌లో ఉంటూ తన కుటుంబ వ్యాపారాలను చూసుకుంటున్న సంగీతకు సుమారు రూ. 400 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

పిల్లల విషయానికొస్తే..

సంగీత దాఖలు చేసిన పిటిషన్‌లో విజయ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. 2021లో విజయ్ ఒక ప్రముఖ నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసిందని, అది తనను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిందని ఆమె పేర్కొంది.

సదరు నటి విజయ్‌తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నా అతడు ఖండించలేదని, అది తనను, పిల్లలను సమాజం ముందు తలదించుకునేలా చేసిందని వాపోయింది.

విజయ్ తనను సామాజిక, వృత్తిపరమైన కార్యక్రమాలకు దూరం పెట్టారని, ఆర్థిక ఆంక్షలు విధించారని ఆమె ఆరోపించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. కోర్టు విజయ్‌కు నోటీసులు జారీ చేస్తూ, ఏప్రిల్ 20న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe