స్మృతి మంధానాను పెళ్లి చేసుకోబోతున్న పలాష్ ముచ్చల్ ఎవరో తెలుసా? బాలీవుడ్‌లో అతని ప్రస్థానం ఇలా
స్మృతి మంధానాను పెళ్లి చేసుకోబోతున్న పలాష్ ముచ్చల్ ఎవరో తెలుసా? అతని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ గా అతని ప్రస్థానం ఎలా ఉందో ఇక్కడ చూడండి.
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మ్యూజిక్ కంపోజర్-ఫిల్మ్‌మేకర్ పలాష్ ముచ్చల్‌తో తన నిశ్చితార్థాన్ని ధృవీకరించిన విషయం తెలుసు కదా. ఆమె తన నిశ్చితార్థాన్ని తన టీమ్‌మేట్స్‌తో కలిసి చేసిన ఒక సరదా ఇన్‌స్టాగ్రామ్ రీల్‌తో అనౌన్స్ చేయడం ఇంటర్నెట్‌ను ఆకర్షించింది. మరి ఆమెకు కాబోయే భర్త పలాష్ ఎవరు? ఏం చేస్తాడు అన్న వివరాలు మీకు తెలుసా?

స్మృతి మంధాన ఎంగేజ్‌మెంట్, పెళ్లి
స్మృతి మంధాన గురువారం (నవంబర్ 20) ఓ వీడియోలో కనిపించిన విషయం తెలుసు కదా. వైరల్ అయిన ఈ క్లిప్‌లో ఆమె తన టీమ్‌మేట్స్ అయిన జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్‌తో కలిసి 'లగే రహో మున్నా భాయ్' సినిమాలోని "సంఝో హో హీ గయా" పాటకు డ్యాన్స్ చేసింది. ఈ వీడియో ద్వారానే తన ఎంగేజ్‌మెంట్ గురించి ఆమె చెప్పింది. అంతేకాదు వీరిద్దరి వివాహం నవంబర్ 23న జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పలాష్ ముచ్చల్ నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో స్మృతికి ప్రపోజ్ చేశాడు. అతడు ఆ వీడియోను షేర్ చేస్తూ.. "ఆమె ఎస్ చెప్పింది" అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రపోజల్ సమయంలో స్మృతి రెడ్ గౌనులో, పలాష్ గ్రే-బ్లాక్ సూట్‌లో కనిపించారు.
ఈ నిశ్చితార్థ ప్రకటన భారత మహిళా జట్టు సౌత్ ఆఫ్రికాను ఓడించి 2025 ప్రపంచ కప్‌ను గెలిచిన కొద్ది వారాలకే వచ్చింది. వైస్-కెప్టెన్ అయిన మంధాన ఈ టోర్నమెంట్‌లో తొమ్మిది గేమ్‌లలో 434 పరుగులు చేసి, తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రపంచ కప్ ప్రదర్శనను ఇచ్చింది.
పలాష్ ముచ్చల్ గురించి
పలాష్ ముచ్చల్ 1995లో ఇండోర్‌లో జన్మించాడు. క్లాసికల్ సింగర్‌గా శిక్షణ పొందాడు. 2014లో 'డిష్కియాన్' సినిమాతో బాలీవుడ్‌లో మొదటి బ్రేక్ అందుకున్నాడు. ఆ తర్వాత 'స్వీటీ వెడ్స్ ఎన్నారై', 'మిస్ తనక్‌పూర్ హాజిర్ హో' వంటి చిత్రాలకు పనిచేశాడు. అతడు ప్రస్తుతం అవికా గోర్, చందన్ రాయ్ నటిస్తున్న 'రాజు బజేవాలా' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. పలాష్ ప్రముఖ గాయని పలక్ ముచ్చల్ తమ్ముడు కావడం విశేషం.
స్మృతి, పలాష్ 2019లో డేటింగ్ ప్రారంభించారు. చాలా కాలం పాటు తమ సంబంధాన్ని రహస్యంగా ఉంచి, ఐదు సంవత్సరాల బంధాన్ని సూచిస్తూ 2024 జులైలో ఒక యానివర్సరీ ఫొటోను పోస్ట్ చేయడం ద్వారా బహిరంగపరిచారు.
ప్రపంచ కప్ విజయం తర్వాత మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ సోషల్ మీడియాలో పంచుకున్న ఒక పోస్ట్ ద్వారా అభిమానుల దృష్టిని మరింత ఆకర్షించాడు. ఇండియా కప్ గెలిచిన తర్వాత పలాష్.. కప్‌ను పట్టుకున్న స్మృతి ఫోటోను పోస్ట్ చేశాడు. ఆ ఫోటోకు "నేను ఇంకా కల కంటున్నానా?" అని క్యాప్షన్ ఇచ్చాడు.
ఈ క్రమంలో పలాష్ చేయిపై ఉన్న ఒక కొత్త టాటూను అభిమానులు గమనించారు. దానిపై "SM18" అని ఉంది. ఇది స్మృతి మంధాన ఇనీషియల్స్, ఆమె జెర్సీ నంబర్ (18)కు స్పష్టమైన సంకేతం అని తేలిపోయింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


