Zayn Marie Khan: వైరల్‌గా డెకాయిట్ బ్యూటీ-ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఈ జైన్ మేరీ ఖాన్ ఎవరు? అమీర్ ఖాన్‌కు ఏమవుతుంది?
Zayn Marie Khan: ఇప్పుడు నెట్టింగ్ ఈ భామ ఫొటోలు తైగ వైరల్ గా మారాయి. అందంతో చంపేస్తుందా ఏంటీ? అంటూ ఈ నటి పిక్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఈ డెకాయిట్ బ్యూటీ ఎవరు? అమీర్ ఖాన్ కు ఏమవుతుంది? అన్నది ఇక్కడ చూసేయండి.
అడివి శేష్, మృనాల్ ఠాకూర్ జంటగా నటించిన మూవీ ‘డెకాయిట్’. రాబరీ నేపథ్యంలో లవ్, యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కింది. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందుకోసం ముంబయిలో, హైదరాబాద్ లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లు నిర్వహించారు. ఈ ఈవెంట్లలో అందరి ఫోకస్ నటి జైన్ మేరీ ఖాన్ మీదే పడింది.

జైన్ మేరీ ఖాన్
ఇప్పుడు ఇంటర్నెట్ లో, సోషల్ మీడియాలో జైన్ మేరీ ఖాన్ పేరు, ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందాల భీభత్సంతో అదరగొట్టిన ఈ బ్యూటీ ఎవరు? అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇది బోల్డ్ అరాచకం అంటూ జైన్ మేరీ ఖాన్ ఫొటోలు, వీడియోలు షేర్ చేసేస్తున్నారు.
ట్రైలర్ కంటే కూడా
ఇటీవల డెకాయిట్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. లవ్, యాక్షన్, రివేంజ్ తో సాగే ఈ ట్రైలర్ అదిరిపోయింది. అయితే ట్రైలర్ కంటే కూడా జైన్ మేరీ ఖాన్ వైరల్ గా మారిందని చెప్పొచ్చు. డెకాయిట్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న జైన్ మేరీ ఖాన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఎవరీ జైన్?
జైన్ మేరీ ఖాన్ ముంబయి నటి. ఇప్పుడు ఆమె ఏజ్ 31 ఏళ్లు. బాలీవుడ్ లోని పాపులర్ ఖాన్-హుస్సేన్ ఫ్యామిలీలో జైన్ పుట్టింది. డైరెక్టర్ మన్సూర్ ఖాన్ కూతురే ఈ జైన్ మేరీ ఖాన్. కపూర్ అండ్ సన్స్ (2016), సీక్రెట్ సూపర్ స్టార్ (2017) సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా జైన్ పని చేసింది.
అమీర్ ఖాన్ తో
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కు జైన్ మేరీ ఖాన్ మేనకోడలు అవుతుంది. హిందీ నటులు ఇమ్రాన్ ఖాన్, జునైద్ ఖాన్ ఆమెకు కజిన్స్ అవుతారు. 2020లో వచ్చిన మిసెస్ సీరియల్ కిల్లర్ సినిమాతో జైన్ మేరీ ఖాన్ డెబ్యూ చేసింది. ఆ తర్వాత మోనికా ఓ మై డార్లింగ్ సినిమాలో యాక్ట్ చేసింది.
ఫీల్స్ లైక్ ఇష్క్, ఆర్యన్ అండ్ మీరా, మేడ్ ఇన్ హెవెవ్, ఇల్లీగల్ అనే వెబ్ సిరీస్ ల్లో తన యాక్టింగ్ తో జైన్ మెప్పించింది.
డెకాయిట్ తో
డెకాయిట్ సినిమాతో జైన్ మేరీ ఖాన్ తెలుగులోకి డెబ్యూ చేసింది. ఈ మూవీలో ఆమె పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. డెకాయిట్ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇందులో మరో బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కూడా నటించాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


