...
...
Next Story

TVK Vijay : దళపతి విజయ్ ప్లేస్ రిప్లేస్ చేసే హీరో ఎవరు? సినిమా ఇండస్ట్రీలో మార్పు వస్తుందా?

TVK Vijay Victory : తమిళనాడు రాజకీయాలు.. సినిమాను వేరువేరుగా చూడలేం. ఇప్పుడు కూడా అదే రిపీట్ అయింది. టీవీకే విజయం తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

Published on: May 4, 2026, 18:10:54 IST
Advertisement

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభంజనం సృష్టించడం కేవలం రాజకీయాల్లోనే కాదు, దక్షిణ భారత సినీ పరిశ్రమలోనూ పెను సంచలనాన్ని రేపుతోంది. దళపతి విజయ్ ఒక సూపర్ స్టార్ హోదా నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అనేది కోలీవుడ్ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేయనుంది.

సినిమా పవర్ సెంటర్

టీవీకే విజయ్
టీవీకే విజయ్

దశాబ్దాలుగా తమిళ చిత్ర పరిశ్రమపై రాజకీయ పార్టీల (DMK, AIADMK) పరోక్ష ఆధిపత్యం ఉండేది. థియేటర్ల కేటాయింపు నుంచి టికెట్ ధరల వరకు ప్రభుత్వాల జోక్యం ఉండేది. ఇప్పుడు సాక్షాత్తు ఒక అగ్ర హీరోనే అధికారంలోకి రావడంతో, సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలు నేరుగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. పరిశ్రమపై పట్టు ఇప్పుడు సినీ నేపథ్యం ఉన్న నాయకుడికి బదిలీ అయ్యింది.

దళపతి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?

విజయ్ రాజకీయాల కోసం సినిమాలకు పూర్తిగా స్వస్తి పలికారు. ఏటా రూ. 500-1000 కోట్ల బిజినెస్ చేసే ఒక భారీ మార్కెట్ ఇప్పుడు ఖాళీ అయ్యింది. ఆయన వదిలిన నంబర్ 1 స్థానం కోసం అజిత్, సూర్య, ధనుష్, శివకార్తికేయన్, విక్రమ్, విజయ్ సేతుపతి, కార్తీ వంటి హీరోల మధ్య పోటీ పెరగనుంది. రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి కథనాయకులు ఆల్‌రెడీ చూడాల్సిన టాప్ ఇమేజ్‌ని చూసేశారు. విజయ్ సినిమాలకు ఉండే భారీ ఓపెనింగ్స్, ఫ్యాన్ బేస్‌ను ఏ హీరో తన వైపు తిప్పుకుంటారనేది ఇప్పుడు కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చ.

చిన్న సినిమాలకు ప్లస్ అవుతుందా?

విజయ్ తన ప్రచారంలో కళాకారుల సంక్షేమం గురించి కూడా మాట్లాడారు. ఆయన గెలుపుతో షూటింగ్ పర్మిషన్లు సులభతరం కావడం, చిన్న సినిమాలకు సబ్సిడీలు పెరగడం వంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే, చలనచిత్ర కార్మికుల సమస్యలపై ఆయనకు పూర్తి అవగాహన ఉండటం పరిశ్రమకు ప్లస్ పాయింట్.

సినిమా కథల్లో కొత్త ఒరవడి

తమిళ చిత్రసీమలో డీఎంకే, ఆ పార్టీ కుటుంబానికి చెందిన రెడ్ జెయింట్ అనే సంస్థ, డీఎంకే పాలనలో సినిమా నిర్మాణం, పంపిణీపై ఆధిపత్యం చెలాయించింది. రెడ్ జెయింట్ మూవీస్ చాలా థియేటర్లను నియంత్రిస్తోందని, ఇతర చిత్రాలను విడుదల చేయమని ఒత్తిడి చేస్తోందని చిత్ర పరిశ్రమలో పదేపదే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు విజయ్ రాకతో ఇందులో మార్పులు వస్తాయని అనుకుంటున్నారు.

సినీ ప్రముఖుల స్పందన

విజయ్ గెలుపుపై సినీ లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. చియాన్ విక్రమ్, శివకార్తికేయన్ వంటి హీరోలతో పాటు తెలుగు ఇండస్ట్రీ నుంచి నాని, నిఖిల్ వంటి నటులు కూడా దళపతికి శుభాకాంక్షలు తెలిపారు.

తమిళనాడు రాజకీయ చరిత్రలో ఎంజీఆర్, జయలలిత తర్వాత సినీ గ్లామర్‌ను అద్భుతమైన రాజకీయ శక్తిగా మార్చిన ఘనత విజయ్‌కే దక్కుతుంది. ఆయన గెలుపు కోలీవుడ్‌కు ఒక రక్షణ కవచంలా మారుతుందని, అదే సమయంలో సినిమా వ్యాపారంలో ఒక కొత్త శకానికి నాంది పలుకుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe