lalit modi: సుస్మితా సేన్‌తో బ్రేకప్‌పై నోరు విప్పిన లలిత్ మోదీ.. రెండేళ్ల తర్వాత బయటపడ్డ అసలు నిజం!

lalit modi: మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్, బిజినెస్ మ్యాన్ లలిత్ మోదీ రిలేషన్ షిప్ ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. కానీ ఆ తర్వాత వీళ్లు బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ బ్రేకప్ కారణం ఏంటో ఐపీఎల్ ఫౌండర్ కూడా అయిన  లలిత్ మోదీ తాజాగా వెల్లడించాడు. సంచలన విషయాలు చెప్పాడు.

Published on: Jun 2, 2026, 12:37:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

lalit modi: 2022లో బాలీవుడ్ నటి సుస్మితా సేన్, ఐపీఎల్ మాజీ బాస్ లలిత్ మోదీల ప్రేమాయణం సోషల్ మీడియాను ఎంతగా ఊపేసిందో అందరికీ తెలిసిందే. అప్పట్లో వీరిద్దరి ఫోటోలు వైరల్ అయినప్పుడు నెటిజన్లు, ముఖ్యంగా కొందరు ట్రోలర్స్ సుస్మితా సేన్‌ను టార్గెట్ చేస్తూ 'గోల్డ్ డిగ్గర్' అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

సుస్మితా సేన్‌తో బ్రేకప్‌పై నోరు విప్పిన లలిత్ మోదీ (x)
సుస్మితా సేన్‌తో బ్రేకప్‌పై నోరు విప్పిన లలిత్ మోదీ (x)

అయితే, తాజాగా 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' (Humans of Bombay) పాడ్‌కాస్ట్‌లో లలిత్ మోదీ చేసిన వ్యాఖ్యలు ఆ ట్రోల్స్‌కు పరోక్షంగా చెక్ పెట్టడమే కాకుండా, వారి బంధం ముగియడానికి గల అసలు 'లాజిస్టికల్' కారణాన్ని బయటపెట్టాయి.

బ్రేకప్ స్టోరీ

వారాల తరబడి లలిత్ మోదీ, సుస్మితా సేన్ డేటింగ్ వార్త మీడియాలో మారుమోగింది. అయితే, ఎంత వేగంగా వీరి ప్రేమాయణం తెరపైకి వచ్చిందో, అంతే వేగంగా వీరిద్దరూ విడిపోయారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ బ్రేకప్ వెనుక ఉన్న అసలు కారణాన్ని లలిత్ మోదీ ఇప్పటివరకు ఎక్కడా అధికారికంగా పంచుకోలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన సుస్మితా సేన్‌తో తన బంధం ఎందుకు ముగిసిందో వివరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

లలిత్ మోదీ ఏం చెప్పాడంటే?

'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న లలిత్ మోదీ.. సుస్మితా సేన్‌తో తనకున్న అనుబంధాన్ని, విడిపోవడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు.

"నా జీవితంలో సుస్మిత చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి, వ్యక్తిగా ఎదగడానికి ఆమె ఎంతో దోహదపడింది. ఆ సమయంలో ఆమె నా జీవితంలో ఒక ముఖ్య భాగం, ఒకవేళ పరిస్థితులు అనుకూలించి ఉంటే ఈ రోజు కూడా అలాగే ఉండేదేమో. కానీ మా ఇద్దరి మధ్య ఉన్న భౌగోళిక దూరమే మా బంధానికి అడ్డుగా మారింది" అని లలిత్ మోదీ పేర్కొన్నాడు.

వేర్వేరు దేశాల్లో

తమ వృత్తిపరమైన జీవితాల కారణంగా వేర్వేరు దేశాల్లో ఉండటమే సుస్మితా సేన్ తో బ్రేకప్ కు కారణమని లలిత్ మోదీ స్పష్టం చేశాడు. "సుస్మితా కెరీర్ మొత్తం ఇండియాలో ఉంది. నా జీవితం, వ్యాపారాలు లండన్‌లో ఉన్నాయి. అయినప్పటికీ, మా మధ్య ఉన్నది చాలా ప్రత్యేకమైన బంధం. ఆమెతో గడిపిన ప్రతి క్షణం నాకు మధురమైన జ్ఞాపకం. ఆమె ఇప్పటికీ నాకు ఎంతో ఆప్తురాలైన స్నేహితురాలు. ఆమె ఎప్పుడూ బాగుండాలని నేను కోరుకుంటాను.

ఇద్దరు ఆడపిల్లలను ఒంటరిగా పెంచి పెద్ద చేసిన విధానం చూస్తే ఆమెపై గౌరవం పెరుగుతుంది. ఒక సింగిల్ మదర్‌గా ఆమె తన జీవితంలో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆమె ఎదుగుదలను చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆమె తల్లిదండ్రులు కూడా చాలా గొప్పవారు. సుస్మితకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు" అని లలిత్ మోదీ ప్రశంసలు కురిపించాడు.

లవ్ స్టోరీ బ్యాక్‌గ్రౌండ్

2022 నాటి రోజుల్లోకి వెళ్తే.. లలిత్ మోదీ మాల్దీవులు, సార్డీనియా టూర్లకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సుస్మితా సేన్‌తో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించాడు. ఆ ఫోటోల్లో వీరిద్దరూ ఎంతో క్లోజ్‌గా కనిపించారు. అంతటితో ఆగకుండా తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో సైతం 'మై లవ్' అంటూ సుస్మితా సేన్ అకౌంట్‌ను ట్యాగ్ చేశాడు.

ఆ తర్వాత 2025లో లలిత్ మోదీ తన కొత్త భాగస్వామి రీమా బౌరిని పరిచయం చేస్తూ సుస్మితా సేన్‌తో బ్రేకప్‌ను పరోక్షంగా ఖరారు చేశాడు. 25 ఏళ్ల స్నేహం ప్రేమగా మారిందంటూ రీమాతో ఉన్న వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అంతకుముందు లలిత్ మోదీ 1991లో మీనల్ మోదీని వివాహం చేసుకోగా, ఆమె 2018లో క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

  1. లలిత్ మోదీ, సుస్మితా సేన్ ఎందుకు విడిపోయారు?

వారిద్దరి మధ్య ఉన్న భౌగోళిక దూరమే విడిపోవడానికి ప్రధాన కారణం. సుస్మితా సేన్ కెరీర్ భారతదేశంలో ఉండగా, లలిత్ మోదీ లండన్‌లో నివసిస్తున్నాడు.

2. లలిత్ మోదీ, సుస్మితా సేన్ ఎప్పుడు డేటింగ్ చేశారు?

వీరిద్దరూ 2022లో తాము రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు.

3. ప్రస్తుతం లలిత్ మోదీ ఎవరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు?

లలిత్ మోదీ తన 25 ఏళ్ల పాత స్నేహితురాలు రీమా బౌరితో ప్రేమలో ఉన్నట్లు 2025లో ప్రకటించాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More